Arjun Suravaram
చలికాలంలో నీటిని వేడి చేసేందుకు గిజ్లర్, గ్యాస్, హీటర్ వంటివి వాడుతుంటారు. అయితే ఎక్కువ మంది గ్యాస్ కంటే హీటర్ మేలనే భావనతో దానినే వినియోగిస్తుంటారు. అయితే హీటర్ ను వాడే వారు కొన్ని విషయాలను తప్పని సరిగా తెలుసుకోవాలి.
చలికాలంలో నీటిని వేడి చేసేందుకు గిజ్లర్, గ్యాస్, హీటర్ వంటివి వాడుతుంటారు. అయితే ఎక్కువ మంది గ్యాస్ కంటే హీటర్ మేలనే భావనతో దానినే వినియోగిస్తుంటారు. అయితే హీటర్ ను వాడే వారు కొన్ని విషయాలను తప్పని సరిగా తెలుసుకోవాలి.
Arjun Suravaram
సాధారణంగా శీతకాలంలో నీరు చల్లగా ఉండటంతో చాలా మంది స్నానం చేసేందుకు, ముఖం కడుక్కునేందుకు వేడి నీటిని ఉపయోగిస్తుంటారు. అయితే నీటిని వేడి చేసుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. పూర్వం పొయ్యిల కట్టేల మీద నీటిని వేడి చేసేవారు. ఆ తరువాత గ్యాస్ పొయ్యిపై నీటిని వేడి చేసుకుంటున్నారు. ఇదే సమయంలో కరెంట్ ను ఉపయోగించి.. హీటర్ ద్వారా నీటిని వేడి చేసుకుండున్నారు. ఇలా వేడి నీటి కోసం హీటర్ ను వాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటీవలే హీటర్ కారణంగా పలువురు మృతి చెందారు. మరి.. మీరు కూడా వేడి నీళ్ల కోసం రాడ్ ను వాడుతున్నారా?. అయితే కొన్ని విషయాలను తప్పకుండా పాటించండి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
డిసెంబర్ నెల ప్రారంభంలోనే చలికాలం మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్టోగ్రతలు కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ప్రజలకు కూడా చలిగాలులకు గజ గజ ఒణికిపోతున్నారు. చలికాలంలో చల్లని గాలులు వీచడంతో పాటు సూర్యరశ్మి కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఉదయం పూట స్నానం చేయాల్సి వస్తే మాత్రం తప్పకుండా వేడి నీళ్లను ఉపయోగించే స్నానం చేస్తుంటారు. వేడి నీరు లేకుండా స్నానాలు చేయడం అంతసులభం కాదు.
ఇక వేడి నీటి కోసం గీజర్లను వినియోగిస్తున్నారు. మరికొందరు గ్యాస్ స్టవ్ లపై నీటిని వేడి చేసుకుంటారు. అయితే గ్యాస్ స్టవ్ పై కంటే.. హీటర్ వాడటం మేలని చాలా మంది దాన్నే వినియోగిస్తున్నారు. హీటర్ లేదా ఇమ్మర్షన్ రాడ్ ఉపయోగించేటప్పుడ చాలా జాగ్రత్తతగా ఉండాలి. హీటర్ ను స్నానపు గదిలో పొరపాటున ఉంచకూడదు. ఎందుకంటే ఇవి మాన్యువల్‌గా పనిచేస్తాయి. ఆటోమెటిక్ స్విచ్చాఫ్ ఆప్షన్ వీటిలో ఉండదు. హీటర్ రాడ్ ను పూర్తిగా నీటిలో ముంచిన తర్వాతే, స్విచ్ ఆన్ చెయ్యాలి. ఇక అందులోని నీరు వేడెక్కిందో లేదో చెక్ చేయడానికి అలాగే వేలు పెట్టకూడదు.
హీటర్ స్విచ్చాఫ్ చేసిన తర్వాత దానిని నీటి నుంచి పూర్తిగా బయటకు తీసిన తరువాత చెక్ చేయాలి. అలాగే హీటర్ స్విచ్చాఫ్ చేశాక, 10 సెకండ్ల తర్వాత నీటి నుంచి తియ్యడం మేలు. మెటల్, విద్యుత్తు, మంచి కండక్టర్. అందులో విద్యుత్ సరఫరా అవుతోంది. అందువల్ల, ఎప్పుడూ మెటల్ బకెట్ ఉపయోగించ కూడదు. అలాగే ఎప్పుడు కూడా చవకైనా హీటింగ్ రాడ్లను ఉపయోగించవద్దు. భద్రత విషయంలో రాజీ పడకుండా మంచి నాణ్యమైనవి మాత్రమే కొనుగోలు చేయ్యాలి. నాణ్యత లేని వాటి వల్ల కరెంట్ షాక్ కొట్టి.. ప్రాణాలు పోయిన ఘటనలు అనేకం జరిగాయి.
వేటి నీటి కోసం ప్లాస్టిక్ బకెట్ ఉపయోగించడం సురక్షితం. అయితే ఆ బకెట్‌లో హీటర్ ను ఎక్కువసేపు ఉంచితే, బకెట్ కరిగిపోతుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా నీరు కొద్దిగా వేడికాగానే స్విచ్ఛాఫ్ చేస్తే సరి పోతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. హీటర్ సహయంతో నీటిని వేడి చేసుకునే వారు పసిపిల్లలకు వీలైంనత దూరంగా ఉండేలా చూసుకోవాలి. హీటర్ వాడే వారు.. పై విషయాలను తప్పని సరిగా గుర్తుంచుకోవాలి. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.