iDreamPost
android-app
ios-app

OTTలోకి వచ్చేస్తున్న క్రైమ్ థ్రిల్లర్.. ఎప్పుడు? ఎక్కడంటే?

  • Published Aug 12, 2024 | 3:01 AM Updated Updated Aug 12, 2024 | 7:39 AM

Thalavan Movie OTT Streaming Details: ఓటీటీలో ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ సందడి చేస్తున్నాయి. చాలా వరకు హర్రర్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఆడియన్స్. అలాంటి క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘తలవన్’ కి సంబంధించి ఓటీటీ కీలక అప్డేట్ వచ్చింది.

Thalavan Movie OTT Streaming Details: ఓటీటీలో ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ సందడి చేస్తున్నాయి. చాలా వరకు హర్రర్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఆడియన్స్. అలాంటి క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘తలవన్’ కి సంబంధించి ఓటీటీ కీలక అప్డేట్ వచ్చింది.

  • Published Aug 12, 2024 | 3:01 AMUpdated Aug 12, 2024 | 7:39 AM
OTTలోకి వచ్చేస్తున్న క్రైమ్ థ్రిల్లర్.. ఎప్పుడు? ఎక్కడంటే?

ఒకప్పుడు సినిమా థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు ఎప్పటికో కానీ టీవీల్లో ప్రత్యక్షం అయ్యేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. ఓటీటీ వచ్చిన తర్వాత కొత్త సినిమాలు నెలలోపు చూసే అవకాశం లభిస్తుంది. ఓటీటీలో ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ తో సందడి చేస్తున్నాయి. ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లో రిలీజ్ అయిన చాలా సమయం తర్వాత ఓటీటీలోకి వస్తున్నాయి. ఆ లీస్ట్ లో బిజుమీనన్, ఆసిఫ్ అలీ నటించిన ‘తలవన్’ మూవీ. మాలీవుడ్ లో మంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ రిలీజ్ అయి నెల రోజులు దాటినా ఓటీటీలో మాత్రం డిస్కషన్ రాలేదు.పోలీస్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ లోకి ఎప్పుడు వస్తుందా అన్ని ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి గుడ్ న్యూస్. ‘తలవన్’ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది..ఎక్కడ? ఎప్పుడు? అన్న విషయం తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

మలయాళ స్టార్ నటుడు బిజు మీనన్, ఆసీఫ్ అలీ నటించిన మాలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘తలవన్’. ఈ మూవీ జిస్ జాయ్ దర్శకత్వం వహించారు. మాలీవుడ్ లో మే నెలలో రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పోలీస్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమైనంది. ఈ మూవీ సెప్టెంబర్ 12 నుంచి సోనీలీవ్‌లో స్ట్రిమింగ్ కానుంది. ఈ మూవీ మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, మరాఠి, బెంగాలీ, కన్నడ సహా ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్ తెలిపారు. దీనికి సంబంధించి ఓ పోస్టర్  ట్విట్టర్ (ఎక్స్) లో రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.  ఈ మూవీ 10 కోట్లతో నిర్మించగా.. ఊహించని 25 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

ఇక ‘తలవన్’ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. ఆసిఫ్ అలీ.. బదిలీపై బిజు మీనన్ పని చేస్తున్న పోలీస్ స్టేషన్ కి వస్తాడు. అతని దూకుడు, టెంపరి తనం బిజు మీనన్ కి నచ్చదు. ఓ కేసులో అరెస్ట్ అయిన మనుదాస్ అనే అతన్ని.. బిజు మీనన్ అనుమతి లేకుండా ఆసీఫ్ రిలీజ్ చేస్తాడు. అప్పటి నుంచి వాళ్లిద్దరి మధ్య గొడవ చిలికి చిలికి గాలివానగా మారుతుంది. దీంతో ఒకరిపై ఒకరు ప్రతీకారం తీర్చుకునేందుక సమయం కోసం ఎదురు చూస్తంటారు. కొంత కాలం తర్వాత బ్రిజు మీనన్ ఇంటిపై అనుమానాస్పద రీతిలో రమ్య అనే యువతి డెడ్ బాడీ లభిస్తుంది. ఈ కేసులో బ్రిజు మీనన్ హంతకుడిగా అనుమానించి అతన్ని అరెస్ట్ చేస్తారు. ఇంటకీ రమ్య ఎవరు? ఎలా చనిపోయింది? బ్రిజు మీనన్ కి రమ్యకు ఏదైనా సంబంధం ఉందా? ఈ కేసు నుంచి బిజూ మీనన్ ఎలా బయటపడతాడు? ఈ కేసులో ఆసీఫ్ ఎలా సాల్వ్ చేస్తాడు? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio