పాపం సారా.. బంగారు భవిష్యత్తు ఊహించుకుంటే.. ఇలా జరిగిందేంటి..!

Woman Journalist Dead Body: మంచి ఉద్యోగం, భవిష్యత్తు గురించి బంగారు కలలు కన్న మహిళ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

Woman Journalist Dead Body: మంచి ఉద్యోగం, భవిష్యత్తు గురించి బంగారు కలలు కన్న మహిళ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

మన చుట్టూ ఉండే సమాజంలో చోటు చేసుకునే కొన్ని సంఘటనలు చూస్తే.. ఎంత దారుణమైన పరిస్థితుల మధ్య బతుకుతున్నామో అర్ధం అవుతుంది. తాజాగా చోటు చేసుకున్న ఓ సంఘటన చూస్తే.. ఇదే నిజం అనిపిస్తుంది. మంచి ఉద్యోగం.. భవిష్యత్తు గురించి ఎన్నో ఊహించుకుంది.. జీవితంలో గొప్పగా ఎదగాలని భావించి.. ఉద్యోగంలో చేరిన ఓ యువతికి ఏం జరిగిందో తెలియదు.. అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. ఇక ఆమె మృతి చెందడానికి ముందు సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. అసలు ఆ యువతికి ఏం జరిగింది.. ఆమె మృతి సహజంగా జరిగిందా.. లేదంటే ఆత్మహత్య చేసుకుందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఇంతకు ఈ విషాదకర సంఘటన ఎక్కడ జరిగింది.. తెలియాలంటే..

టీవీ జర్నలిస్ట్‌గా పని చేస్తున్న ఓ మహిళ.. సరస్సులో శవమై తేలింది. ఇంతకు ఆమె ఆత్మహత్య చేసుకుందా.. లేక ఆమెది హత్యా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ సంఘటన బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంది. మృతురాలిని గాజీ మీడియా గ్రూప్‌లోని బెంగాలీ భాషలో ప్రసారమయ్యే గాజీ టీవీ న్యూస్‌ రూమ్‌ ఎడిటర్‌ సారా రహనుమాగా పోలీసులు గుర్తించారు. ఢాకాలోని హతిర్‌జహీల్‌ సరస్సులో ఆమె మృతదేహం వెలుగు చూసింది. ఇది గమనించిన స్థానికులు దీని గురించి పోలీసులుకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని.. సారా రహనుమా డెడ్‌బాడీని కలెక్ట్‌ చేసుకుని.. ఆస్పత్రికి తరలించారు. మంగళవారం అర్థరాత్రి 2 గంటలప్పుడు రహనుమా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

అయితే రహనుమా చనిపోవడానికి ముందు.. సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె ఫైజల్‌ అనే వ్యక్తిని ట్యాగ్‌ చేస్తూ.. తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఒక పోస్ట్‌ పెట్టింది. ‘‘నీలాంటి స్నేహితుడిని పొందడం సంతోషంగా ఉంది. నీ కలలను నెరవేర్చలేకపోతున్నందుకు నన్ను క్షమించు. నీ జీవిత గమనంలో దేవుడు నీకు తోడుగా నిలుస్తాడు’’ అని రాసుకొచ్చింది. దీని కంటే ముందు.. చస్తూ బతకడం కంటే చావడమే ఉత్తమం అంటూ మరో పోస్ట్‌ పెట్టింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెది హత్యా, ఆత్మహత్యా అనే దానిపై విచారణ చేపట్టారు.

Show comments