శీతాకాలం ఇవి తినండి.. ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచన!

సాధారణంగా చలికాలం అనగానే త్వరగా జబ్బుల బారిన పడిపోతూ ఉంటారు. అలాంటి సమయంలో ఆరోగ్యం గురించి కాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం అవసరం. అందుకే ఆయుష్ మంత్రిత్వ శాఖ దేశ పౌరులకు కొన్ని కీలక సూచనలు చేశారు. వారు చెప్పినట్లు ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారు అంటూ సూచిస్తున్నారు.

సాధారణంగా చలికాలం అనగానే త్వరగా జబ్బుల బారిన పడిపోతూ ఉంటారు. అలాంటి సమయంలో ఆరోగ్యం గురించి కాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం అవసరం. అందుకే ఆయుష్ మంత్రిత్వ శాఖ దేశ పౌరులకు కొన్ని కీలక సూచనలు చేశారు. వారు చెప్పినట్లు ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారు అంటూ సూచిస్తున్నారు.

చలికాలంలో అందరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే శీతాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూనే.. ఆహారంపై కూడా దృష్టి సారించాల్సి ఉంటుంది. ఎందుకంటే చలికాలంలో దగ్గు, బలుబు, రొంప వంటివి చాలా తేలిగ్గా వస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉండాలి అంటే మీరు తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని వైద్యులు కూడా సూచిస్తూ ఉంటారి. ఎందుకంటే తినే ఆహారం మారితే మీలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా మీరు వేగంగా జబ్బుల బారిన పడే ఆస్కారం తక్కువగా ఉంటుంది.

చలికాలం అనగానే అందరూ కాస్త బద్దకంగా మారిపోతారు. దినచర్యలో బద్దకం చూపించినా కూడా తినే విషయంలో మాత్రం అంత బద్ధకం పనికిరాదు. మీరు వండుకునే ఆహారాన్ని ప్రత్యేకంగా వండాల్సిన అవసరం లేదు. కాస్త వేడిగా ఉన్నప్పుడే తినేయడం, ఎక్కువ చల్లగా ఉండే వాటి జోలికి పోకుండా ఉంటే మంచిది. అలాగే మీరు రోజూ వండుకునే కూరలు, వాడే కూరగాయల్లో కూడా కొద్దిగా మార్పులు చేసుకుంటే మచింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ వాళ్ల తమ సోషల్ మీడియాలో పేజీల అధికారికంగా వెల్లడించారు. అలాగే శీతాకాలంలో ఎలాంటి కూరగాయలు తినాలి అనే విషయాన్ని కూడా సూచించారు. ఇలా చేయడం వల్ల చలికాలంలో మీ ఆరోగ్యం పదిలంగా ఉంటుందని చెబుతున్నారు. మరి ఆ కూరగాయలు ఏంటో చూద్దాం.

ఆయుష్ మంత్రిత్వ శాఖ చెప్పిన ప్రకారం.. చలికాలంలో నీటిశాతం ఎక్కువగా ఉండే కూరగాయలను తినమని సూచిస్తున్నారు. తీపి, వగరు, నీటిశాతం ఎక్కువగా ఉండే.. సొరకాయ, కంద, క్యారెట్, ముల్లంగి, బీట్ రూట్, బూడిద గుమ్మడి వంటి కూరగాయలను మీ ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల చలికాలంలో ఆరోగ్యంగా ఉండచ్చని కేంద్రం చెబుతోంది. వైద్యులు కూడా శీతాకాలంలో ఇలాంటి ఆహారమే తీసుకోమని సూచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ తరహా కూరగాయాలు, దుంపల్లో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టదు. పైగా చలికాలంలో జీర్ణవ్యవస్థ కూడా కాస్త నెమ్మదిగా ఉంటుంది. మీకు వేడిని అందించేందుకు శీరరం ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ఆహారం జీర్ణమయ్యే సమయం కూడా పెరిగే ఆస్కారం ఉంది. కాబట్టి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం ఎంతైనా మంచిది. అలాగే తాగునీరు విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. నీటిని కాచి చల్లార్చి తాగితే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

Show comments