iDreamPost
android-app
ios-app

షారుఖ్ అభిమానులకు యాక్షన్ గిఫ్ట్..

షారుఖ్ అభిమానులకు యాక్షన్ గిఫ్ట్..

బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకడైన షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) సినిమా రిలీజై మూడేళ్లు దాటేసింది. 2019 డిసెంబర్లో జీరో డిజాస్టర్ అయ్యాక మళ్ళీ  తెరమీద కనిపించలేదు. కెజిఎఫ్ లాంటి డబ్బింగ్ మూవీని తట్టుకోలేక తన చిత్రం తోకముడిచిన తీరు అభిమానులను బాగా బాధ పెట్టింది. అందుకే లేట్ ఏజ్ లో విలువైన కాలం వృధా అవుతున్నా సరే తొందరపడకుండా చాలా గ్యాప్ తీసుకున్నాడు. 1995లో సరిగ్గా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు చిరంజీవి ఏకంగా ఒక సంవత్సరం మొత్తం మేకప్ వేసుకోలేదు. తనను తాను పునఃసమీక్షించుకుని హిట్లర్ తో సూపర్ కంబ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు షారుఖ్ కూడా ఇదే సూత్రాన్ని పాటించి అసలు తానేం మిస్ అవుతున్నానో గుర్తించి పఠాన్ తో వస్తున్నాడు.

ఇవాళ తన బర్త్ డే సందర్భంగా యష్ రాజ్ ఫిలింస్ టీజర్ ని రిలీజ్ చేసింది. మొత్తం భారీ యాక్షన్ ఎపిసోడ్లు, ఛేజింగులతో కలర్ ఫుల్ గా సాగింది. దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ఇలాంటివి హ్యాండిల్ చేయడంలో సిద్ధహస్తుడు. హృతిక్ రోషన్ టైగర్ శ్రోఫ్ ల వార్ ని ఇలా తీర్చిదిద్దే బ్లాక్ బస్టర్ కొట్టాడు. అందులో మాదిరిగానే పఠాన్ లో కూడా అన్ బిలీవబుల్ స్టంట్లు చాలా ఉన్నాయి. స్టోరీ మాత్రం డిఫరెంట్ గా అనిపించలేదు. శత్రువులకు దొరికిపోయి అజ్ఞాతంలో ఉన్న పఠాన్ తిరిగి వచ్చాక ఏం చేస్తాడనే పాయింట్ మీద రాసుకున్నారు. తనను ఎదిరించే ధీటైన పాత్రలో జాన్ అబ్రహం, హీరోయిన్ గా దీపికా అగర్వాల్ తో మొత్తానికి బలమైన కంటెంట్ ఉందనే హామీ అయితే ఫ్యాన్స్ కి ఇచ్చారు.

పఠాన్ వచ్చే ఏడాది జనవరి 25 విడుదల కానుంది. ఐమ్యాక్స్ వెర్షన్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. దీని సక్సెస్ ని బట్టే తర్వాత రాబోయే జవాన్, డుంకిల బిజినెస్ ఆధారపడి ఉంటుంది. ఇంత గ్యాప్ కి న్యాయం చేకూరుస్తూ షారుఖ్ 2023లో మొత్తం మూడు సినిమాలతో అలరించబోతున్నాడు. డేట్లలో మార్పులు ఉండే అవకాశం లేదు. టీవీ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టి తొలుత హీరోయిన్లను చంపే నెగటివ్ క్యారెక్టర్లు ఎక్కువ చేసిన షారుఖ్ ఆ తర్వాత లవర్ బాయ్ గా, ఫ్యామిలీ మ్యాన్ గా, డాన్ గా, స్టూడెంట్ గా ఇలా అన్నిరకాల పాత్రలతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు. పఠాన్ తో మళ్ళీ సత్తా చాటాలని సగటు మూవీ లవర్స్ కూడా కోరుకుంటున్నారు

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetgrandpashabetmeritbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetcasinofast girişEscortes BelgiqueHoliganbetGrandpashabetJojobetCasibom GirişCasibom