దువ్వెన చెట్టుతో పురుషుల్లో లైంగిక సామర్థ్యం మెరుగు

ఈ కాంక్రీట్ జంగిల్లో చాలా మందికి మొక్కలు, మానులు గురించి పెద్దగా తెలియదు. ఉన్న కొద్ది పాటి స్థలంలో తమకు నచ్చిన మొక్కలు పెంచుకుంటున్నారు. కానీ ఒకప్పుడు మొక్కలు, కాయలతో ఆడుకునేవారు. వాటిల్లో ఒకటి దువ్వెన చెట్టు. అదే అతిబల.

ఈ కాంక్రీట్ జంగిల్లో చాలా మందికి మొక్కలు, మానులు గురించి పెద్దగా తెలియదు. ఉన్న కొద్ది పాటి స్థలంలో తమకు నచ్చిన మొక్కలు పెంచుకుంటున్నారు. కానీ ఒకప్పుడు మొక్కలు, కాయలతో ఆడుకునేవారు. వాటిల్లో ఒకటి దువ్వెన చెట్టు. అదే అతిబల.

పొలాల గట్లపై ఏపుగా పెరుగుతూ.. అందమైన పువ్వులు, కాయలతో ఆకర్షించే చెట్టు అతిబల. వీటి కాయలు దువ్వెనను పోలి ఉంటాయి. పిల్లలు వీటితో తమాషాగా తలలు కూడా దువ్వుకునేవారు. అందుకే వీటికి దువ్వెన బెండ, ముద్ర బెండ, దువ్వెన కాయలు, వజ్ర వల్లి, తుత్తురు బెండ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ పొదలాగా ఎదుగుతుంటాయి ఈ చెట్లు. కానీ ఇందులో ఎన్నో మెడిసన్ వ్యాల్యూస్ ఉన్నాయి. అతి బల అంటే.. ఎక్కువ బలం చేకూరుస్తుందని అర్థం. వేరు, ఆకు,పువ్వు, కాండం, గింజలు అన్నింట్లో కూడా ఔషధ గుణాలున్నాయి. ఆయుర్వేదంలో ఈ చెట్టుకు బాగా డిమాండ్ ఎక్కువ. వంద రోగాలను తరిమికొట్టే శక్తి ఉందట ఈ చెట్టుకు. ఆ జాబితా తెలిస్తే నివ్వెర పోవడం ఖాయం.

సీజన్లతో సంబంధం లేకుండా వచ్చే వ్యాధి ఫీవర్. ముఖ్యంగా మలేరియా, టైపాయిడ్.  ఈ వ్యాధులను తగ్గించే శక్తి ఈ చెట్టుకు ఉంది. ఈ ఆకుల్లో రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి. అతిబల ఆకులను నేరుగా తినడం లేదా.. కషాయంగా కాసుకుని తాగడం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ వంటి వాటిని శరీరంలోకి రానివ్వకుండా రక్షిస్తుంది. ఇది ఇమ్యునిటీ బూస్టర్‌లా పనిచేస్తుంది. జ్వరం, వాంతులు వంటివే కాకుండా అంటు వ్యాధులైనా టీబీ, క్షయ, కలరా, కామెర్లు, అతిసార వ్యాధి వంటి రోగాలకు చెక్ పెడుతుంది. అంటు వ్యాధులు ప్రబలకుండా నివారిస్తుంది. కరోనా వైరస్ మాత్రమే కాకుండా.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీ ఫాక్స్, చికెన్ ఫాక్స్, ఫ్లూ వైరస్, జికా, నిఫా వైరస్ శరీరంలోకి రానివ్వకుండా రక్షిస్తుంది ఈ చెట్టు. అబ్బో చెప్పుకుంటూ పోతే ఎన్నో రోగాలను నివారిస్తుంది.

ఆయుర్వేదంలో అతి బలను ఎన్నో వ్యాధులను నయం చేసేందుకు వినియోగిస్తారు. పక్షవాతానికి, ఫిడ్స్, నరాల బలహీనత వంటి సమస్యలను తగ్గిస్తుంది. అతిబల ఆకులను ఎండబెట్టి చూర్ణం చేసుకుని వినియోగిస్తే మంచి ఫలితాలుంటాయి. ఊపిరితిత్తుల ఇష్యూస్ మాత్రమే కాకుండా మూత్రంలో మంట, రక్తం వంటివి పడుతున్నప్పుడు వీటి ఆకులను ఓ పన్నెండు గంటల పాటు నానబెట్టి.. ఆకులు తీసి పటిక బెల్లం కలిపి రోగం హాం ఫట్. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. పురుషులకు దివ్య ఔషధం. చాలా మంది పురుషుల్లో లైంగిక సమస్యలు ఉంటాయి. వీటిని ఎవరి దగ్గర డిస్కస్ చేయలేరు. భార్యను సుఖపెట్టలేకపోతున్నామని మదన పడుతుంటారు. అలాంటి వారికి అతిబల గింజలు పొడి చేసి వాటిని కషాయంగా తాగితే.. మగతనం మెరుగుపడుతుంది.

స్పెర్మ్ కౌంటింగ్ పెంచి.. సంతాన భాగ్యం కలిగేలా చేస్తుంది.  షుగర్ పేషెంట్లకు అతి బల మంచి ఔషధంలా పనిచేస్తుంది. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు వేగంగా పెరగి, చక్కెర స్థాయి కూడా తగ్గుతుంది. అతిబలను క్రమం తప్పకుండా వాడితే.. బాడీలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఛాతీలో పేరుకుపోయిన కఫం సులభంగా బయటకు వస్తుంది. దీర్ఘకాలంగా జలుబు, దగ్గుతో బాధపడే వారు అతిబల మొక్క పొడిని తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. అతిబల విత్తనాలను తీసుకోవడం వల్ల కిడ్నీల్లో రాళ్ల సమస్య తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది సమాచారం కోసం మాత్రమే.. వినియోగించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

Show comments