nagidream
Shopping Disorder In Women: షాపింగ్ అంటే అమ్మాయిలు, అమ్మాయిలంటే షాపింగ్ అనేలా బంధం ముడిపడిపోయింది. వారంలో ఒకసారైనా షాపింగ్ చేయకుండా ఉండలేని పరిస్థితి చాలా మందిది. పాపం చాలా మంది మగాళ్లు తాము ఆడవాళ్ళ షాపింగ్ బాధితులమని చెప్పుకుని ఏడుస్తున్నారు. అయితే ఇప్పుడు మగాళ్లని మరింత షాక్ కి గురి చేసే వార్త ఒకటి బయటకొచ్చింది. లేడీస్ ని ఒక విచిత్రమైన వ్యాధి వెంటాడుతోంది. ఆ వ్యాధి వస్తే నిద్రలోనే షాపింగ్ చేసి డబ్బులు పోగొడతారు.
Shopping Disorder In Women: షాపింగ్ అంటే అమ్మాయిలు, అమ్మాయిలంటే షాపింగ్ అనేలా బంధం ముడిపడిపోయింది. వారంలో ఒకసారైనా షాపింగ్ చేయకుండా ఉండలేని పరిస్థితి చాలా మందిది. పాపం చాలా మంది మగాళ్లు తాము ఆడవాళ్ళ షాపింగ్ బాధితులమని చెప్పుకుని ఏడుస్తున్నారు. అయితే ఇప్పుడు మగాళ్లని మరింత షాక్ కి గురి చేసే వార్త ఒకటి బయటకొచ్చింది. లేడీస్ ని ఒక విచిత్రమైన వ్యాధి వెంటాడుతోంది. ఆ వ్యాధి వస్తే నిద్రలోనే షాపింగ్ చేసి డబ్బులు పోగొడతారు.
nagidream
డిజార్డర్స్ లో అనేక రకాలు ఉన్నాయి. స్లీపింగ్ డిజార్డర్ అని, మూడ్ డిజార్డర్ అని, పర్సనాలిటీ డిజార్డర్ అని ఇలా మొత్తం 200 రకాల డిజార్డర్స్ ఉన్నాయి. అయితే వీటిలో డేంజరస్ డిజార్డర్ ఏదైనా ఉందంటే అది పారాసోమ్నియా అనే స్లీపింగ్ డిజార్డరే. దీని వల్ల ఒక్క రాత్రిలో లక్షలు నష్టపోతారు. ఇదొక రకంగా జూదం లాంటిదని చెప్పాలి. ఏం జరుగుతుందో తెలిసేలోపే అంతా అయిపోతుంది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా షాపింగ్ చేసేసి మొత్తం డబ్బు గుల్ల చేసేస్తారు. మామూలుగానే ఆడవాళ్ళకి షాపింగ్ అంటే ఇష్టం. వద్దన్నా చేస్తూనే ఉంటారు. ఆడవాళ్లు షాపింగ్ అంటే ఇంట్లో మగాళ్ల గుండెల్లో అంబులెన్స్ సైరన్ మోగుతుంది.
అలాంటిది ఇప్పుడు విచిత్ర వ్యాధి ఒకటి ఆడవాళ్లను వెంటాడుతుందంటే నమ్ముతారా? ఈ వ్యాధి సోకితే నిద్రలోనే షాపింగ్ చేసి డబ్బులు పోగొట్టేస్తారు. అవును మీరు విన్నది నిజమే. నిద్రలో లేచి నడిచే జబ్బులా ఇదొక వింత జబ్బు. ఇటీవల ఇంగ్లాండ్ కి చెందిన ఒక మహిళ నిద్రలోనే షాపింగ్ చేసింది. 3 వేల పౌండ్ల కంటే ఎక్కువ మొత్తంలో నిద్రలో షాపింగ్ చేసి పోగొట్టింది. మన కరెన్సీ ప్రకారం 3.2 లక్షలు పోగొట్టింది. 42 ఏళ్ల కెల్లీ నైప్స్ అనే మహిళ ఒక్క రాత్రిలో తనకు తెలియకుండానే నిద్రలో షాపింగ్ చేసి లక్షలు పోగొట్టింది. ఈ స్లీపింగ్ డిజార్డర్ పేరు పారాసోమ్నియా. కెల్లీ పారాసోమ్నియా అనే స్లీపింగ్ డిజార్డర్ తో బాధపడుతుంది. రాత్రి నిద్రలో ఉండగా.. ప్లాస్టిక్ బాస్కెట్ బాల్ కోర్టు, నెట్, పోల్, బ్యాక్ బోర్డు వంటి వస్తువులు కొనుగోలు చేసింది.
పెయింట్ టిన్స్, పుస్తకాలూ, సాల్ట్, పెప్పర్ పాట్స్, పిల్లల ప్లే హౌజ్, ఫ్రిడ్జ్ లు, టేబుల్స్, వందల సంఖ్యలో హారిబో క్యాండీస్ కొనుగోలు చేసింది. అయితే నిద్రలో షాపింగ్ చేయడం వల్ల ఆ వస్తువులని తిరిగి ఇచ్చేయాలని అనుకుంది. కానీ పిల్లలు చూడడంతో ఫుడ్ ఐటమ్స్ ని, పెయింట్ టిన్స్ ని తన దగ్గరే ఉంచుకుంది. అయితే షాపింగ్ చేసిన రోజు రాత్రి తనకు ఏం జరిగిందో గుర్తులేదని ఆమె వెల్లడించింది. ఈ పారాసోమ్నియా వచ్చిన వారి ప్రవర్తన అసాధారణంగా ఉంటుంది. ఎమోషన్స్, కలలు వంటివి నిద్రలోనే వస్తాయి. ఇది ఎక్కువగా ఆడవారిలోనే వస్తుండడం గమనార్హం. ఏ డిజార్డర్ పై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ డిజార్డర్ గురించి ఇక్కడ ఆడ లేడీస్ కి చెప్పకండి బాబోయ్.. చెప్తే పారాసోమ్నియా డిజార్డర్ వచ్చిందని అబద్ధం చెప్పి మొగుళ్ళ పర్సులు గుల్ల చేసేస్తారంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విచిత్రమైన డిజార్డర్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.