iDreamPost
android-app
ios-app

వర్షాకాలంలో అతిగా చికెన్ తింటున్నారా? మీ లైఫ్ రిస్క్ లో పెట్టుకున్నట్లే!

Alert For Chicken Lovers Who Are Taking Over In Monsoon: చికెన్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. ముక్క లేకపోతే ముద్ద దిగదు అనే బాపతి వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వారికి ఇది ఒక బిగ్ అలర్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే వర్షాకాలంలో ఎక్కువగా చికెన్ తినకపోవడమే మంచిది అంటున్నారు.

Alert For Chicken Lovers Who Are Taking Over In Monsoon: చికెన్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. ముక్క లేకపోతే ముద్ద దిగదు అనే బాపతి వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వారికి ఇది ఒక బిగ్ అలర్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే వర్షాకాలంలో ఎక్కువగా చికెన్ తినకపోవడమే మంచిది అంటున్నారు.

వర్షాకాలంలో అతిగా చికెన్ తింటున్నారా? మీ లైఫ్ రిస్క్ లో పెట్టుకున్నట్లే!

సాధారణంగా వెదర్ కాస్త చల్లగా, చిటపట చినుకులు పడుతుంటే ఎవరికైనా ఏదైనా వేడిగా తినాలి అనిపిస్తుంది. చాలామంది వేడిగా బజ్జీలో, పకోడీలో తింటారు. కానీ, కొందరు మాత్రం వేడి వేడిగా చికెన్ లాగించేస్తారు. విడి సీజన్స్ లో చికెన్ తినే దానికంటే వర్షాలకు ఇంకా ఎక్కువగా నాన్ వెజ్ తినాలి అనిపిస్తుంటుంది. అందులోనూ చాలా మంది చికెనే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. వారంలో కనీసం రెండురోజులు అయినా చికెన్ ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. కానీ, వర్షాకాలంలో చికెన్ ఎక్కువగా తినడం అంత మంచిది కాదు అంటున్నారు వైద్యులు. అంతేకాకుండా కాస్త తక్కువగా చికెన్ తినడమే ఒంటికి మంచిది అంటున్నారు. అసలు అలా ఎందుకు చెబుతున్నారో చూద్దాం.

ఇవాళ్టి రోజుల్లో అధికారులు ఎన్ని తనిఖీలు చేసినా కూడా ఎక్కడో ఒక దగ్గర కోళ్లను త్వరగా పెంచేందుకు దాణా మాత్రమే కాకుండా.. పలు రకాల యాంటీ బయోటిక్స్ కూడా ఇస్తున్నారు. అయితే అలాంటి కోళ్లు, వాటి మాంసం మనిషికి అంత మంచిది కాదు అంటున్నారు. దీనికి సంబంధించి వైద్యుడు అరిందమ్ బిస్వాస్ చెబుతున్నారు. ప్రభుత్వాలు, అధికారులు చెప్పిన మోతాదుల్లో యాంటీబయోటిక్స్ వాడుతున్నట్లయితే అలాంటి చికెన్ తినడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ, మోతాదుకు మించి యాంటీబయోటిక్స్, కోళ్లు వేగంగా పెరగడానికి ఏమైనా చట్టబద్దం కాకుండా వాడుతుంటే మాత్రం వాటి వల్ల కచ్చితంగా ఇబ్బందులు వస్తాయి అంటున్నారు. మార్కెట్లో విక్రయించే చికెన్ లో కొలిస్టిన్ మోతాదు ఎక్కువగా ఉన్నట్లు లండన్ లోని బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం తాజాగా కనుగొందంట.

ఆ విషయాన్ని కోట్ చేస్తూ వైద్యుడు అరిందమ్ బిస్వాస్ ఇండియాలో కూడా పౌల్ట్రీ ఫామ్ యజమానులు కొలిస్టిన్ వినియోగాన్ని నియంత్రణలో ఉంచాలని కోరారు. కొలిస్టిన్ అతిగా ఉన్న చికెన్ ను తింటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. వర్షాకాలం లాంటి ఈ సీజన్ లో అలాంటి చికెన్ తింటే మన శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. దాని వల్ల తర్వగా వైరల్ వ్యాధుల బారిన పేడ ప్రమాదం ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా ఇలా కంటిన్యూగా వర్షాలు పడుతూ ఉంటే కోళ్లకు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందట. కొక్కెర, న్యూమోనియా, కాక్సిడియోసిస్ వంటి వ్యాధులు వచ్చి చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే వర్షాకాలంలో చికెన్ తినడాన్ని కాస్త నియంత్రణలో ఉంచుకోవాలి అని సూచిస్తున్నారు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం ఇచ్చిన సమాచారం మాత్రమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి