Swetha
ఇంకొక్క రోజులో కూలీ పవర్ ఎంతో ఏంటో తెలిసిపోతుంది. మరికొద్ది గంటల్లో సినిమా రిలీజ్ కానుంది. దీనితో పాటు వార్ 2 కూడా రిలీజ్ అవుతుంది. కానీ ప్రస్తుతానికి సౌత్ లో వార్ 2 కంటే కూడా కూలీకే ఎక్కువ హైప్ ఉంది. అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లో కూడా కూలీకే ఎక్కువ టికెట్స్ తెగుతున్నాయి.
ఇంకొక్క రోజులో కూలీ పవర్ ఎంతో ఏంటో తెలిసిపోతుంది. మరికొద్ది గంటల్లో సినిమా రిలీజ్ కానుంది. దీనితో పాటు వార్ 2 కూడా రిలీజ్ అవుతుంది. కానీ ప్రస్తుతానికి సౌత్ లో వార్ 2 కంటే కూడా కూలీకే ఎక్కువ హైప్ ఉంది. అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లో కూడా కూలీకే ఎక్కువ టికెట్స్ తెగుతున్నాయి.
Swetha
ఇంకొక్క రోజులో కూలీ పవర్ ఎంతో ఏంటో తెలిసిపోతుంది. మరికొద్ది గంటల్లో సినిమా రిలీజ్ కానుంది. దీనితో పాటు వార్ 2 కూడా రిలీజ్ అవుతుంది. కానీ ప్రస్తుతానికి సౌత్ లో వార్ 2 కంటే కూడా కూలీకే ఎక్కువ హైప్ ఉంది. అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లో కూడా కూలీకే ఎక్కువ టికెట్స్ తెగుతున్నాయి. దానికి కారణం రజినీకాంత్ , లోకేష్ మ్యాజిక్ నాగార్జున ఉపేంద్ర లాంటి స్టార్స్ ఉండడమే అని ట్రేడ్ పండితులు అంటున్నారు. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే కూలీ మూవీ కోసం ఎవరు ఎంత కూలీ తీసుకున్నారో వివరాలు చూసేద్దాం.
కూలీ సినిమాను దాదాపు 350-400 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఇందుల దాదాపు ఎక్కువ శాతం అమౌంట్ నటి నటుల రెమ్యునరేషన్స్ కే పోయిందంట. హీరోగా చేసిన రజినీకాంత్ రూ.150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఇక లోకేష్ కనగరాజ్ రూ.50 కోట్లు అందుకున్నాడు. ఈ విషయం స్వయంగా లోకేష్ ఏ ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టాడు. ఇక విలన్ గా చేసిన కింగ్ నాగార్జున సుమారు 20-రూ.24 కోట్లు, గెస్ట్ రోల్ లో నటించిన అమీర్ ఖాన్ రూ.20 కోట్లు.. కీ రోల్స్ పోషించిన ఉపేంద్ర రూ.5 కోట్లు , శృతిహాసన్ రూ. 4 కోట్లు.. అలాగే అసలు సినిమా రూపుదిద్దుకోడానికి కారణం అయిన అనిరుధ్ రూ.15 కోట్లు అందుకున్నట్లు టాక్.
ఇక కూలీ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలియనిది కాదు. థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యేలోపు పెట్టిన పెట్టుబడి అంతా రాబడుతుందని టీం బలంగా నమ్ముతున్నారు. సుమారు 1000 కోట్లు రాబడుతుందని అంచనా. మరి కూలీ ఈ అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి. ఇంకొద్ది గంటల్లో టాక్ ఏంటో తెలిసిపోతుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.