కొత్త చట్టం.. ఇంక ఆ ప్రాంతంలో కుక్కలు కనిపించవు!

Turkey: ఇటీవల కాలంలో జనాలపై కుక్కలు దాడులు చేస్తున్న ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఇది ఇలా ఉంటే.. వాటి నిర్మూలనకు ఓ కొత్త చట్టం వచ్చింది. దీని ద్వారా త్వరలో ఈ కుక్కలు కనిపించవు.

Turkey: ఇటీవల కాలంలో జనాలపై కుక్కలు దాడులు చేస్తున్న ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఇది ఇలా ఉంటే.. వాటి నిర్మూలనకు ఓ కొత్త చట్టం వచ్చింది. దీని ద్వారా త్వరలో ఈ కుక్కలు కనిపించవు.

ఇటీవల కాలంలో జనాలపై దాడులు చేస్తూ కుక్కలు కూడా వార్తల్లో నిలుస్తున్నాయి. రోడ్లపై నడిచేవారిపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయి. అంతేకాక చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరిపై దాడి చేస్తున్నాయి. వీధి కుక్కల దాడి ఘటనల్లో చాలా మంది మృతిచెందగా, మరెందరో తీవ్రంగా గాయపడ్డారు. ఇక వీటి నిర్మూలన ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. ఒక దేశం కుక్కల కోసం ఓ కొత్త చట్టం తీసుకొచ్చింది. దీంతో ఆ ప్రాంతంలో కుక్కలు కనబడవు. మరి.. అసలు ఆ చట్టం ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం….

సాధారణంగా శునకాలు లేని దేశాలు  ఉండవు. అయితే అలాంటి దేశంగా ఓ ప్రాంతం అవతరించబోతుంది. అరబ్ దేశాలకు సరిహద్దుగా ఉన్న టర్కీ దేశంలో ఈ కొత్త చట్టం వచ్చింది. డాగ్ ఫ్రీ కంట్రీ అంటూ ఇక్కడి ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. వీధుల్లో తిరిగే లక్షలాది పట్టి వాటిని షెల్టర్లలో పెట్టాలని టర్కీ పార్లమెంట్ మంగళవారం జూలై 30 ఓ బిల్లును ఆమోదించింది. టర్కీలో ఉన్న దాదాపు 4 మిలియన్ల శునకాలను పట్టి షెల్టర్లకు తరలించాలని ఈ చట్టంలో పేర్కొన్నారు. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ పార్టీ ఈ కొత్త చట్టాన్ని ప్రతిపాదించారు.

ఇక ఈ న్యూ యాక్ట్ ప్రకారం.. మున్సిపాలిటీలు, పట్టణాల్లోని వీధుల్లో విచ్చలవిడిగా తిరిగే కుక్కులను పట్టి షెల్టర్లలో పెట్టాలని పేర్కొన్నారు. చికిత్సతో నయం చేయలేనివ్యాధులున్న కుక్కలను పూర్తిగా నిర్మూలించాలని చట్టంలో పేర్కొన్నారు. టర్కీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టంపై యానిమల్ లవర్స్ తీవ్ర వ్యతిరేకతను  చూపిస్తున్నారు. అంతేకాక ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆందోనలు చేస్తున్నారు. కుక్కలు చట్టాలు చేయడం టర్కీలో కొత్తేమి కాదు. గతంలోనూ కుక్కల నియంత్రణకు ఆదేశంలో పలు చట్టాల ఉన్నాయి. అయితే తాజాగా మరో చట్టాని ఆ దేశ ప్రభుత్వం తీసుకొచ్చింది. టర్కీ లెక్కల ప్రకారం.. ఆ దేశంలో 4 మిలియన్లు  శునకాలున్నాయి.

గత 20 యేళ్లలో 2.5 మిలియన్ల కుక్కలను మున్సిపాలిటీలు ఆరోగ్యంగా తీర్చిదిద్దాయి. ఈ కొత్త చట్టం ప్రకారం.. ఒక్కో సంరక్షణ కేంద్రంలో 1.5 లక్షల కుక్కలను పర్యవేక్షించనున్నారు.   అలా మొత్తం 322 జంతు సంరక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశారు.  మున్సిపాలిటీల వార్షిక ఆర్థిక బడ్జెట్ లో కనీసం 0.3 శాతం జంతు పునరావాస సేవలు, వాటి నివాసల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఈ కొత్త చట్టంపై జంతు ప్రేమికులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొందరు ఏకంగా ఈ చట్టాన్ని రద్దు చేయాలని దేశ అత్యున్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు.

Show comments