రాజ్యసభ నూతన స్టాండింగ్ కమిటీల నియామకం జరిగింది. కమిటీల ఏర్పాటుపై నవంబర్ 2వ తేదీన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్ కమిటీలకు సంబంధించిన వివరాలను బులిటెన్‌లో విడుదల చేసింది. కాగా, పలు కమిటీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలకు రాజ్యసభ చైర్మన్ ధన్కర్ చోటు కల్పించారు.
ఇక, తొమ్మిది కమిటీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజ్యసభ సభ్యులకు చోటుదక్కింది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ, ఎథిక్స్ కమిటీల్లో విజయ సాయి రెడ్డి(వైఎస్సార్‌సీపీ), కే. కేశవరావు (టీఆర్ఎస్)లకు చోటు కల్పించారు. కమిటీ ఆన్ రూల్స్‌లో డాక్టర్ కె. లక్ష్మణ్(బీజేపీ), కమిటీ ఆన్ ప్రివిలైజెస్‌లో జీవీఎల్ నర్సింహారావు(బీజేపీ), కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్‌లో కేఆర్ సురేశ్ రెడ్డి (టీఆర్ఎస్)లకు అవకాశం దక్కింది. హౌజ్ కమిటీకి చైర్మన్‌గా సీఎం రమేశ్(బీజేపీ)నియామకం, సభ్యుడిగా బి. లింగయ్య టీఆర్ఎస్)లు చోటు దక్కించుకున్నారు. ఇక.. కమిటీ రూల్స్, కమిటీ ప్రివిలేజెస్, బిజినెస్ అడ్వైజరీ కమిటీలకు చైర్మన్‌గా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కొనసాగనున్నారు.