iDreamPost
android-app
ios-app

ఈ క్యారెక్టర్ తో సత్యదేవ్ కి బ్రేక్ దొరికినట్టేనా !

  • Published Aug 12, 2025 | 3:58 PM Updated Updated Aug 12, 2025 | 3:58 PM

రీసెంట్ గా కింగ్డమ్ మూవీలో అతని క్యారెక్టర్ కు మంచి ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా సత్య దేవ్ గురించి టాక్ వినిపించింది. అతను ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో టీం లీడ్ గా నైట్ షిఫ్ట్స్ చేస్తూ.. డే టైం లో షూటింగ్స్ కు వెళ్లేవాడట. దీనిని బట్టే సత్య దేవ్ కు సినిమాలంటే ఎంత పిచ్చో అర్థమైపోతుంది.

రీసెంట్ గా కింగ్డమ్ మూవీలో అతని క్యారెక్టర్ కు మంచి ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా సత్య దేవ్ గురించి టాక్ వినిపించింది. అతను ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో టీం లీడ్ గా నైట్ షిఫ్ట్స్ చేస్తూ.. డే టైం లో షూటింగ్స్ కు వెళ్లేవాడట. దీనిని బట్టే సత్య దేవ్ కు సినిమాలంటే ఎంత పిచ్చో అర్థమైపోతుంది.

  • Published Aug 12, 2025 | 3:58 PMUpdated Aug 12, 2025 | 3:58 PM
ఈ క్యారెక్టర్ తో సత్యదేవ్ కి బ్రేక్ దొరికినట్టేనా !

టాలీవుడ్ లో ఎంతో మంది టాలెంటెడ్ హీరోస్ ఉన్నారు. వారు ఎంత కష్టపడినా కూడా కొన్ని సార్లు అదృష్టం కూడా కలిసిరావాలి. అలా తమ 100 % ఎఫర్ట్స్ పెడుతున్న హీరోలలో సత్య దేవ్ కూడా ఒకరు. అతనికి కష్టాన్ని గుర్తించిన మూవీ లవర్స్. అబ్బా సత్య దేవ్ కు ఒక్క మంచి క్యారెక్టర్ పడితే బావుండు అని అనుకుంటూ ఉంటారు. రీసెంట్ గా కింగ్డమ్ మూవీలో అతని క్యారెక్టర్ కు మంచి ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా సత్య దేవ్ గురించి టాక్ వినిపించింది. అతను ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో టీం లీడ్ గా నైట్ షిఫ్ట్స్ చేస్తూ.. డే టైం లో షూటింగ్స్ కు వెళ్లేవాడట. దీనిని బట్టే సత్య దేవ్ కు సినిమాలంటే ఎంత పిచ్చో అర్థమైపోతుంది.

అయితే ఇప్పుడు రీసెంట్ గా సత్యదేవ్ పిక్ ఒకటి వైరల్ అవుతుంది. అతను ఓ ఓల్డ్ మ్యాన్ గెటప్ లో కనిపించి సర్ప్రైజ్ చెసాద్. ‘రావ్ బహదూర్’ పేరుతో కొత్తగా సత్యదేవ్ హీరోగాా ఓ సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమాను మహేష్ బాబు సంస్థ నిర్మిస్తుంది. ఇంతకుముందు సత్య దేవ్ తో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా తీసిన వెంకటేష్ మహా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో మహేష్ బాబుతో కలిసి ‘మేజర్’ సినిమాను ప్రొడ్యూస్ చేసిన ఛాయ్ బిస్కెట్ అధినేతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర.. ‘క’ నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రీసెంట్ గానే సత్యదేవ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

సో సత్యదేవ్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. ఈ సినిమా కోసం సత్యదేవ్ పూర్తిగా ట్రాన్సఫార్మ్ అయినట్టు అనిపిస్తుంది. ఇక ఈ సినిమా అయినా సత్యదేవ్ కు బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. గతంలో ఇతను కొన్ని మంచి సినిమాలు చేసినా అవి ప్రేక్షకులకు రీచ్ అవ్వలేదు. ఎంతో టాలెంట్ ఉన్నా సరే ఒక స్థాయికి మించి ఎదగలేక ఇబ్బంది పడుతున్నాడు ఈ హీరో. కానీ ఈసారి ప్రాజెక్ట్ కు బ్యాకప్ స్ట్రాంగ్ గానే ఉంది కాబట్టి బ్రేక్ పడే అవకాశాలు బాగానే ఉన్నాయి. ఇక ఏమౌతుందో చూడాలి, మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.