ఏపీని వదలని వానలు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పూరీ సమీపంలో తీరం దాటింది. అయితే వాయుగుండం తీరం దాటిన సరే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతవరణ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా.. నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నయని బిగ్ అలర్ట్ జారీ చేసింది.

ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పూరీ సమీపంలో తీరం దాటింది. అయితే వాయుగుండం తీరం దాటిన సరే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతవరణ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా.. నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నయని బిగ్ అలర్ట్ జారీ చేసింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా గత రెండు రోజులుగా ఏపీలోని భారీ వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో ఈ భారీ వర్షాలు, బలమైన గాలులకు భారీగా చెట్లు రోడ్లపై విరిగిపడి రహదారికి అంతరాయం కలిగించాయి. దీంతో పాటు మరీ కొన్ని ప్రాంతాల్లో ఈ భారీ వర్షాలకు.. నదులు, వాగులు, చెరువుల్లో నీటి ఉద్ధృతి బాగా పెరిగిపోయి పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కల్వర్టులు కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే విశాఖ,అనకాపల్లి జిల్లాల పరిధిలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. కానీ, ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటింది. అయితే వాయుగుండం తీరం దాటిన సరే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతవరణ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా.. నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నయని బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పూరీ సమీపంలో తీరం దాటింది. అయితే ఇది వాయవ్య దిశగా ఒడిశా మీదుగా ప్రయాణిస్తూ వాయుగుండంగా బలహీనపడనుందని వాతావరణ శాఖ తెలిపింది.  కాగా, ఈ వాయుగుండం రాబోయే 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్‌ మీదుగా ప్రయాణిస్తుందని చెబుతున్నారు. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు ఉండబోతుందని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఐఎండీ అలర్ట్ చేసింది. అంతేకాకుండా.. నేడు ఉత్తర కోస్తాలోని రు.శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ వాయుగుండం ప్రభావంతో సముద్రం అలజడిగా ఉంటుదని, మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్లొద్దని వాతవరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

ఇకపోతే సోమవారం శ్రీకాకుళం జిల్లా కవిటిలో అత్యధికంగా 62.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఈ నేపథ్యంలోనే..  కళింగపట్నం, విశాఖపట్నం, భీమిలి, గంగవరం, కాకినాడ పోర్టులకు మూడో నంబరు హెచ్చరికలు కొనసాగగా, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నంబరు హెచ్చరికలు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నేడు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందంటుని వాతవరణ శాఖ తెలిపింది. మరీ, ఆంధ్రప్రదేశ్ లో ఈ జిల్లాల్లోని భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments