iDreamPost
android-app
ios-app

ఇట్స్ అఫీషియల్ : ఆ రెండిటికి నో హైక్స్

  • Published Aug 12, 2025 | 3:40 PM Updated Updated Aug 12, 2025 | 3:40 PM

నిన్నటినుంచి సోషల్ మీడియాలో ఒకటే న్యూస్.. కామెంట్స్ వార్. ఎంత మూవీ లవర్స్ అయితే మాత్రం మా అభిమానాన్ని క్యాష్ చేసుకునే విధానం ఇదేనా అంటూ వాదన. కనీసం స్ట్రెయిట్ సినిమాలు కూడా కాదు డబ్బింగ్ సినిమాలకు ఇష్టమొచ్చినట్టు రేట్స్ పెంచేస్తారా అంటూ గోల

నిన్నటినుంచి సోషల్ మీడియాలో ఒకటే న్యూస్.. కామెంట్స్ వార్. ఎంత మూవీ లవర్స్ అయితే మాత్రం మా అభిమానాన్ని క్యాష్ చేసుకునే విధానం ఇదేనా అంటూ వాదన. కనీసం స్ట్రెయిట్ సినిమాలు కూడా కాదు డబ్బింగ్ సినిమాలకు ఇష్టమొచ్చినట్టు రేట్స్ పెంచేస్తారా అంటూ గోల

  • Published Aug 12, 2025 | 3:40 PMUpdated Aug 12, 2025 | 3:40 PM
ఇట్స్ అఫీషియల్ : ఆ రెండిటికి నో హైక్స్

నిన్నటినుంచి సోషల్ మీడియాలో ఒకటే న్యూస్.. కామెంట్స్ వార్. ఎంత మూవీ లవర్స్ అయితే మాత్రం మా అభిమానాన్ని క్యాష్ చేసుకునే విధానం ఇదేనా అంటూ వాదన. కనీసం స్ట్రెయిట్ సినిమాలు కూడా కాదు డబ్బింగ్ సినిమాలకు ఇష్టమొచ్చినట్టు రేట్స్ పెంచేస్తారా అంటూ గోల. తెలుగు వారు కాబట్టి వేరే భాష సినిమాలను ఆదరిస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం మన వాళ్లకు కనీసం థియేటర్స్ కూడా కేటాయించారంటూ లొల్లి. అదే కూలి , వార్ 2 టికెట్స్ రేట్స్ పెరిగిపోయాయంటూ వినిపిస్తున్న వార్తల గురించి డిస్కషన్ అదంతా. అయితే ఎట్టకేలకు ఇప్పుడు సినీ ప్రియులకు ఉపశమనం లభించింది.

తెలంగాణ వార్ 2 కూలి సినిమాల టికెట్ రేట్స్ లో ఎలాంటి పెంపు ఉండదని లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. అంటే ఎప్పటిలానే మల్టీప్లెక్సుల్లో 295 రూపాయలు, సింగల్ స్క్రీన్లలో 175 కంటే ఎక్కువ ఉండవు. అటు ఆంధ్రాలో కూడా ఇలానే ఉండొచ్చేమో కానీ దాని గురించి ఇంకా క్లారిటీ లేదు. కానీ కనీసం 75, 50 రూపాయల చొప్పున పెంపు రావొచ్చని ఇన్సైడ్ టాక్. ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేము. ఒకవేళ లేదు అంటే ఆంధ్ర ఫ్యాన్స్ కంటే హ్యాపీ ఎవరు ఉండరు. ఇలా డెసిషన్ తీసుకుని మూవీ టీం మంచి పని చేశారు. ఎందుకంటే స్ట్రెయిట్ సినిమాలకు హైక్ అడిగినా ఓ న్యాయం కానీ.. డబ్బింగ్ వాటికి అడగడం సరి కాదు.

ఎంత టెక్నలాజి వాడి వార్ 2 సినిమా స్ట్రెయిట్ సెన్సార్ సర్టిఫికెట్ తీసుకున్నా అది బాలీవుడ్ సినిమా కిందే వస్తుంది. అటు కూలీ కూడా అంతే. జూనియర్ ఎన్టీఆర్ , నాగార్జున నటించారు కాబట్టి ఆ ఇమేజ్ ను తెలుగు స్టేట్స్ లో క్యాష్ చేసుకోవాలని అనుకోవడం సరైన పద్దతి కాదు. మరి లీకైన న్యూస్ అబద్దమో లేక ఈ గోల తట్టుకోలేక హైక్స్ క్యాన్సిల్ చేసుకున్నారో తెలియదు కానీ.. మొత్తానికి ఫ్యాన్స్ కు మాత్రం గుడ్ న్యూస్ చెప్పేసారు. సో ఇక ఆగస్ట్ 14 న నుంచి వచ్చే లాంగ్ వీకెండ్ కోసం ఆడియన్స్ రెడీ అయిపోవచ్చు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.