భారత్‌ ఘనత.. తక్కువ ధరకే టీబీ టెస్ట్‌ కిట్‌ తయారీ.. ఎంతంటే!

TB Test Kit: క్షయ వ్యాధి గురించి ప్రతి ఒక్కరి తెలిసింది. ప్రస్తుతం ఇది ప్రాణంత వ్యాధికాకపోయినా...చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. తాజాగా ఈ వ్యాధి విషయంలో భారత్ ఓ ఘనత సాధించిందనే చెప్పొచ్చు. మరి. ఆ ఘనత ఏమిటంటే..

TB Test Kit: క్షయ వ్యాధి గురించి ప్రతి ఒక్కరి తెలిసింది. ప్రస్తుతం ఇది ప్రాణంత వ్యాధికాకపోయినా...చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. తాజాగా ఈ వ్యాధి విషయంలో భారత్ ఓ ఘనత సాధించిందనే చెప్పొచ్చు. మరి. ఆ ఘనత ఏమిటంటే..

సమాజంలో ఎన్నో రకాల వ్యాధులు  మనుషులను ఇబ్బందులకు గురి చేస్తుంటారు. కాలం మారుతున్న కొద్ది కొత్త కొత్త రకాల వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. అంతేకాక కొన్ని రకలా వ్యాధులు, జబ్బులు దశాబ్దాల నుంచి మనుషులను వేధిస్తున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటే క్షయవ్యాధి. కాలక్రమంలో వైద్యరంగంలో వచ్చిన మార్పుల్లో భాగంగా ఈ ప్రాణాంతక వ్యాధి ప్రభావం క్రమంగా తగ్గుముఖం పట్టింది. అయినా ఈ టీబీ వ్యాధి కేసులు మన దేశంలో నమోదవుతూనే ఉన్నాయి.  ఇక వ్యాధి త్వరగా కనిపెట్టే విషయంలో మన దేశం ముందడుగు వేసింది. ప్రపంచంలోనే  చౌకైనా టీబీ టెస్ట్ కిట్ ను భారత్ లో తయారు చేస్తున్నారు.  మరి.. దాని ధర ఎంత, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…

క్షయ వ్యాధి గురించి ప్రతి ఒక్కరి తెలిసింది. ప్రస్తుతం ఇది ప్రాణంత వ్యాధికాకపోయినా…చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇది మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ బ్యాక్టీరియా వల్ల కలిగే ఓ రకమైన అంటు వ్యాధి. ఈ బ్యాక్టీరియా మనిషి శరీరంలోని ఊపిరితిత్తులపై చెడు ప్రభావం చూపిస్తుంది. కేవలం లంగ్స్ లోనే కాకుండా టీబీ శరీరంలోని ఇతర భాగాలకు కూడా సోకే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు..ఈ  బ్యాక్టీరియా బయటకు వస్తుంది. అలా గాలి ద్వారా మరొక వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ వ్యాధి త్వరగా సోకుతుందని వైద్యులు.

కొంతకాలం క్రితం వరకు ఈ వ్యాధికి పరీక్షలు చేయించుకోవాలంటే భారీగా డబ్బులు ఖర్చు చేయాలి. అయితే భారత్ ఈ వ్యాధి విషయంలో ఓ అరుదైన ఘనత సాధించింది. క్షయ వ్యాధిని ముందుగా గుర్తించేందుకు ఐసీఎంఆర్ కొత్త సాంకేతికతను కనుగొంది. దీని ద్వారా కేవలం రెండు గంటల్లో క్షయ వ్యాధిని గుర్తించే టెస్ట్ కిట్‌ను తయారు చేశారు. ప్రపంచంలోనే అత్యంత చౌకైనా ఈ టీబీ టెస్ట్ కిట్ భారత్ తయారు చేసింది. ఈ కిట్ ధర కేవలం రూ.35  ఉందట. ఈ కొత్త టెక్నాలజీతో 1500 పైగా శాంపిల్స్ ను ఏకకాలంలో పరీక్షించవచ్చు. టీబీ పీసీఆర్ కిట్ అనేది రోగి శాంపిల్ నుంచి డీఎన్ ఏ ను వేరు చేయగల సాంకేతికతను కలిగి ఉంది. ఈ కిట్ సీఆర్ఐఎస్పీఆర్ టెక్నాలజీపై పనిచేస్తుంది. ఈ కిట్‌ ద్వారా అన్ని డీఎన్ఏ నమూనాలను స్పీడ్ ప్రాసెస్ చేయవచ్చు.

 ఈ ప్రక్రియ ద్వారా డీఎన్‌ఏ, టీబీ బాక్టీరియాను వేరు చేస్తారు. ఈ క్రమంలోనే కిట్‌తో శరీరంలోని క్షయ వ్యాధికి కారణమయ్యే  బ్యాక్టీరియా ఉందా లేదా అని పరీక్షిస్తారు. ఈ టెస్ట్ ద్వారా కేవలం రెండు గంటల్లోనే ఫలితాలు వచ్చేస్తాయి. ఈ రెండు టెక్నాలజీలను మార్కెట్‌లోకి తీసుకురావడానికి ఐసీఎంఆర్ ప్రతిపాదనలను ప్రైవేట్ కంపెనీల నుంచి ఆహ్వానించింది. అయితే ఈ సాంకేతికతకు సంబంధించిన హక్కులు మాత్రం ఐసీఏఆర్ వద్దే ఉంటాయి. ఆ ప్రకారం…ఏ కంపెనీ అయినా సరే ఈ కిట్‌ను మార్కెట్‌లోకి కేవలం 35 రూపాయలకే విడుదల చేయాల్సి ఉంటుంది. తక్కువ ధర కలిగిన ఈ కిట్‌తో క్షయ వ్యాధిని సులభంగా గుర్తించవచ్చు.

Show comments