బాలీవుడ్ క్యూట్ కపుల్ ఆలియాభట్-రణ్‌బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన విజువల్ వండర్ ‘బ్రహ్మస్త్ర’. ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ మొత్తంలో వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు రాజమౌళి తెలుగులో సమర్పించాడు. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున, మౌనీ రాయ్‌లు కీలకలు పాత్రలు పోషించిన బ్రహ్మస్త్ర ఇప్పుడు ఓటీటీకి వచ్చేసింది.
ఇప్పటికే ఈమూవీ ఓటీటీ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భారీ ఢీల్‌కు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ‘జాతిరత్నాలు’ డైరెక్టర్‌కు అరుదైన వ్యాధి, అప్పుడు మెదడు పని చేయదట! నవంబర్ 4న ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకువస్తున్నట్లు హాట్‌స్టార్ ఇటీవల అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి నుంచి ఈ మూవీని అందుబాటులోకి తీసుకువచ్చింది.
కేవలం హిందీలోనే కాదు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ ప్రస్తుతం డిస్నీ ప్లజ్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సెప్టెంబర్ 9న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ మూవీ దేశవ్యాప్తంగా రూ. 270 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రాన్ని పూర్తిగా 5 భాగాలుగా రూపొందించనున్నట్లు గతంలో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెలిపాడు. ఇందులో మొదటి పార్ట్ శివ పేరుతో రిలీజ్ అయి సూపర్ హిట్‌గా నిలిచింది. త్వరలోనే ఈ మూవీ సెకండ్ పార్ట్ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుందట.