iDreamPost
android-app
ios-app

Cartoon Network: కార్టూన్ నెట్ వర్క్ మూతపడనుందా ! అసలు విషయం ఏమై ఉంటుంది?

  • Published Jul 10, 2024 | 9:42 AM Updated Updated Jul 10, 2024 | 10:37 AM

Cartoon Network Will Close: కార్టూన్ నెట్ వర్క్ ఈ ఛానెల్ తెలియని వారు ఎవరు ఉండరు. 90'స్ కిడ్స్ కైతే ఇదొక ఎమోషన్. అయితే కొన్ని రోజులుగా కార్టూన్ ఛానెల్ మూతపడనున్నట్లు కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

Cartoon Network Will Close: కార్టూన్ నెట్ వర్క్ ఈ ఛానెల్ తెలియని వారు ఎవరు ఉండరు. 90'స్ కిడ్స్ కైతే ఇదొక ఎమోషన్. అయితే కొన్ని రోజులుగా కార్టూన్ ఛానెల్ మూతపడనున్నట్లు కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

  • Published Jul 10, 2024 | 9:42 AMUpdated Jul 10, 2024 | 10:37 AM
Cartoon Network: కార్టూన్ నెట్ వర్క్ మూతపడనుందా ! అసలు విషయం ఏమై ఉంటుంది?

ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చేశాయి.. టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. అందరి అరచేతిలో ఇంటర్నెట్ వచ్చేసింది.. సోషల్ మీడియాను విపరీతంగా వాడేస్తున్నారు. ఇవన్నీ నిత్యం చూస్తూనే ఉంటున్నాము. స్మార్ట్ ఫోన్స్ తో పాటు స్మార్ట్ టీవీ లు కూడా వచ్చేశాయి. నచ్చినప్పుడు నచ్చిన ఛానెల్ ను చూసేయొచ్చు.. గేమ్స్ ఆడుకోవచ్చు. ఇప్పుడు అసలు ఎంటర్టైన్మెంట్ కు కొదవే లేదు. ఎప్పుడు ఎలా కావాలంటే అలా ఎంటర్టైన్ అవ్వొచ్చు. కానీ ఇవన్నీ 80,90 కాలంలో మాత్రం లేవు. అప్పట్లో పిల్లలకు పెద్దలకు ఎంటర్టైన్మెంట్ అంటే సరదాగా బయట ఆదుకోవడం లేదా టీవీ లో వచ్చే ఒకే ఒక్క కార్టూన్ నెట్ వర్క్ ఛానెల్. కార్టూన్ నెట్ వర్క్ ఈ ఛానెల్ తెలియని వారు ఎవరు ఉండరు. 90’స్ కిడ్స్ కైతే ఇదొక ఎమోషన్. అయితే గత కొన్ని రోజులుగా కార్టూన్ నెట్ వర్క్ ఛానెల్ మూసివేస్తున్నట్లు కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలు చూసేద్దాం.

టామ్ అండ్ జెర్రీ, బెన్ 10 , డాగ్ ఇలా చెప్పుకుంటూ పోతే.. కార్టూన్ నెట్ వర్క్ ఛానెల్ వచ్చిన ప్రతి ప్రోగ్రాం కూడా 80,90 కాలంలో పిల్లలకు ఎప్పటికి ప్రత్యేకమే.. ఇప్పటికి కూడా యూట్యూబ్ లో అప్పటి షోస్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటారు. అయితే గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియాలో #RIPCartoonNetwork పేరుతో ఓ హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతుంది. దీనితో ఈ ఛానెల్ అభిమానులందరు కూడా బెంగపడిపోతున్నారు. అయితే నిజానికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ వార్తా అవాస్తవం. ఎందుకంటే కార్టూన్ నెట్ వర్క్ సంస్థ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. యానిమేషన్ వర్కర్స్ యునైటెడ్ అనే ఓ ఎక్స్ ఖాతా నుంచి.. “కార్టూన్ నెట్ వర్క్ తప్పనిసరిగా మూతపడిపోతుంది” అనే ఓ పోస్ట్ రావడంతో.. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజానికి యానిమేషన్ రంగంలో… ఉద్యోగాల లే ఆప్స్ పై అవగాహన పెంచడం కోసం ఈ ట్రెండ్ ప్రారంభం అయింది.

కోవిడ్ తర్వాత చాలా కంపెనీలు లే ఆప్స్ ప్రకటించిన సంగతి తెలియనిది కాదు. చిన్న సంస్థలు , పెద్ద సంస్థలు అని తేడా లేకుండా ఉద్యోగులను తొలంగించేశారు. ఇక ఇప్పుడు ఇదే పరిస్థితి యానిమేషన్ సంస్థలలో కూడా కొనసాగితే… యానిమేషన్ ఉద్యోగుల పరిస్థితి కూడా ప్రశ్నర్ధకంగా మారుతుందని.. దాని మీద అవగాహన కలిగించడం కోసం ఇలాంటి ఓ వీడియోను క్రియేట్ చేశారు. అది కాస్త సోషల్ మీడియాలో అనేక చర్చలకు దారి తీసి.. కార్టూన్ నెట్ వర్క్ ప్రియులను కాస్త బాధపెట్టింది. కాబట్టి కార్టూన్ నెట్ వర్క్ మూతపడుతుందని.. ఆ సంస్థ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.