42 ఎకరాల్లో ఉన్న విల్లాను బహుమతిగా ఇచ్చేస్తున్న ప్రభుత్వం! ఎక్కడంటే?

సిటీలో ఒక చిన్న విల్లా కొనాలంటే 4,5 కోట్లు అవుతుంది. అలాంటిది ప్రభుత్వం ఆ విల్లాను ఫ్రీగా ఇచ్చేయాలని నిర్ణయించుకుంది. అది కూడా 42 ఎకరాల్లో ఉన్న విల్లాని. 42 ఎకరాల్లో ఉన్న విల్లా అంటే వేల కోట్లు ఉండదు. మరెందుకు ప్రభుత్వం ఆ విల్లాని ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. అసలు కథేంటి? 

సిటీలో ఒక చిన్న విల్లా కొనాలంటే 4,5 కోట్లు అవుతుంది. అలాంటిది ప్రభుత్వం ఆ విల్లాను ఫ్రీగా ఇచ్చేయాలని నిర్ణయించుకుంది. అది కూడా 42 ఎకరాల్లో ఉన్న విల్లాని. 42 ఎకరాల్లో ఉన్న విల్లా అంటే వేల కోట్లు ఉండదు. మరెందుకు ప్రభుత్వం ఆ విల్లాని ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. అసలు కథేంటి? 

విల్లా అంటే తెలుసుగా.. విశాలంగా, విలాసవంతమైన సౌకర్యాలతో కోట్లు ధర రేంజ్ లో ఉంటాయి. ఒక 100 గజాల విల్లానే కోట్లు 2, 3 ఉంటాయి. ఇంకా గట్టిగా మాట్లాడితే 10 నుంచి 100 కోట్లు పలికే విల్లాలు కూడా ఉన్నాయి. అయితే అదే విల్లా 42 ఎకరాల్లో ఉంటే ఎన్ని వేల కోట్లు ఉంటుంది. మరి అలాంటి విల్లాని ఉచితంగా ఇస్తే? అంటే అన్నాడు గానీ ఆ ఊహ ఎంత బాగుందో కదా అని అనుకుంటున్నారా? ఇది నిజంగానే నిజం. అవును 42 ఎకరాల్లో ఉన్న విల్లాని ప్రభుత్వం బహుమతిగా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఎక్కడంటే?  

జర్మనీ నియంత హిట్లర్ గురించి తెలియని వారు ఉండరు. ఆయనకు అత్యంత సన్నిహితుల్లో ఒకరు జోసెఫ్ గోబెల్స్. ఈయన నాజీ పార్టీకి ప్రధాన ప్రచారకుడిగా పని చేశాడు. అప్పట్లో న్యూస్ పేపర్లు, రేడియోలు, సినిమాల ద్వారా నాజీ భావజాలాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. జర్మనీ రాజధాని బెర్లిన్ కి 25 మైళ్ళ దూరంలో ఈయనకు ఒక విల్లా ఉంది. 1936లో ఆ విల్లాని కట్టారు. సుమారు 42 ఎకరాల్లో ఉంది ఈ విల్లా. గోబెల్స్ ఈ విల్లాని అనేక అవసరాలకు వాడుకున్నాడని.. అందులో పలువురు సినిమా హీరోయిన్స్ తో సంబంధాలు కూడా వ్యవహారం నడిపాడని పలు కథనాలు వచ్చాయి. హిట్లర్ కాలం అంతమైపోయింది. అందరూ పోయారు. ప్రస్తుతం ఈ విల్లా అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది. అయితే దీని నిర్వహణ ఖర్చు ప్రభుత్వానికి భారంగా ఉండడం.. నాజీ పాలనకు చెందిన విల్లా కావడంతో దీన్ని ఎలాగైనా వదిలించుకోవాలని చూస్తుంది.

మొదట్లో ఎంతోకొంతకు అమ్మేయాలని అనుకున్నా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఫ్రీగా తీసుకోండిరా బాబూ అని ప్రకటన ఇచ్చింది. దీనిపై ఆర్థిక మంత్రి స్టెఫాన్ ఎవర్స్ మాట్లాడుతూ.. ఈ విల్లాను ఎవరైనా సొంతం చేసుకోవాలని అనుకుంటే కనుక దాన్ని ప్రభుత్వం బహుమతిగా అందజేస్తుంది అని అన్నారు. 2000వ సంవత్సరం నుంచి ఈ విల్లాలో ఎవరూ ఉండడం లేదు. ఆ విల్లాను చూస్తే మెయింటెనెన్స్ సరిగా లేక దెబ్బ తింటోంది. దీంతో బహుమతిగా అయినా ఇచ్చేసి వదిలించుకోవాలని చూస్తుంది. ప్రైవేటు వ్యక్తులు ఎవరూ రాకపోతే దాన్ని కూల్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా  ఉంటే రెండో ప్రపంచ యుద్ధం ముగింపు సమయంలో గోబెల్స్.. తన భార్య, ఆరుగురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో అక్కడి జనం ఆ విల్లాని ఉచితంగా తీసుకోవడానికి కూడా ముందుకు రావడం లేదన్న వాదనలు ఉన్నాయి. మరి ఇలాంటి ఆఫర్ మీకు ఇస్తే మీరేం చేస్తారో కామెంట్ చేయండి. 

Show comments