అబ్బురపరిచే విజువల్స్.. అవతార్ కొత్త ప్రపంచం..

  • Updated - 12:47 PM, Thu - 3 November 22
అబ్బురపరిచే విజువల్స్.. అవతార్ కొత్త ప్రపంచం..

2009లో వచ్చిన ఈ గొప్ప విజువల్​ వండర్​ ‘అవతార్’‌కు సీక్వెల్​గా వస్తున్న మూవీకి ‘అవతార్​: ది వే ఆఫ్​ వాటర్’ (Avatar: The Way of Water ).​ ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో ప్రచారంలో భాగంగా టీమ్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది.

ఊహించటానికి వీల్లేని విజువలైజేషన్ తో, అద్భుతమైన గ్రాఫిక్స్‌తో చిన్న,పెద్దా తేడా లేకుండా అందిరనీ ఆకట్టుకున్న చిత్రం ‘అవతార్’. ఇప్పుడీ మూవీ సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏకంగా 160 భాషల్లో రిలీజ్ అవుతోంది. అందులో మన తెలుగు కూడా ఉంది. ఈ సినిమాను 16 డిసెంబర్ 2022న ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు . ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో రీజనల్ లాంగ్వేజ్ లలోనూ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ కోసం ఉదయం నుంచి అభిమానులు సోషల్ మీడియాలో ఎదురుచూస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఆ ట్రైలర్ విజువల్ గా వండర్ గా ఉంది. మీరూ ఓ లుక్కేయండి.

ఎపిక్‌ సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌ లో వస్తున్న ఈ చిత్రంలో కేట్‌ విన్స్‌లెట్‌ కూడా భాగం అవుతుండటం విశేషం. లైట్ స్ట్రామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌-టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్ పై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రధాన భారతీయ భాషలన్నింటిలో విడుదల చేస్తున్నారు. తెలుగు రైట్స్ కోసం స్టార్ డిస్ట్రిబ్యూటర్స్ పోటీ పడుతున్నట్లు ట్రేడ్ టాక్. రేటు విషయానికి వస్తే..తెలుగు రెండు రాష్ట్రాల్లో థియేటర్ రిలీజ్ కు 120 కోట్లు దాకా రేటు పలుకుతున్నట్లు వినికిడి. దాంతో ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకుందామనే నిర్ణయానికి వచ్చారట. అయితే ఈ సినిమా తొలి రోజే భారీ ఓపినింగ్స్ ఉంటాయని, ముప్పై నుంచి నలభై కోట్ల దాకా రికవరీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. సూపర్ హిట్ టాక్ వస్తే వీకెండ్ లో వంద కోట్లుకు వెళ్లినా ఆశ్చర్యం లేదంటున్నారు.

ఈ చిత్రానికి ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వం వహించారు. సామ్‌ వర్తింగ్టన్‌, జో సాల్డనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరిద్దరూ పండోరాలో నివాసం ఏర్పరచుకున్నాకా మానవజాతితో ఎలా పోరాడారు? పండోరా జాతిని ఎలా రక్షించారు అన్నది ఈ సీక్వెల్‌లో చూపించనున్నారు. క్రిస్‌మస్‌ కానుకగా భారత్​లో ఈ ఏడాది డిసెంబరు 16న విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. మిగతా దేశాల్లో డిసెంబరు 14న రిలీజ్​ కానున్నట్లు తెలిపింది. అలాగే ఈ చిత్రానికి టైటిల్​ కూడా ‘అవతార్​: ది వే ఆఫ్​ వాటర్’​ అని పేరు పెట్టింది.

సరికొత్త టెక్నాలిజీతో.. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సుమారు 160 భాషల్లో విడుదల చేయనున్నారు. త్రీడీలోనే కాకుండా 4కె, లైవ్‌ థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ వంటి మరింత అత్యాధునిక సాంకేతికత అంశాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి జేమ్స్‌ కామెరూన్‌ ప్రయత్నిస్తున్నారు. టెక్నాలజీ పరంగానే ఈ సినిమాకు పలు వెర్షన్‌లు ఉన్నాయని తెలుస్తోంది. కాగా, అత్యాధునిక సాంకేతికతో వస్తున్న ‘అవతార్‌ 2’ను ప్రదర్శించేలా తమ థియేటర్లను ఆధునికీకరిస్తామని సినిమాకాన్‌ కార్యక్రమంలో పాల్గొన్న థియేటర్ల యాజమానులు వెల్లడించారు.

Show comments