iDreamPost
android-app
ios-app

ఈ 4 రోజులు బాక్స్ ఆఫీస్ దగ్గర జాతరే

  • Published Aug 13, 2025 | 11:26 AM Updated Updated Aug 13, 2025 | 11:26 AM

ఆగస్ట్ 14 న బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ క్లాష్ జరగబోతుంది. రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కాదు. కానీ రెండింటిలోనూ సౌత్ స్టార్ యాక్టర్స్ ఉండడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాలను చూద్దామా అని ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.ముఖ్యంగా కూలీ లో అయితే పవర్ ప్యాక్డ్ యాక్టర్స్ ఉన్నారు.

ఆగస్ట్ 14 న బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ క్లాష్ జరగబోతుంది. రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కాదు. కానీ రెండింటిలోనూ సౌత్ స్టార్ యాక్టర్స్ ఉండడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాలను చూద్దామా అని ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.ముఖ్యంగా కూలీ లో అయితే పవర్ ప్యాక్డ్ యాక్టర్స్ ఉన్నారు.

  • Published Aug 13, 2025 | 11:26 AMUpdated Aug 13, 2025 | 11:26 AM
ఈ 4 రోజులు బాక్స్ ఆఫీస్ దగ్గర జాతరే

ఆగస్ట్ 14 న బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ క్లాష్ జరగబోతుంది. రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కాదు. కానీ రెండింటిలోనూ సౌత్ స్టార్ యాక్టర్స్ ఉండడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాలను చూద్దామా అని ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.ముఖ్యంగా కూలీ లో అయితే పవర్ ప్యాక్డ్ యాక్టర్స్ ఉన్నారు. ఇక వార్ 2 ని సౌత్ లో రూల్ చేయబోయేది మ్యాన్ ఆఫ్ ది మాసెస్. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం చాలా ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్ సత్తా ఏంటో ఈసారి నేరుగా బాలీవుడ్ లో చూపించబోతున్నాడు తారక్. సో ఈ రెండు వేటికవే వెరీ స్పెషల్ మూవీస్.

ముందు వార్ 2 చూసినా లేకా కూలీ చూసినా.. మొత్తానికి వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు రెండు సినిమాలను మాత్రం కవర్ చేసేలా ఉన్నారు మూవీ లవర్స్. అందులోను ఈ రెండు సినిమాలకు కలిసివచ్చిన ఇంకో పాయింట్ ఏంటంటే ఇండిపెండెన్స్ డే కారణంగా లాంగ్ వీకెండ్ రావడం. సో ఎలా కాదన్న ఏకంగా నాలుగు రోజులు థియేటర్స్ దగ్గర సందడి వాతావరణం నెలకొననుంది. పైగా ఇటు తెలంగాణాలో టికెట్స్ రేట్స్ పై ఎలాంటి హైక్ లేకపోవడంతో ఆడియన్స్ ఖుషి అయిపోతున్నారు. ఆంధ్రలో మాత్రం టికెట్స్ రేట్స్ మీద కాస్త హైక్ ను ప్రకటించారు. సో అక్కడ ఈ రెండు సినిమాలకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు.

అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసినప్పటినుంచి రెండు సినిమాలకు కూడా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. సో దీని వలన మొదటి రోజే రెండు సినిమాలు భారీ వసూళ్లు సాధించడం ఖాయం. ఇవి డబ్బింగ్ సినిమాలే అయినప్పటికీ చాలా కాలం తర్వాత ఒకేసారి ఇలా రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడంతో.. థియేటర్స్ కు కళ రానుంది. ఈ రెండు సినిమాలు టాక్ మంచిగా వచ్చి ఇంకా ఇంకా జనాన్ని థియేటర్స్ కు రప్పించగలిగితే.. నిర్మాతలకు థియేటర్ ఓనర్స్ కు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.