Covishield: ఆస్ట్రాజెనెకా సంచలన నిర్ణయం.. కోవిషీల్డ్ ఇక కనిపించదు!

గత కొన్నిరోజులుగా కరోనా టీకా అయినా కోవిషిల్డ్ గురించి ఎన్నో వార్తలు వింటూ వస్తున్నాము. దీనితో ప్రజలంతా కూడా భయబ్రాంతులకు గురి అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా దానికి సంబంధించిన మరో అప్ డేట్ వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గత కొన్నిరోజులుగా కరోనా టీకా అయినా కోవిషిల్డ్ గురించి ఎన్నో వార్తలు వింటూ వస్తున్నాము. దీనితో ప్రజలంతా కూడా భయబ్రాంతులకు గురి అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా దానికి సంబంధించిన మరో అప్ డేట్ వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కొన్ని రోజుల క్రితం వరకు కూడా కోవిషిల్డ్ కు సంబందించిన ఎన్నో వార్తలను వింటూ వస్తున్నాము. కోవిషిల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి గుండె పోటు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి.. వారి ప్రాణాలకు ప్రమాదం ఉందని.. ఇలా ఎన్నో వార్తలు రాగ ప్రజలంతా కూడా భయబ్రాంతులకు గురి అయ్యారు. అయితే.. అందుకు సంబంధించి. కోవిషిల్డ్ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా తమ వ్యాక్సిన్ తీసుకోవడం వలన కలిగే అనర్ధాలపై.. అరుదైన సందర్భాలలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతున్నట్లు అంగీకరించి పత్రాలు సమర్పించింది. దీనితో అందరిలో రకరకాల అనుమానులు మొదలయ్యి .. చాలా దేశాల్లో ఈ టీకాకు వ్యతిరేకంగా కోర్టులు కేసు వేశారు. యూకే లో 81 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ బాధిత కుటుంబాలు కోర్టులు కేసు వేశారు. దీనితో తాజాగా ఆ సంస్థ ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కరోనా వైరస్ నియంత్రణ చర్యలలో భాగంగా రూపొందించిన కోవిషిల్డ్ టీకా.. వినియోగంపైన.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. సుప్రీం కోర్టు సహా వివిధ దేశాల న్యాయస్థానాలలో వేల సంఖ్యలో కేసులు రావడం వలన ఈ టీకాల అమ్మకంపై బ్రిటిష్ సంస్థ ఓ నిర్ణయం తీసుకుంది. కొన్ని వాణిజ్య పరమైన కారణాలవలన కోవిషిల్డ్ వ్యాక్సిన్స్ ఉపసంహరించుకున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డోస్ ల కారణంగా.. ఈ ఉపసంహరణను ప్రారంభించినట్లు ఆస్ట్రాజెనెకా వెల్లడించింది. ఇక కొత్త వేరియెంట్స్ ను ఎదుర్కొనేలా వ్యాక్సిన్స్ సిద్ధం చేసినట్లు ఆట్రాజెనెకా పేర్కొంది. యూరోపియన్ మార్కెట్ నుంచి స్వచ్ఛందంగా ఉపసంహరించుకుంటున్న ఆస్ట్రాజెనెకా.. ఇకపై ఈ టీకా తయారీ , వినియోగాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ప్రస్తుతం ఈ టీకాను వినియోగిస్తున్న ఇతర దేశాల మర్కెట్స్ నుంచి కూడా వీలైనంత త్వరలో ఉపసంహరించుకోనుంది.

కోవిషిల్డ్ తీసుకున్న వారిలో.. కొన్నిఅరుదైన సందర్భాలలో థ్రాంబోసిస్‌తో థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్‌.. అంటే రక్తం గడ్డకట్టడం, ప్లేట్ లెట్ కౌంట్ తగ్గిపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయని ఇటీవల కోర్టుకు సమర్పించిన అఫిడివిట్ లో ఆస్ట్రాజెనెకా అంగీకరించింది. ఎంతో మంది వారి ప్రాణాలను కోల్పోయారు. అయితే, కోర్టులు కేసుల కారణంగనే వ్యాక్సిన్ ను ఉపసంహరించుకున్నారనే వాదనలను మాత్రం ఆ సంస్థ అంగీకరించడం లేదు.

“స్వతంత్ర నివేదిక ప్రకారం.. కోవిషీల్డ్ టీకా అందుబాటులోకి వచ్చిన తొలి ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్ డోస్‌లను సరఫరా చేసి 6.5 మిలియన్ల మందికిపైగా ప్రాణాలను రక్షించాం…. మా ప్రయత్నాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు గుర్తించాయి.. ప్రపంచ మహమ్మారిని అంతం చేయడంలో కీలకమైన అంశంగా పరిగణించాయి.. పలు వేరియంట్‌లను తట్టుకునేలా అభివృద్ధిచేసి, ఆధునీకరించిన టీకాలలో మిగులు ఉంది. కరోనా మహమ్మారి నియంత్రణలో సహకారం అందించడానికి మేము మా భాగస్వాములతో కలిసి పని చేస్తాం” అంటూ ఆస్ట్రాజెనెకా ప్రకటన చేసింది. ఇక మే 7 నుంచి తాజాగా ఆస్ట్రాజెనెకా తీసుకున్న నిర్ణయం అమలులోకి వస్తుందని పేర్కొంది.

Show comments