iDreamPost
android-app
ios-app

వీడియో: iDream వల్ల చాలా మంది పిల్లలకి మంచి జరిగింది: మంచు లక్ష్మి

  • Published Jul 09, 2024 | 1:36 PM Updated Updated Jul 09, 2024 | 1:36 PM

Manchu Lakshmi Praised idream Media For Their Work: మంచు లక్ష్మి ఆదిపర్వం అనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యారు. ఆ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో ఐడ్రీమ్ మీడియా వర్క్ వల్ల ఎంతో మంది పిల్లలకు మంచి జరిగిన విషయాన్ని వెల్లడించారు.

Manchu Lakshmi Praised idream Media For Their Work: మంచు లక్ష్మి ఆదిపర్వం అనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యారు. ఆ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో ఐడ్రీమ్ మీడియా వర్క్ వల్ల ఎంతో మంది పిల్లలకు మంచి జరిగిన విషయాన్ని వెల్లడించారు.

  • Published Jul 09, 2024 | 1:36 PMUpdated Jul 09, 2024 | 1:36 PM
వీడియో: iDream వల్ల చాలా మంది పిల్లలకి మంచి జరిగింది: మంచు లక్ష్మి

మంచు లక్ష్మి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె వైవిధ్యమైన సినిమాలు, విభిన్నమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఇటీవల యక్షిణి అనే సిరీస్ లో మంచి పాత్రతో మెప్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయారు. ఇప్పటికే ఆదిపర్వం మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో మంచు లక్ష్మి వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినీమా రిలీజ్ కు రెడీ అయిన సందర్భంగా మూవీ టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సినిమా గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో ఐడ్రీమ్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ.. మంచు లక్ష్మి ఐడ్రీమ్ మీడియా ధృక్పథాన్ని కొనియాడారు.

ఐడ్రీమ్ ప్రతినిధి ప్రశ్న అడిగేందుకు పరిచయం చేసుకోగా.. మంచు లక్ష్మి మొదట ఐడ్రీమ్ మీడియా హౌస్ ని ప్రశంసించారు. మంచిని ప్రజల్లోకి చాలా పాజిటివ్ వేలో ఐడ్రీమ్ మీడియా తీసుకెళ్తుందని వ్యాఖ్యానించారు. చాలా సందర్భాల్లో తనకు సంబంధించి కూడా చాలా మంచి పాజిటివ్ ఆర్టికల్స్ రాసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే ఐడ్రీమ్ మీడియా రాసిన మంచి ఆర్టికల్స్ వల్ల చాలా మంది పిల్లలకు మంచి జరిగిందని తెలిపారు. తాను స్కూల్స్ ని సందర్శించడం, దత్తత తీసుకున్న అంశాలను ఐడ్రీమ్ మీడియా కవర్ చేసింది. ఆ ఆర్టికల్స్ వల్ల ఎన్నో డొనేషన్స్ వచ్చాయని.. వాటి వల్ల ఎంతో మంది పిల్లలకు మంచి జరిగిందనే విషయాన్ని వెల్లడించారు.

” ఐడ్రీమ్ మీరు నా గురించి చాలా మంచిగా రాస్తారు. కేవలం నా సినిమా పరంగానే కాకుండా.. నా టీచ్ ఫర్ ఛేంజ్ వర్క్ ని కూడా ఫాలో అవుతూ మీరు నా గురించి మంచిగా రాస్తారు. థ్యాంక్యూ సో మచ్ ఐడ్రీమ్ మీ వర్క్ వల్ల మా టీమ్ ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు రాసినందు వల్ల చాలా మంది చదివి.. ఆ స్కూల్స్ కి డొనేట్ చేస్తున్నారు. మా ఉద్దేశం కూడా అదే.. నేను వెళ్లాను కాబట్టి మీరు వెళ్లాలి అని కాదు. అందరి వల్ల వారికి మంచి జరగాలి అనేది మా ఉద్దేశం” అంటూ మంచు లక్ష్మి వ్యాఖ్యానించారు. అలాగే తాను ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగడానికి కారణం తన తండ్రి నేర్పిన పాఠాలనే చెప్పారు.

సక్సెస్ గురించి మాత్రమే కాదు.. వెయిల్యూర్స్ ని ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పారని చెప్పారు. అలాగే నటులకు ఎక్స్ పైరీ డేట్ అనేది ఉండదన్నారు. ఎంతోమంది ఒక ఆర్టిస్టుగానే కాకుండా.. వారి జీవితంలో ఏదో ఒకటి చేసిన తర్వాత మళ్లీ సినిమాలోకి వస్తారు అని చెప్పారు. ఏదో విధంగా అందరికీ సినిమాలో చేయాలి అని అనుకుంటారు. కానీ, అది అందరికీ సాధ్యం కాదు అని చెప్పారు. ఎందుకంటే అందరూ ఫెయిల్యూర్స్ ని అంత సమర్థంగా తీసుకోలేరు అంటూ వ్యాఖ్యానించారు. తాను ఇప్పటికీ ఇంత యాక్టివ్ గా ఉండటానికి కారణం తన తండ్రి మంచు మోహన్ బాబు అనే విషయాన్ని మంచు లక్ష్మి స్పష్టం చేశారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş