iDreamPost
iDreamPost
2022 ఓపెనింగ్ అదుర్స్. ఇండియా మొత్తాన్ని కమ్మేసిన సౌత్ సినిమా, పాన్ ఇండియన్ కింగ్ అని మరోసారి నిరూపించుకుంది. ఆర్ఆర్ఆర్ నుంచి విక్రమ్ వరకు సౌత్ సినిమాలు గ్లోబ్ మొత్తానికి వినోదాన్ని అందించాయి. ఆర్ఆర్ఆర్ థౌసండ్ వాలాలా ధనాధన్ పేలితే, పుష్ప, పాన్ ఇండియా మజా ఏంటో చూసింది. కేజీఎఫ్ 2 ఇండియా రికార్డ్స్ ను సవరించింది. నిజానికి ఇవన్నీ రీజనల్ సినిమాలే. కాని డబ్బింగ్ తో ఇతర దక్షణ భాషల్లోకి, హిందీలోకి వెళ్లాయి. హిట్ కొట్టాయి. హీరోల రెమ్యునిరేషన్ 50కోట్లను దాటేసింది. మరి హీరోయిన్ల సంగతేంటి? సౌత్ లో ఎక్కువ రెమ్యునికేషన్ తీసుకొంటున్న టాప్ 10 హీరోయిన్లు.
1.ఫిల్మ్ మేకర్ విఘ్నేష్ శివన్ పెళ్లిచేసుకొని, హెడ్ లైన్స్ లో ఉంటున్న నయన్ తార, సౌత్ ఇండియా సినిమాకు లేడీ సూపర్ స్టార్. ఆమె సినిమాకు తీసుకొంటున్న రెమ్యునిరేషన్ రూ.10కోట్లు. జయం రవి పక్కన యాక్ట్ చేయడానికి ఆమె తీసుకున్న చెక్ మొత్తం ఇది.
2. సౌత్ టాప్ హీరోయిన్లలో సెకండ్ ప్లేస్ సమంతది. ఒక్క సాంగ్ తోనే పుష్ప రేంజ్ పెంచేసిన సమంత, సినిమాలో కేరక్టర్, లెంగ్త్ ను బట్టి రూ.3-5కోట్లు వరకు తీసుకొంటున్నారు.
3. ఆ తర్వాత ప్లేస్ పూజా హెగ్డేది. ఈ స్టార్ హీరోయిన్ ఒక్కో సినిమాకు రేటు పెంచుతూనే ఉంది. పూరి సినిమాలో, విజయ్ దేవరకొండకు హీరోయిన్ గా నటించడానికి తీసుకొంటున్న మొత్తం రూ.5 కోట్లు. ఏ సినిమాకైనా 3-4కోట్లు రెమ్యునిరేషన్ తీసుకొంటున్నారు పూజా. పూరి సినిమాకు మరో కోటిని పెంచారు.
4. రీసెంట్ గా రన్ వే34 (Runway 34)లో అజయ్ దేవగణ్, మెగాస్టార్ అమితాబ్ (Ajay Devgn)( Amitabh Bachchan)తో కలసి నటించిన Rakul Preet Singh ఇప్పుడు పాన్ ఇండయా మూవీ స్టార్. ఆమె ఈ సినిమాకు తీసుకున్న రెమ్యునిరేషన్ రూ.3.5కోట్లు.
5. తమన్నా డిమాండ్ తగ్గిపోతోందని మీడియా అంటున్నా, ఆమె రెమ్యునిరేషన్ మాత్రం పెరుగుతూనే ఉంది. బహుబలి నుంచి ఆమె, ఇండియా మొత్తానికి తెలిసిన బ్యూటీ అయిపోయింది. ఊసరవెళ్లి సినిమా (Oosaravelli)కు బాగానే డిమాండ్ చేశారంట. ఇప్పుడు ప్రతి సినిమాకు ఆమె తీసుకొంటున్న మొత్తం రూ. 3 కోట్లు. కేన్స్( 75th Cannes Film Festival)లో ఆమె తన గ్లామరస్ లుక్స్ తో సెలబ్రిలనే తన వైపు తిప్పుకున్నారు.
6. రష్మిక (Rashmika Mandanna) ఇప్పుడు టాప్ స్టార్. వరసపెట్టి స్టార్స్ అందరితోనూ జోడికట్టేసింది. పుష్ప సూపర్ సక్సెస్ తో ఆమె పాన్ ఇండియా యాడ్స్ లో కనిపిస్తోంది. దేశం మొత్తానికి ఒక్క సినిమాతో తెలిసిపోయిన రష్మిక, సినిమాకు తీసుకొనే ఫీజు రూ.3కోట్లు.
7.తల్లిగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) దక్షిణాదిలో ప్రతి దర్శకుడూ కోరుకొనే హీరోయిన్. ఆమె సినిమాలో ఉంటే మినిమమ్ గ్యారెంట్ అనుకొనే స్థాయి కాజల్ ది. పెళ్లికి ముందువరకు ఆమె సినిమాకు తీసుకొనే ఫీజు రూ.3కోట్లు.
8. బాహుబలితో ఒక్కసారిగా పాన్ ఇండియన్ సూపర్ స్టార్ అయిపోయిన అనుష్క(Anushka Shetty) లేటెస్ట్ గా సినిమాకు వసూలు చేస్తున్న ఛార్జి రూ.4కోట్లు. బాహుబలికి ముందు అరుంధతి, మిర్చి సినిమాలో టాప్ స్టార్ అయిపోయారు.
9. స్టార్ హీరోయిన్ గా ఇప్పటికే 53కోట్లు సంపాదించిన శృతిహాసన్( Shruti Haasan) డిమాండ్ కాస్త తగ్గినా…రూ.2కోట్లు పే చెక్ లేనిదే, ఆమె సినిమాకు సైన్ చేయరు.
10. ఈ లిస్ట్ లో లాస్ట్ ప్లేస్ కీర్తి సురేష్( Keerthy Suresh)ది అంటే నమ్మడం కాస్త కష్టమే. కాని అటు యాక్టింగ్ ఇటు గ్లామర్ రోల్స్ ను నమ్ముకున్న కీర్తి, మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాటలో అదరగొట్టేసింది. భోలా శంకర్ తో సహా చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలున్న కీర్తి సురేష్ ఫీజు రూ.2కోట్లు.