ఉద్యోగుల కోసం ఫెయిర్ వర్క్ యాక్ట్.. బాస్‌కి భయపడక్కర్లేదు

Right To Disconnect Act For Employees: ఉద్యోగుల కోసం కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఆఫీస్ వేళలు ముగిసిన తర్వాత పని చేయమని ఒత్తిడి చేసే బాస్ కి భయపడే పరిస్థితి అవసరం లేకుండా ఒక కొత్త చట్టాన్ని ఉద్యోగుల రక్షణ కోసం అందుబాటులోకి వచ్చింది.

Right To Disconnect Act For Employees: ఉద్యోగుల కోసం కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఆఫీస్ వేళలు ముగిసిన తర్వాత పని చేయమని ఒత్తిడి చేసే బాస్ కి భయపడే పరిస్థితి అవసరం లేకుండా ఒక కొత్త చట్టాన్ని ఉద్యోగుల రక్షణ కోసం అందుబాటులోకి వచ్చింది.

కొన్ని కంపెనీల్లో బాస్ లు ఉద్యోగులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుంటారు. ఒక మనిషి మోయగలిగే కంటే ఎక్కువ పని ఇచ్చి ఒత్తిడి చేస్తుంటారు. అయితే ఆఫీసులో ఉండగా ఎంత ఒత్తిడి చేసినా గానీ ఆ ఉద్యోగి భరిస్తారు. అయితే బాస్ ఆఫీస్ పని వేళలు ముగిసిన తర్వాత కూడా ఉద్యోగులను ఒత్తిడికి గురి చేస్తుంటారు. ఉద్యోగులు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, చెప్పిన పని చేయకపోయినా బాస్ లు సీరియస్ అవ్వడం, జీతం కట్ చేయడం, ఉద్యోగం లోంచి తీసేస్తా అని బెదిరించడం వంటివి చేస్తుంటారు. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా ఒక కొత్త చట్టాలను ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఫెయిర్ వర్క్ యాక్ట్ లోని ‘రైట్ టూ డిస్కెనెక్ట్’ పేరుతో ఉద్యోగులకు రక్షణగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఆగస్టు 26 నుంచి ఈ కొత్త చట్టం అమలులోకి రానుంది. పని వేళల తర్వాత ఎవరైనా పని చేయమని ఒత్తిడి చేస్తే ఈ చట్టం కింద చర్యలు తప్పవు. ఈ కొత్త చట్టంతో ఉద్యోగులకు ఉపశమనం లభించనుంది.

నిజానికి ఈ చట్టాన్ని గత ఏడాది ఫిబ్రవరి నెలలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆమోదించింది. కానీ పలు ఉద్యోగ సంస్థలు వ్యతిరేకించడం, విమర్శలు చేయడం వంటి కారణాల వల్ల చట్టం అమలు ఆలస్యమవుతూ వచ్చింది. మొత్తానికి ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చింది. కొత్త చట్టంలో ఉద్యోగి హోదా, బాస్ తో మాట్లాడేందుకు తిరస్కరణలో సంస్థలు చెప్పే అసహేతుక కారణాలను పరిగణనలోకి తీసుకోవడం వంటి మినహాయింపులు ఇచ్చింది. ఇలాంటి వెసులుబాటు వల్ల చట్టం అమలు సాధ్యం కాదని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని ఫెయిర్ వర్క్ చట్టం 2009లోని ఉన్న లోపాలను సరిదిద్దుతూ ఈ రైట్ టూ డిస్కనెక్ట్ చట్టాన్ని తీసుకొచ్చింది ఆస్ట్రేలియా ప్రభుత్వం.

తక్కువ జీతాల చెల్లింపులు కూడా ఈ చట్టం కింద నేరంగా పరిగణించబడేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చట్టం ప్రకారం.. ఆఫీస్ పని వేళలు పూర్తైన తర్వాత ఉద్యోగితో అదనంగా కొన్ని గంటలు పని చేయించుకుంటే కనుక పరిహారం గానీ అదనపు చెల్లింపులు ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగి పాత్ర స్వభావం, బాధ్యత స్థాయి, ఫ్యామిలీ లేదా సంరక్షణ బాధ్యతలు, వ్యక్తిగత పరిస్థితులను ఈ చట్టం పరిగణనలోకి తీసుకుంటుంది. ఇవే కాకుండా యాజమాన్యాలు ఉద్యోగులను నియమించుకునే చట్టాల్లో కూడా మార్పులు చేర్పులను చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి చట్టాలు ఫ్రాన్స్, రష్యా, జర్మనీ, ఇటలీ, ఐర్లాండ్, ఒంటారియో, స్పెయిన్, అర్జెంటీనా, మెక్సికో వంటి దేశాల్లో అమలులో ఉన్నాయి. ఆఫీస్ పని వేళలు ముగిసిన తర్వాత ఉద్యోగులు తమ ఫోన్లను స్విచ్చాఫ్ చేసుకుని కుటుంబంతో ప్రశాంతంగా గడిపేందుకు, వ్యక్తిగత జీవితం గడిపేందుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది.

Show comments