విద్యార్థులకు ఈ యూనివర్సిటీ వరం.. స్కాలర్ షిప్ ఇచ్చి వరల్డ్ క్లాస్ విద్య!

Sandip University From Nashik: విద్యార్థులకు వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ని అతి తక్కువ ధరలో అందించడమే కాకుండా.. ఈ యూనివర్సిటీ వాళ్లు మెరిట్ స్టూడెంట్స్ కి స్కాలర్ షిప్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు.

Sandip University From Nashik: విద్యార్థులకు వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ని అతి తక్కువ ధరలో అందించడమే కాకుండా.. ఈ యూనివర్సిటీ వాళ్లు మెరిట్ స్టూడెంట్స్ కి స్కాలర్ షిప్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు.

ఇంటర్ పూర్తయ్యాక ఏం చేయాలి? ఇంజినీరింగ్ ఎక్కడ చదవాలి? అనే డైలమా ఉంటుంది. డిగ్రీ పూర్తి చేశాక పీజీ ఎక్కడ చదవాలి? ఎలాంటి యూనివర్సిటీలో చేరాలి? అక్కడ ఎలాంటి విద్యను బోధిస్తారు? అనే ఆలోచనలు కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి వారి కోసం ఇప్పుడు ఒక వరల్డ్ క్లాస్ విద్యను బోధించే యూనివర్సిటీ ఒకటి మన ఇండియాలోనే ఉందని తెలుసా? అక్కడ క్లాసులు చెప్పే ఉపాధ్యాయుల్లో 80 శాతం మంది పీహెచ్ డీ చేసిన వాళ్లే ఉండటం విశేషం. అంతేకాకుండా మీరు మెరిట్ అయితే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీకు విద్యను అందిస్తారు. అది కూడా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో మీకు విద్యను అందిస్తారు.

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న యూనివర్సిటీ పేరు నాసిక్ లోని సందీప్ యూనివర్సిటీ. దీనిని సందీప్ ఎన్. ఝా స్థాపించారు. 2008లో కేవలం ఒకే ఒక్క ఇంజినీరింగ్ కాలేజీగా దీనిని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత సందీప్ ఛారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేశారు. అక్కడితో సందీప్ ఎన్. ఝా ఆగిపోలేదు. వరుసగా ఒక్కో కాలేజ్ ని యాడ్ చేసుకుంటూ వచ్చారు. ముందు ఇంజినీరింగ్, ఆ తర్వాత ఫార్మసీ, ఎంబీఏ, లా అంటూ 2017లో ఒక యూనివర్సిటీగా మార్చేశారు. ఇప్పుడు సందీప్ యూనివర్సిటీ ఒక సెల్ఫ్ ఫండింగ్ యూనివర్సిటీ. అంతేకాదు విద్యార్థులకు వరల్డ్ క్లాస్ విద్యను అందిస్తున్న ప్రముఖ యూనివర్సిటీ కూడా. ఇక్కడు దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా విద్యార్థులు వస్తుంటారు.

సందీప్ యూనివర్సిటీ మొత్తం 250 ఎకరాల్లో విస్తరించి ఉంది. అలాగే ఈ యూనివర్సటీలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకుంటే 20 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా ఉంది. అలాగే ఇక్కడ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. ప్రొఫెసర్స్, లెక్చరర్స్ లో 80 శాతం మంది పీహెచ్ డీ చేసినవాళ్లే కావడం విశేషం. అలాగే ల్యాబ్స్, వర్క్ షాప్స్, లైబ్రరి, సీసీటీవీ సర్వేలైన్స్, 24 గంటల సెక్యూరిటీ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అలాగే విద్యార్థుల కోసం మంచి భోజనం పెట్టేందుకు మెస్ సౌకర్యం, మంచి హాస్టల్స్ ఉన్నాయి. అంతేకాకుండా.. తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మెస్ కూడా ఉంది. వంట వాళ్లు కూడా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వాళ్లే కావడం విశేషం.

స్కాలర్ షిప్ ప్రోగ్రాం:

ఈ సందీప్ యూనివర్సిటీలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది వారి స్కాలర్ షిప్ ప్రోగ్రాం గురించి. ఎందుకంటే మెరిట్ విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా విద్యను అందిస్తారు. ముఖ్యంగా మీకు గనుక 90 శాతం కంటే ఎక్కువ మార్కులు వస్తే.. ఈ వర్సిటీలో మీకు ఎలాంటి ఫీజు ఉండదు. అలాగే మీకు గనుక 80 శాతం కంటే ఎక్కువ మార్కులు వస్తే మాత్రం మీకు ప్రత్యేకంగా స్కాలర్ షిప్ ఇస్తారు. అలాగే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా ఫీజు డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. సాధారణంగానే అన్నీ యూనివర్సిటీల కంటే ఇక్కడ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. వాటికి అదనంగా స్కాలర్ షిప్స్, ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంటారు. మీరు ఒకసారి ఈ యూనివర్సిటీని విజిట్ చేయాలి అంటే.. ఫ్రీగానే చూసి రావచ్చు. రాను, పోను దారి ఖర్చులు, భోజనం ఏర్పాట్లు కూడా వర్సిటీ వాళ్లే చూసుకుంటారు.

Show comments