Swetha
Flax Seeds Benefits In Telugu: అవిసె గింజలు.. వీటిని ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటూ ఉంటారు. మరి ఇవి ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయి.. వీటివలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి.. అనే విషయాలను తెలుసుకుందాం.
Flax Seeds Benefits In Telugu: అవిసె గింజలు.. వీటిని ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటూ ఉంటారు. మరి ఇవి ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయి.. వీటివలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి.. అనే విషయాలను తెలుసుకుందాం.
Swetha
ఇప్పుడున్న కలుషిత వాతావరణంలో మానవ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే.. జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అందులో ముఖ్యంగా తినే ఆహార పదార్ధాలలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. దానిలో భాగంగా కొన్ని విత్తనాలను తినడం వలన చాలా మేలు జరుగుతుంది. వాటిలో అవిసె గింజలను తీసుకోవడం వలన.. శరీరానికి మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. పూర్వం నుంచి కూడా దీనిని గ్రామాలలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు ఈ విత్తనాల వాడకం కూడా కనుమరుగైపోయింది. ప్రస్తుతం వీటిని ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకునే కొంతమంది మాత్రమే తింటున్నారు. కానీ నిజానికి దీనిని ప్రతి ఒక్కరు తీసుకోవడం వలన ఆరోగ్యానికి అనేక లాభాలు చేకూరుతాయి. మరి అవిసె గింజల వలన కలిగే పూర్తి లాభాలేంటో.. వాటిని ఎలా వినియోగించాలో .. దీనికి సంబంధించిన పూర్తి విషయాలను తెలుసుకుందాం.
అవిసె గింజలలో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. ముఖ్యంగా శరీరంలోని కొవ్వును కరిగించడంలో అవిసె గింజలు బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. వీటిని పొడి చేసి.. ప్రతి రోజు నీటితో కలిపి తీసుకోవచ్చు. అలాగే అవిసె గింజలను వేయించి కూడా తినవచ్చు. ఇది శరీరానికి కావాల్సిన ఫైబర్ ను అందిస్తుంది. అయితే దీనిని తీసుకునేటప్పుడు మాత్రం నీటిని ఎక్కువగా తాగాలి. కేవలం రెండు స్పూన్స్ అవిసె గింజలలో ఎక్కువ మోతాదులో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ఇవి శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. సాధారణంగా ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ చేపలలో ఉంటాయి. చేపలు తినని వారు ఇవి తీసుకోవడం వలన మేలు జరుగుతుంది.
ఎక్కువగా తీసుకుంటే ఏదైనా ప్రమాదమే కాబట్టి తీసుకునే ప్రతి ఆహార పదార్ధాన్ని.. శరీరానికి సరిపడా సరైన మోతాదులో తీసుకోవాలి. అలానే శరీర తత్వాన్ని, దేని కొరకు తీసుకోవాలనుకుంటున్నారో దాని మీద.. ఈ అవిసె గింజలు ఎంత మోతాదులో తీసుకోవాలో ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఆరోగ్యం మీద శ్రద్దతో తీసుకోవాలి అనుకుంటే 10 నుంచి 20 గ్రాములు అంటే 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ అవిసె గింజలు తీసుకోవాలి. అదే జీర్ణక్రియ కు సంబంధించి తీసుకోవాలంటే మాత్రం 20 నుంచి 30 గ్రాములు అంటే 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటే మంచిది. అలాగే శరీరంలో కొవ్వును తగ్గించుకోవడం తీసుకోవాలన్నా కూడా ఇంతే మోతాదులో అవిసె గింజలను తీసుకోవాలి.
ఆహార పదార్ధాలను తినడానికి కూడా సరైన సమయం ఉంటుంది. ఏ సమయంలో పడితే ఆ సమయంలో తీసుకుంటే అది అనారోగ్యాలకు దారితీస్తుంది. అలాగే అవిసె గింజలను ఉదయం లేవగానే తీసుకోవడం వలన చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఇలా చేయడం వలన శరీరంలో శక్తిని పెరగడంతో పాటు.. జీర్ణక్రియ పని తీరు కూడా బాగుంటుంది. లేదా నిద్రపోడానికి ముందు వీటిని తీసుకుంటే.. వీటిలో ఉండే మెగ్నీషియం, ఒమేగా-3 పోషకాల వలన.. రాత్రి సమయంలో ప్రశాంతంగా నిద్ర పోడానికి తోడ్పడుతుంది. ఇక వీటిని వర్క్ అవుట్ చేసిన తర్వాత తీసుకుంటే.. కండరాల ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
శరీరంలో కొవ్వును కరిగించడానికి అవిసె గింజలు చాలా సహాయపడుతూ ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యంగా బెల్లి ఫ్యాట్ ను తగ్గించుకోవాలంటే మాత్రం అవిసె గింజలను ఈ విధంగా ఉపయోగించాలి. రోజు తాగే న్యాచురల్ డీటాక్స్ డ్రింక్ లా.. ఒక స్పూన్ అవిసె గింజలను ఒక గ్లాస్ వాటర్ లో కలుపుకుని తాగితే మంచిది. అలాగే పొట్ట తగ్గడంతో పాటు.. శరీరానికి సరిపడా ఫైబర్ కంటెంట్ కూడా అందాలంటే మాత్రం.. పెరుగు లేదా ఓట్స్ లో ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్స్ అవిసె గింజలను కలుపుకుని తింటే మంచిది. ముఖ్యంగా నిద్రపోయి ముందు తాగితే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి.
ఇప్పుడున్న కలుషిత వాతావరణంలో.. అందరిని ఇబ్బంది పెట్టె అతి ముఖ్యమైన సమస్య.. జుట్టు రాలడం. అయితే అవిసె గింజల వలన ఉండే ముఖ్యమైన ఉపయోగాలలో జుట్టు పెరుగుదల కూడా ఒకటి. జుట్టు సంరక్షణకు వీటిని ఎలా ఉపయోగించాలో చూసేద్దాం. అవిసె గింజల నూనెతో తరచూ జుట్టు కుదుళ్లకు మసాజ్ చేయడం వలన .. జుట్టు ఎదుగుదల బావుంటుంది. అలాగే దీనిని రాత్రంతా నానపెట్టి.. ఉదయం పేస్ట్ లా తయారు చేసుకుని.. హెయిర్ మాస్క్ లా వేసుకుంటే .. జుట్టు చాలా సిల్కిగా, ఆరోగ్యాంగా ఉంటుంది. కనీసం వారానికి రెండు నుంచి మూడు సార్లు ఇలా చేయడం మంచిది. వీటిలో పాటు ప్రతి రోజు అవిసె గింజలు నానపెట్టిన నీటిని తాగడం వలన కూడా.. క్రమ క్రమంగా జుట్టు పెరగడం గమనించవచ్చు.
ముందుగా ఏ మనిషిలోనైనా అందరూ గమనించేది స్కిన్ టోన్.. ఈ మధ్య అందరు సౌందర్యంపైన దృష్టి పెడుతూ ఉన్నారు. దానికోసం రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ.. సైడ్ ఎఫెక్ట్స్ కూడా తెచ్చుకుంటూ ఉంటారు. దానిబదులు సహజంగా చర్మం కాంతివంతంగా మెరవాలంటే మాత్రం అవిసె గింజలు బెస్ట్ ఛాయస్. రెండు స్పూన్స్ అవిసె గింజలను , వాటర్ ను కలిపి పేస్ట్ చేసి.. ముఖానికి మాస్క్ లా అప్లై చేస్తే.. చర్మానికి సరిపడా తేమ గుణాలు అందుతాయి. అంతే కాకుండా దీనిలో ఆ పేస్ట్ లో తేనే కలిపి ముఖానికి అప్లై చేసినా కూడా.. చర్మం కాంతివంతంగా మెరవడంతో పాటు.. ముఖంపై ముడతలు, డార్క్ స్పాట్స్ ను కూడా తగ్గించడంలో సహాయపడతాయి. వారంలో కనీసం రెండు నుంచి మూడు సార్లు ఇలా చేసినా కూడా మెరుగైన ఫలితం కనిపిస్తుంది.
సాధారణంగా మహిళలలో ఎదో ఒక అనారోగ్య సమస్య వస్తూనే ఉంటుంది. పీరియడ్స్ సరైన సమయానికి రాకపోవడమో లేదా బలహీనంగా ఉండడమో ఇలా చెప్పుకోలేని ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే వీటికి అవిసె గింజలతో కొంత మేర చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో వచ్చే మూడ్ స్వింగ్స్ , కడుపు ఉబ్బరం, కీళ్ల నొప్పులు లాంటివి తగ్గించడంలో.. అవిసె గింజలు బాగా ఉపయోగపడతాయి. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కారణంగా వచ్చే PCOS/PCOD సమస్యలను దూరం చేయడంలో కూడా అవిసె గింజలు ముందుటాయి. ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యలు , బ్రెస్ట్ హెల్త్ , బోన్ హెల్త్ ఇలా మహిళలకు సంబంధించి వచ్చే ప్రతి చిన్న ఆరోగ్య సమస్యను.. అవిసె గింజలను ఎదో విధంగా తీసుకోవడం వలన మేలు జరుగుతుంది.
మహిళలకు మాత్రమే కాకుండా.. పురుషులలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. పురుషులలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ను బ్యాలన్స్ చేయడానికి అవిసె గింజలు బాగా మేలు చేస్తాయి. సంతానోత్పత్తి మెరుగు పరచడంలో కూడా అవిసె గింజలు సహపడతాయి. ఇది మాత్రమే కాకుండా హార్ట్ హెల్త్, కండరాల పెరుగుదల, జీర్ణక్రియ ప్రక్రియ , క్యాన్సర్ నివారణ ఇలాంటి ఎన్నో సమస్యలను రానివ్వకుండా.. అవిసె గింజలు తోడ్పడతాయి. కాబట్టి వీటిని రోజు వారి డైట్ లో చేర్చుకోవడం మంచిది.
అవిసె గింజలలోని పోషక విలువలు పోకుండా ఉండాలంటే వాటిని చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. దీనికి ప్రత్యేక కారణం ఉంది. అవిసె గింజలు అన్నీ వాతావరణ పరిస్థితుల్లో నిలువ ఉండలేవు. ఓ పర్టికులర్ టెంపరేచర్ వద్ద మాత్రమే అవి.. తన పోషక గుణాలని కోల్పోకుండా ఉంటాయి. కాబట్టి.. అత్యధిక వేడి, లేదా తేమ.. ఈ రెండు ఉన్న ప్రదేశాలు.. అవిసె గింజల నిల్వకి సరిపడవు.
అలాగే వీటిని తీసుకుంటున్న సమయంలో ప్రతి రోజు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీటిని తాగాలి. ఎందుకంటే అవిసె గింజలలో వేడి కలిగించే గుణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. దానిని బ్యాలన్స్ వీలైనంత ఎక్కువ నీటిని తీసుకోవడం మంచిది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం నిపుణులు, వైద్యులు తెలిపిన వివరాల ఆధారంగా ఇచ్చాము. దీన్ని iDREAM Media నిర్ధారించలేదు. ఏవైనా సందేహాలుంటే వైద్యులని సంప్రదించాలి.