iDreamPost
android-app
ios-app

పాకిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.2 తీవ్రత నమోదు

  • Published Nov 15, 2023 | 10:03 AM Updated Updated Nov 15, 2023 | 10:03 AM

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా వరుసగా భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భూకంపాల ధాటికి ప్రాణ నష్టమే కాదు.. ఆస్తి నష్టం వాటిల్లుతుంది.

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా వరుసగా భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భూకంపాల ధాటికి ప్రాణ నష్టమే కాదు.. ఆస్తి నష్టం వాటిల్లుతుంది.

పాకిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.2 తీవ్రత నమోదు

ఇటీవల భారత ఉపఖండాన్ని వరుస భూకంపాలు పట్టి పీడిస్తున్నాయి. తరుచూ ఇక్కడి ప్రాంతాల్లో భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎక్కువగా భారత్, నేపాల్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక దేశాల్లో తరుచూ భూంకాలు సంభవిస్తున్నాయి. ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి నేపాల్ లో భారీ భూకంపం సంభవించి దాదాపు 160 మంది వరకు కన్నుమూశారు. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.4 గా నమోదు అయ్యింది. ఎన్నో కట్టడాలు కూలిపోయి.. భారీగా ఆస్తి నష్టం జరిగింది. నేపాల్ లో సంభవించిన భూకంప ప్రభావం భారత్ పై పడింది. ఢిల్లీ, ఎన్‌సీఆర్ సహా ఉత్తరాధిన పలు రాష్ట్రాల్లో భూమి ప్రకంపించింది. గత నెల ఆఫ్ఘనిస్థాన్ వరుసగా మూడుసార్లు భూకంపం రావడంతో రెండువేలకు పైగా మరణాలు సంభవించాయి. తాజాగా పాకిస్థాన్ లో భారీ భూకంపం సంభవించింది. వివరాల్లోకి వెళితే..

నిన్న శ్రీలంక రాజధాని కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.2 గా నమోదు అయ్యింది. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం మధ్యప్రాంతాల్లో ఈ భూకంపం సంభవించడంతో శ్రీలంక, సింగపూర్, మలేసియా దేశాలు ఒక్కాసారిగా ఉలిక్కపడ్డాయి. సునామీ వస్తుందేమో అన్న భయంతో వణికిపోయారు. ఇదిలా ఉంటే.. తెల్లవారుజామున పాకిస్థాన్ ఉత్తర ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.2గా నమోదు అయ్యింది. నాలుగు రోజుల వ్యవధిలో ఇది రెండో భూకంపం అని అంటున్నారు. భూమి కంపించడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. శనివారం కూడా పాకిస్థాన్ లో భూకంపం సంభవించింది.. రిక్టర్ స్కేల్ పై 4.1 తీవ్రతగా నమోదు అయ్యింది. ఈ రోజు తెల్లవారుజామున వచ్చిన భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో భూకంప తీవ్రత నమోదు అయినట్లు గుర్తించారు. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ కు ఈశాన్య దిక్కున, పాకిస్థాన్ భూభాగంపై ఉన్న ప్రాంతానికి భూకంప కేంద్రంగా గుర్తించారు. భూ ఉపరితలపై నుంచి 18 కిలోమీటర్ల లోతులో చేసుకున్న కదలికల వల్ల భూమి కంపించినట్లు సెస్మాలజీ సెంటర్ తెలిపింది. అయితే తరుచూ ఈ ప్రాంతాల్లో భూకంపాలు ఎందుకు వస్తున్నాయంటే.. భూమిలోని లోపల ప్లేట్లు ఢీ కొనడం వల్ల భూకంపాలు సంభవిస్తుంటాయి. అయితే మన భూమి 12 టెక్టోనిక్ ప్లేట్ల పై ఉందని జియాలజీ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ పలకలు ఢీ కొన్నప్పుడల్లా వెలువడే శక్తిని భూకంపం అంటారు. భూమిలోపల ఉన్న ఈ ప్లేట్లు తిరగడం వల్ల వాటి స్థలం మారుతుండటం జరుగుతుంది.. అ సమయంలో అవి కిందకు జారిపోతాయి.. ఈ సమయంలో ప్లేట్లు ఒకదానికొకటి ఢీ కొనడం వల్ల భూకంపం సంభవిస్తుంది.