కాంగో జైల్లో తొక్కిసలాట.. 100 మందికి పైగా ఖైదీలు మృతి

జైల్లో ఖైదీలు గోడలు బద్దలు కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించారు. వీరిని నియంత్రించేందుకు జైలు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 100 మందికి పైగా చనిపోయారు.

జైల్లో ఖైదీలు గోడలు బద్దలు కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించారు. వీరిని నియంత్రించేందుకు జైలు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 100 మందికి పైగా చనిపోయారు.

రిపబ్లిక్ ఆఫ్ కాంగో మరోసారి వార్తల్లో నిలిచింది. అక్కడ జైలు నుండి పారిపోయేందుకు ప్రయత్నించారు ఖైదీలు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 129 మంది మరణించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది స్థానిక ప్రభుత్వం. కాంగో రాజధాని కిన్షాసాలోని సెంట్రల్ మకాల జైలు నుండి ఖైదీలు పరారయ్యేందుకు ప్రయత్నించగా.. ఈ పెను ప్రమాదం చోటుచేసుకుందని మంగళవారం అంతర్గత మంత్రి షబానీ లుకూ వెల్లడించారు. 129 మరణాలలో .. 24 మంది మంటల్లో చిక్కుకుని మృత్యువాత పడ్డారని తెలిపారు. మరో 59 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ఈ ఘటనలో అడ్మినిస్టేషన్ భవనం దెబ్బతిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఖైదీలెవరు తప్పించుకోలేదని చెబుతున్నారు స్థానిక అధికారులు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడించింది స్థానిక గవర్నమెంట్.

మకాల జైలును బద్దలు కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించారు ఖైదీలు. ఖైదీలు తప్పించుకుంటున్న క్రమంలో జైలు అధికారులు కంట్రోల్ చేసే క్రమంలో తొక్కిసలాట జరిగింది. అదే సమయంలో కిచెన్‌లో మంటలు చెలరేగాయి. తొక్కిసలాట, మంటల్లో 129 మంది మరణించారు. అయితే ఖైదీల వాదన మరోలా ఉంది. తమకు బయట నుండి కాల్పుల శబ్దాలు వినిపించాయని చెబుతున్నారు. కాగా, కాంగోలో జైలులో ఖైదీలు తప్పించుకోవడం సర్వసాధారణం. గతంలో కూడా మూకుమ్మడిగా 750 మంది ఖైదీలు తప్పించుకున్నారు. ఆ ఘటనలో ఐదుగురు మరణించారు. అయితే ఉగ్రదాడి వల్ల.. వారిని రిలీజ్ చేసినట్లు చెప్పుకుంది ప్రభుత్వం.

Show comments