iDreamPost
android-app
ios-app

సు ఫ్రమ్ సో.. ఇక్కడ సో సో నేనా !

  • Published Aug 12, 2025 | 3:03 PM Updated Updated Aug 12, 2025 | 3:03 PM

కన్నడ సినిమాలు ఎప్పుడు ప్రేక్షకులను బాగా మెప్పిస్తాయన్న సంగతి తెలియనిది కాదు. ఈ క్రమంలో రీసెంట్ గా కన్నడలో సూపర్ హిట్ అందుకున్న సు ఫ్రమ్ సో సినిమా తెలుగులో రిలీజ్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ కేవలం మూడు కోట్ల బడ్జెట్ తో మాత్రమే రూపొందించారు. అలా సినిమా రిలీజ్ అయిన నాలుగువారాలకె 50 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకుంది.

కన్నడ సినిమాలు ఎప్పుడు ప్రేక్షకులను బాగా మెప్పిస్తాయన్న సంగతి తెలియనిది కాదు. ఈ క్రమంలో రీసెంట్ గా కన్నడలో సూపర్ హిట్ అందుకున్న సు ఫ్రమ్ సో సినిమా తెలుగులో రిలీజ్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ కేవలం మూడు కోట్ల బడ్జెట్ తో మాత్రమే రూపొందించారు. అలా సినిమా రిలీజ్ అయిన నాలుగువారాలకె 50 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకుంది.

  • Published Aug 12, 2025 | 3:03 PMUpdated Aug 12, 2025 | 3:03 PM
సు ఫ్రమ్ సో.. ఇక్కడ సో సో నేనా !

కన్నడ సినిమాలు ఎప్పుడు ప్రేక్షకులను బాగా మెప్పిస్తాయన్న సంగతి తెలియనిది కాదు. ఈ క్రమంలో రీసెంట్ గా కన్నడలో సూపర్ హిట్ అందుకున్న సు ఫ్రమ్ సో సినిమా తెలుగులో రిలీజ్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ కేవలం మూడు కోట్ల బడ్జెట్ తో మాత్రమే రూపొందించారు. అలా సినిమా రిలీజ్ అయిన నాలుగువారాలకె 50 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకుంది. ఇక తెలుగులో కూడా ఈ సినిమా ఇలాంటి సెన్సేషన్ ఏ క్రియేట్ చేస్తుందని భావించారు నిర్మాతలు. దానికి తగిన ప్రమోషన్స్ కూడా చేశారు. అయితే వారు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ మాత్రం దక్కినట్టు అనిపించడం లేదు.

లేదంటే ఈపాటికి సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి రకరకాల డిస్కషన్స్ కూడా జరిగేవి. కానీ అంతా సైలెంట్ గానే ఉన్నారు. ఈ సినిమా ఏమైనా క్యాష్ చేసుకోవాలి అంటే ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఎందుకంటే రెండు రోజుల్లో వార్ 2 , కూలీ సినిమాలు థియేటర్స్ న ఆక్యుపై చేసేస్తాయి. సో సు ఫ్రమ్ సో థియేటర్స్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. గతంలో మంజుమ్మల్ బాయ్స్ ఇదే తరహాలో మంచి కలెక్షన్స్ అందుకుంది. దీనితో ఈ సినిమాకు కూడా ఇదే రెస్పాన్స్ వస్తుందని అనుకున్నారు కానీ అది జరగలేదు. అసలు సినిమా వచ్చిన సంగతి కూడా చాలా వరకు తెలియలేదు.

అయితే థియేటర్ లో మెప్పించకపోయిన ఓటిటి లోకి వచ్చిన తర్వాత మాత్రం సినిమా కచ్చితంగా ట్రెండింగ్ అవుతుందని టీం కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎందుకంటే గతంలో వచ్చిన మలయాళ ఫ్యామిలీ కామిడి డ్రామాలు ప్రేక్షకులను ఏ విధంగా మెప్పించాయో తెలియనిది కాదు. ప్రస్తుతానికైతే సినిమా ఓటిటి విషయం ఇంకా బయటకు రాలేదు. ఇక ఎప్పుడు వస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.