Swetha
చికెన్ తింటే శరీరంలో ప్రోటీన్స్ పెరుగుతాయి. దానివలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి మరింత బలపడుతుంది. అందుకే రకరకాల వైరస్ లను ఎదుర్కునే శక్తి మన శరీరానికి ఉంటుంది. ఇదంతా నిజమే.. కానీ ఇప్పుడు అదే చికెన్ మనలో ఉండే శక్తిని నశింపజేసేలా చేస్తుంది. చికెన్ తింటే మొదటికే మోసం వచ్చేలా ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.
చికెన్ తింటే శరీరంలో ప్రోటీన్స్ పెరుగుతాయి. దానివలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి మరింత బలపడుతుంది. అందుకే రకరకాల వైరస్ లను ఎదుర్కునే శక్తి మన శరీరానికి ఉంటుంది. ఇదంతా నిజమే.. కానీ ఇప్పుడు అదే చికెన్ మనలో ఉండే శక్తిని నశింపజేసేలా చేస్తుంది. చికెన్ తింటే మొదటికే మోసం వచ్చేలా ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.
Swetha
ఆదివారం వచ్చిందంటే చాలు ముక్క లేనిదే ముక్క దిగదు కొందరికి. ఇక మరికొంతమందికి ఆ రోజు ఈ రోజు అనే పట్టింపులు ఏమి ఉండవు రోజు నాన్ వెజ్ పెట్టినా తినే అంత ఇష్టం ఉంటుంది. అందులోను మటన్ , సీ ఫుడ్స్ కంటే కూడా ఎక్కువ మంది ఇష్టపడేది చికెన్. పైగా దానిని 100 రకాల పైగా వండే ఛాన్స్ ఉండడంతో.. ఇంకాస్త కొత్త రుచులను ఆస్వాదిస్తూ ఉంటారు నాన్ వెజ్ ప్రియులు. చికెన్ తింటే శరీరంలో ప్రోటీన్స్ పెరుగుతాయి. దానివలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి మరింత బలపడుతుంది. అందుకే రకరకాల వైరస్ లను ఎదుర్కునే శక్తి మన శరీరానికి ఉంటుంది. ఇదంతా నిజమే.. కానీ ఇప్పుడు అదే చికెన్ మనలో ఉండే శక్తిని నశింపజేసేలా చేస్తుంది. చికెన్ తింటే మొదటికే మోసం వచ్చేలా ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. చికెన్ ప్రియులకు ఇది నిజం బ్యాడ్ న్యూస్ అని చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే బాయిలర్ కోళ్లలో ఉండే ఓ భయంకరమైన బ్యాక్టీరియా మనిషి ప్రాణానికే ప్రమాదంగా మారుతుందట.
ఇప్పుడు బయట నాటుకోళ్ల కంటే కూడా ఫారం కోళ్లు ఎక్కువగా పెరిగిపోయాయి. ఆ కోళ్లను పెంచే విధానం అంతా మారిపోయింది. కోళ్లు పెద్దగా… త్వరగా పెరగడానికి వాటికి రకరకాల ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. దాని వలన వాటిని తినే వారికి అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే బాయిలర్ చికెన్ తినడం అంటే సిగరెట్ త్రాగడంకంటే కూడా అత్యంత ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ తో పాటు కేరళలో అమ్ముతున్న బాయిలర్ కోళ్లలో.. యాంటీ బయోటిక్స్ ను తట్టుకునే ప్రమాదకరమైన బాక్టీరియా వృద్ధిచెందుతున్నట్లు.. నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ న్యూట్రిషన్ పరిశోధకులు గుర్తించారు. అక్కడ కోళ్లకు అవసరం ఉన్నా లేకున్నా యాంటీ బయోటిక్స్ ఇవ్వడంతో.. వాటిలో యాంటీ మైక్రోబిల్ రెసిస్టెంట్ వృద్ధిచెందుతున్నట్లు గుర్తించారు. దీనితో వీటిని సరిగా వండుకోకుండా తింటే.. అదే జీన్స్ మనుషుల్లో కూడా వృద్ధి చెందే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలిపారు.
దీని వలన అనేక ప్రాణాంతక సమస్యలు తలెత్తుతాయట. బాయిలర్ కోళ్లలో ఉండే బాక్టీరియా వలన మనుషుల్లో నిమోనియా, కలరా, ఫుడ్ పాయిజనింగ్ లాంటి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగడానికి ఈ బాయిలర్ కోళ్లు కూడా ఓ కారణం. చికెన్ అధికంగా తినడం వలన పురుషులలో ఇంఫెర్టిలిటి పెరిగిపోతుంది. రెగ్యులర్ గా చికెన్ తినే పురుషులు సాధారణ పురుషుల కంటే కూడా.. తక్కువ సంతానోత్పత్తి కలిగి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా మహిళలకు కూడా ఈ బాయిలర్ చికెన్ అసలు మంచిది కాదని చెబుతున్నారు. ముఖ్యంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ , పిసిఓడి లాంటి సమస్యలతో బాధపడే మహిళలు.. బాయిలర్ చికెన్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు. కాబట్టి నాన్ వెజ్ ప్రియులు బాయిలర్ కోళ్లతో జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.