మహిళా బిలియనీర్ కు మరణ శిక్ష.. ఆమె చేసిన తప్పేంటో తెలుసా?

చట్టానికి ఎవరూ కూడా అతీతులు కాదు. తప్పు చేస్తే చట్టం ముందు తలొగ్గాల్సిందే. ఓ దేశంలో ఓ మహిళా బిలియనీర్ కు మరణ శిక్ష పడింది. ఇంతకీ ఆమె చేసిన తప్పు ఏంటంటే?

చట్టానికి ఎవరూ కూడా అతీతులు కాదు. తప్పు చేస్తే చట్టం ముందు తలొగ్గాల్సిందే. ఓ దేశంలో ఓ మహిళా బిలియనీర్ కు మరణ శిక్ష పడింది. ఇంతకీ ఆమె చేసిన తప్పు ఏంటంటే?

తప్పు చేస్తే ఎంతటి వ్యక్తులైన శిక్ష అనుభవించాల్సిందే. చట్టానికి ఎవరు చుట్టం కాదు. అధికార దాహంతో.. అక్రమాలకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆర్థిక నేరాలకు పాల్పడే వారి పట్ల దర్యాప్తు సంస్థలు ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. స్కాములు చేసి, ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని కటకటాల్లోకి పంపిస్తున్నారు. ఈ క్రమంలో వియత్నాం దేశంలో ఓ మహిళా బిలియనీర్ కు మరణ శిక్ష పడింది. ఆ దేశంలోనే అతిపెద్ద ఆర్థిక మోసం కేసులో దోషిగా తేలడంతో ఆమెకు మరణశిక్ష విధిస్తూ హోచిమిన్ నగరంలోని ఓ కోర్టు గురువారం తీర్పునిచ్చిందని అక్కడి స్థానిక మీడియా వెల్లడిస్తోంది.

వియత్నాం దేశంలో బిలియనీర్ గా ప్రసిద్ధికెక్కిన 67 ఏళ్ల ట్రూంగ్ మై లాన్‌ వాన్ థిన్ ఫాట్ హోల్డింగ్స్ గ్రూప్’ అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి చైర్‌పర్సన్‌గా ఉన్నారు. కాగా ఈమె తన నియంత్రణలోనే ఉన్న ‘సైగాన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంక్‌’లో మోసానికి పాల్పడ్డారు. వందలు కాదు వేలు కాదు ఏకంగా లక్ష కోట్లను తన షెల్ కంపెనీకి బదిలీ చేసి ఆర్థిక నేరానికి పాల్పడ్డారు. కాగా సైగాన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంక్’ను ట్రూంగ్ మై లాన్ చట్టవిరుద్ధంగా నియంత్రించి లక్ష కోట్లను మళ్లించారు. 2022లో వియత్నాంలో అవినీతికి పాల్పడే వారి పట్ల చర్యలు తీవ్రమవడంతో ట్రూంగ్ లాన్ వ్యవహారం వెలుగు చూసింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు మరణ శిక్ష పడింది.

వియత్నంకు చెందిన ట్రూంగ్ మై లాన్ అంచెలంచెలుగా ఎదిగారు. సౌందర్య ఉత్పత్తుల విక్రేతగా ఆమె కెరియర్ ను ప్రారంభించి ఆతర్వాత స్థిరాస్తులుకొనుగోలు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూసింది లేదు. ఆమె సంపాదనకు హద్దే లేకుండా పోయింది. హోటళ్లు, రెస్టారెంట్లు స్థాపించి అనతి కాలంలోనే వ్యాపార వేత్తగా ఎదిగి చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో సైగాన్ కమర్షియల్ బ్యాంక్‌ ను నియంత్రించి ఆర్థిక నేరానికి పాల్పడింది. ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో ఆమెకు మరణశిక్ష పడింది.

Show comments