iDreamPost
android-app
ios-app

OTT లో ఈ క్రైమ్ థ్రిల్లర్ అసలు మిస్ కాకండి.. ఎక్కడంటే ?

  • Published Aug 13, 2025 | 12:34 PM Updated Updated Aug 13, 2025 | 12:34 PM

ఓటిటి లో స్ట్రీమింగ్ అయ్యే చాలా సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఒకవేళ థియేటర్ లో ఆయా సినిమాలు బోల్తా కొట్టిన ఓటిటి వచ్చిన తర్వాత మాత్రం మంచి స్ట్రీమింగ్ మినిట్స్ ను దక్కించుకుంటున్నాయి. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్స్ కు ఎప్పుడు ఫుల్ డిమాండ్ ఉంటూనే ఉంటుంది.

  • Published Aug 13, 2025 | 12:34 PMUpdated Aug 13, 2025 | 12:34 PM
OTT లో ఈ క్రైమ్ థ్రిల్లర్ అసలు మిస్ కాకండి.. ఎక్కడంటే ?

ఓటిటి లో స్ట్రీమింగ్ అయ్యే చాలా సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఒకవేళ థియేటర్ లో ఆయా సినిమాలు బోల్తా కొట్టిన ఓటిటి వచ్చిన తర్వాత మాత్రం మంచి స్ట్రీమింగ్ మినిట్స్ ను దక్కించుకుంటున్నాయి. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్స్ కు ఎప్పుడు ఫుల్ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. లాంగ్వేజ్ ఏదైనా సరే ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్స్ కంటెంట్ బావుంటే కనుక వెంటనే సినిమా క్లిక్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా ఓటిటి లో ఇలాంటి ఓ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ అవుతుంది. అదేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమా పేరు గుడ్ డే. ఈ సినిమాకు థియేటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ తాగుబోతు ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో ఎలా సాయపడ్డాడు అనేదే మూవీ స్టోరీ లైన్. ఈ సినిమా జూన్ 27న థియేటర్ లో రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాను మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు ఎన్ అరవిందన్ దర్శకత్వం అందించారు. పృథ్వీరాజ్‌ రామలింగం, మైనా నందిని, ఆదుకలం మురుగదాస్, కాళి వెంకట్, భగవతి పెరుమాల్, వేళ రామమూర్తి లాంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఆగష్టు 15 నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి.