Krishna Kowshik
వినాయకుడి నైవేద్యంగా సమర్పించే గరికలో ఎన్నో ప్రయోజనాలున్నాయి. గరికే కదా అని లైట్ తీసుకుంటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మిస్ చేసుకున్నట్లే. ఔషధ గుణాలు ఉన్నాయి.
వినాయకుడి నైవేద్యంగా సమర్పించే గరికలో ఎన్నో ప్రయోజనాలున్నాయి. గరికే కదా అని లైట్ తీసుకుంటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మిస్ చేసుకున్నట్లే. ఔషధ గుణాలు ఉన్నాయి.
Krishna Kowshik
ఎక్కడ పడితే అక్కడ మోస్తారు నుండి ఏపుగా ఎదిగే మొక్క గరిక. పంట పొలాల గట్లపై, పొలాల్లో, ఖాళీ ప్రదేశాల్లో పెరుగుతూ ఉంటుంది. పసిరిక బయళ్లు చూస్తుంటే పచ్చని చీర పరిచినట్లుగా కనిపిస్తూ.. మనస్సు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. గరికను వినాయకునికి నైవేద్యంగానూ సమర్పిస్తారని తెలుసు. రైతుకు తప్ప ఎవరికీ నష్టం చేకూర్చని గరికను ఈ మధ్య కాలంలో ఇళ్లల్లో కూడా ప్రత్యేకంగా పెంచుతున్నారు. గేదెలు, ఆవులు, మేకలు వీటిని తిని.. బలిష్టంగా పెరిగి చక్కటి పాలను అందిస్తాయి. పశువులు మేతగా వినియోగించే ఈ గరికలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టే ఎన్నో ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి.. ఏంటీ ఇప్పుడు గడ్డి తినమంటారా..? అని అనుకుంటున్నారా.?
ఆగండి… ఈ ప్రయోజనాలు వింటే.. మేము వద్దన్నా మీరు కచ్చితంగా ఆహారంలో మిళితం చేసుకుంటారు. ఒకప్పుడు గరికను పచ్చడిగా చేసుకుని తినేవాళ్లట మన పెద్దవాళ్లు. పేదరాసి పెద్దమ్మ సైతం ఓ రాజుకు పచ్చడి చేసి వడ్డిస్తే ఆవురావురూ అంటూ తిన్నాడట. ఇది టేస్టేలో మాత్రమే కాదు.. విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ది బెస్ట్. విటమిన్-ఎ,సితో పాటు ప్రొటీన్, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, ఎసిటిక్ యాసిడ్, ఆల్కలాయిడ్స్, గ్లూకోసైడ్స్ వంటి పోషకాలను కలిగి ఉంది. ఇందులోని యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటిసెప్టిక్ గుణాలు అనేక వ్యాధులకు చెక్ పెడతాయి. రోజూ గరికను తినడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.
గరికలో యాంటీ-వైరల్, యాంటీ-మైక్రోబయల్ లక్షణాలు వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. శరీరాన్ని బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడేలా చేస్తాయి. గడ్డిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ తగ్గుతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆయుర్వేదంలో గరిక గడ్డి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఒంటికి చల్లదనాన్ని అందిస్తుందట ఈ కలుపు మొక్క. మూత్ర సంబంధిత సమస్యలను తగ్గించే లక్షణం ఈ గడ్డి పోచకు ఉంది. గడ్డిని శుభ్రంగా కడిగి కాషాయం చేసుకుని తాగితే.. ఈ సమస్య నుండి చక్కట ఉపశమనం లభిస్తుంది. దురదలు, దద్దుర్లు వచ్చినప్పుడు గ్రాస్‌ను శుభ్రంగా కడిగి రుద్దితే.. మంచి ఫలితం ఉంటుందట.
కడుపులో అజీర్తి, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. గరిక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. గరికను నూరి రసం తీసుకుని, అందులో దంపుడు బియ్యం కడిగేటప్పుడు వచ్చే నీళ్లు కలిపి, పటికబెల్లం వేసి తాగితే వాంటింగ్ సెన్సేషన్ ఉండదు. రక్తస్రావం సమస్యలతో బాధపడుతున్న వారికి మంచి ఫలితం ఇస్తుంది గరిక. మహిళలకు రుతుక్రమం సమయంలో ఎక్కువ రక్త స్రావం అవుతున్నప్పుడు.. ఫైల్స్‌తో ఇబ్బంది పడుతున్నప్పుడు.. గరికను రుబ్బి, కషాయం తీసుకుని.. రోజు రెండు పూటలా తీసుకుంటే..బ్లీడింగ్ అదుపులోకి వస్తుంది. గరిక గడ్డి రసంలో కొంచెం బెల్లం కలుపుకుని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పీసీఓడీ, రుతుక్రమ సమస్యలు, అధిక రక్తస్రావం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. తలనొప్పి సమస్యలు ఉన్నప్పుడు.. పేస్టులా రుబ్బి.. లేపనంలా రాస్తే నొప్పి హాంఫట్ కావాల్సిందే. రక్తాన్ని శుద్ధి చేసే గుణం గరికకు ఉంది. గరిక గడ్డి రసాన్ని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం మంచిది. మరెందుకు ఆలస్యం ఓ సారి ట్రై చేసిచూడండి.