iDreamPost
android-app
ios-app

వసూళ్ల వర్షం కాదు భారీ వర్షాల నడుమ వార్ 2 , కూలి !

  • Published Aug 13, 2025 | 11:45 AM Updated Updated Aug 13, 2025 | 11:45 AM

ఓ వైపు లాంగ్ వీకెండ్ వచ్చింది రెండు సినిమాలకు ఫుల్ స్పేస్ దొరికింది, సినిమాలు వసూళ్ల వర్షం కురిపించడం ఖాయమని ఆనందించేలోపే.. భారీ వర్ష సూచనలు మొదలయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రల్లోనూ ఇదొక ప్రధాన అడ్డంకిగా మారింది. ముఖ్యంగా తెలంగాణాలో పరిస్థితిలు చాలా తీవ్రంగా మారనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది

  • Published Aug 13, 2025 | 11:45 AMUpdated Aug 13, 2025 | 11:45 AM
వసూళ్ల వర్షం కాదు భారీ వర్షాల నడుమ వార్ 2 , కూలి !

ఓ వైపు లాంగ్ వీకెండ్ వచ్చింది రెండు సినిమాలకు ఫుల్ స్పేస్ దొరికింది, సినిమాలు వసూళ్ల వర్షం కురిపించడం ఖాయమని ఆనందించేలోపే.. భారీ వర్ష సూచనలు మొదలయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రల్లోనూ ఇదొక ప్రధాన అడ్డంకిగా మారింది. ముఖ్యంగా తెలంగాణాలో పరిస్థితిలు చాలా తీవ్రంగా మారనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికె కొన్ని జిల్లాల్లో కొండపోత వానలు కురుస్తున్నాయి. ఈరోజు నుంచి ఓ రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ హై అలెర్ట్ జారీ చేసింది.

ప్రస్తుతానికైతే బుకింగ్స్ బాగానే ఉన్నాయి కానీ 15, 16, 17 తేదీల్లో హైదరాబాద్ లో కుండపోత వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఈ ఎఫెక్ట్ మెయిన్ సెంటర్స్ లోని ఈవినింగ్ , మిడ్ నైట్ షోస్ పై పడనుంది. అటు ఏపీలో కూడా దీనికి ఏమి తీసిపోలేదు. అక్కడ కూడా వానలు కురవడం మొదలయ్యాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. సో ఇప్పుడు వార్ 2 కూలీ ల మీద సందేహాలు మొదలయ్యాయి. అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందా లేదా అని నిర్మాతలు బెంగపెట్టుకున్నారు. లాంగ్ వీకెండ్ కాస్త వర్షాల మూలాన మట్టికొట్టుకుపోతుందేమో అని టెన్షన్ పడుతున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.