Swetha
జపాన్ లో భూకంపాలు అనేవి ప్రజలను ఎప్పుడు భయభ్రతులకు గురి చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా అక్కడి ప్రజలను మరో భూకంపం కలచివేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
జపాన్ లో భూకంపాలు అనేవి ప్రజలను ఎప్పుడు భయభ్రతులకు గురి చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా అక్కడి ప్రజలను మరో భూకంపం కలచివేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Swetha
భూకంప ప్రకంపనలు సంబంధించిన వార్తలు ఎక్కువగా జపాన్ నుంచే వింటూ ఉంటాము. నిత్యం అక్కడి ప్రజలను ఈ భూకంపాలు భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉంటాయి. తాజాగా బుధవారం తెల్లవారుజామున.. తైవాన్ రాజధాని తైపీలో భారీ భూకంపం సంభవించింది. తైవాన్ లో హువాలియన్ సిటీకి దక్షిణ దిశగా.. 18కిలో మీటర్ల దూరం.. 34.8 కిలో మీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు.. అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తైపీలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్ పై.. 7.4 గా నమోదైంది. అక్కడ సంభవించిన భారీ భూకంపం కారణంగా.. ఎన్నో భవనాలు నేలమట్టం అయ్యాయి. గత 25 ఏళ్లలో.. ఇంత తీవ్రతతో భారీ భూకంపం సంభవించడం ఇదేనని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కడ జరిగిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే, మియకోజీమా ద్వీపంతో సహా.. జపాన్ దీవులకు.. మూడు మీటర్ల ఎత్తులో సునామి వచ్చే అవకాశం ఉన్న కారణంగా.. అధికారులు అందరిని అప్ప్రమత్తం చేస్తున్నారు.
ఉన్నట్లుండి భారీ భూకంపం సంభవించడం, పెద్ద పెద్ద బిల్డింగ్ లు నెల మట్టం అవ్వడం వలన.. తైపీలో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. భారీ సంఖ్యలో ప్రజలంతా రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంపానికి తోడు ఇక ఇప్పుడు సునామి హెచ్చరికలు కూడా జారీ చేయడంతో.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి.. మీడియా, అధికారులు సహాయక చర్యలలో నిమగ్నం అయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
🚨🇹🇼 Building Collapse in Taiwan Due to Earthquakes | Visible Structural Damage
Source: @northicewolf https://t.co/cpytWyIx4y pic.twitter.com/Qc0XS4ZXXx
— Mario Nawfal (@MarioNawfal) April 3, 2024