iDreamPost
android-app
ios-app

Phanumantu Controversy: కేసులో దోషిగా తేలితే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందంటే?

  • Published Jul 09, 2024 | 7:40 PM Updated Updated Jul 10, 2024 | 4:53 PM

Phanumantu Controversy: ఫనుమంతు యూట్యూబ్ ఛానల్ లో జుగుప్సాకరమైన వీడియోతో ఒక్కసారిగా అందరి ఆగ్రహానికి కారణమైన ప్రణీత్ హనుమంతు అండ్ గ్యాంగ్ మీద ఏమేమీ కేసులు పెడతారు? ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుంది? వంటి వివరాలు మీ కోసం. 

Phanumantu Controversy: ఫనుమంతు యూట్యూబ్ ఛానల్ లో జుగుప్సాకరమైన వీడియోతో ఒక్కసారిగా అందరి ఆగ్రహానికి కారణమైన ప్రణీత్ హనుమంతు అండ్ గ్యాంగ్ మీద ఏమేమీ కేసులు పెడతారు? ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుంది? వంటి వివరాలు మీ కోసం. 

Phanumantu Controversy: కేసులో దోషిగా తేలితే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందంటే?

మనిషిగా ఎవరూ చేయకూడని కామెంట్స్ చేశారు ప్రణీత్ హనుమంతు అండ్ గ్యాంగ్. పవిత్రమైన తండ్రీ, కూతుర్ల బంధాన్ని తప్పుబడుతూ నీచమైన కామెంట్స్ చేశారు. ఆ వీడియో చేసిన తర్వాత అయినా తప్పు అని అనిపించలేదు వారికి. అందుకే వాళ్ళని కర్మ వెంటాడుతుంది. వాళ్ళ మీద చైల్డ్ అబ్యూస్ కేసు పెట్టాలని.. అస్సలు వదలకూడదని.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు సైతం వెంటనే స్పందించారు. అసభ్యకర కామెంట్స్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎట్టకేలకు పోలీసులు ప్రణీత్ హనుమంతును అరెస్ట్ చేశారు. బెంగళూరులో ఉంటున్న ప్రణీత్ ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురిపై కూడా సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రణీత్ హనుమంతును బెంగళూరు కోర్టులో హాజరుపరిచిన అనంతరం ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ తీసుకురానున్నారు. మిగిలిన ముగ్గురు నిందితులను కూడా పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్న ప్రణీత్ హనుమంతు మీద గానీ.. మరో ముగ్గురు నిందితులు అరెస్ట్ అయ్యాక వారి మీద గానీ ఎలాంటి కేసులు నమోదు అవుతాయి? ఒకవేళ ఆ కేసుల్లో దోషిగా తేలితే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుంది?

సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద మొదటి కేసు: 

ఫస్ట్ యూట్యూబ్ అనే డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా అశ్లీలతతో కూడా కూడిన, అసభ్యకరమైన కామెంట్స్ తో కూడిన ఒక వీడియోను పోస్ట్ చేసినందుకు వీళ్ళ మీద సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు అవుతుంది. అశ్లీలత, అసభ్యకరమైన వీడియోని లేదా కంటెంట్ ని ఎవరైనా పబ్లిష్ చేసినా.. లేదా ప్రసారం చేసినా గానీ వారి మీద సెక్షన్ 67  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఆఫ్ 2000 కింద కేసు నమోదు చేస్తారు. ఈ కేసులో దోషిగా తేలితే కోర్టు వారికి మూడేళ్లు జైలు శిక్ష, అలానే 5 లక్షల రూపాయల వరకూ జరిమానా విదిస్తుంది. ఇది మొదటిసారి నేరారోపణలో దోషిగా తేలితే. ఒకవేళ రెండోసారి లేదా అంతకంటే ఎక్కువ సార్లు దోషిగా తేలితే కనుక ఐదేళ్లు జైలు శిక్షతో పాటు 10 లక్షల వరకూ జరిమానా విధిస్తుంది.   

పోక్సో యాక్ట్ కింద సెక్షన్ 14, సెక్షన్ 21 కేసులు:

తండ్రీ, కూతుర్ల స్వచ్ఛమైన బంధాన్ని లైంగిక సంబంధంగా చిత్రీకరిస్తూ కామెంట్స్ చేసినందుకు గాను.. ఇది చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్ కిందకు వస్తుంది. ఇలాంటి కేసులు పోక్సో యాక్ట్ కిందకు వస్తాయి. ఇందులో పలు రకాల కేసులు ఉన్నాయి. అయితే వీటిలో నిందితుల మీద పెట్టే కేసు ఏంటి అని అంటే.. పోక్సో యాక్ట్ సెక్షన్ 14, సెక్షన్ 21ల కింద కేసులు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ వీడియోలో అమ్మాయి మైనర్ కాబట్టి ఆ చిన్న పాపను తండ్రితో తప్పుడు సంబంధం ఉన్నట్టు చిత్రీకరించారు కాబట్టి ‘పో*ర్నోగ్రఫిక్ రిప్రజెంటేషన్’ కింద పోక్సో యాక్ట్ సెక్షన్ 14 కేసులో భాగంగా ఐదేళ్ల జైలు శిక్ష మరియు జరిమానా ఉంటుంది. తండ్రీ, కూతురు గురించి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు సెక్షన్ 21 కింద ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా ఉంటుంది.     

సెక్షన్ 509 ఐపీసీ కేసు:

ఒక మైనర్ బాలికను అవమానించేలా మాట్లాడినా, సంజ్ఞ చేసినా, అవమానించినా ఆ వ్యక్తికి ఏడాది వరకూ జైలు శిక్ష, జరిమానా ఉంటాయి.     

  • అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే.. ఈ శిక్షలు అనేవి కేసు తీవ్రత, కోర్టు విచక్షణ బట్టి మారతాయి.