iDreamPost
android-app
ios-app

Ayodhya Ram Mandir: ప్రాణ ప్రతిష్టకి ముందే బాల రాముడి ఫోటో షేర్ చేస్తున్నారా? ఇది మహా పాపం అని తెలుసా?

  • Published Jan 20, 2024 | 8:03 AM Updated Updated Jan 20, 2024 | 7:27 PM

అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కంటే ముందే బాల రాముడి విగ్రహం చిత్రాలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి. ఇలా ప్రాణ ప్రతిష్ట చేయకముందే బాల రాముడి ఫొటోలు షేర్ చేయడం మహా పాపమని మీకు తెలుసా?

అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కంటే ముందే బాల రాముడి విగ్రహం చిత్రాలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి. ఇలా ప్రాణ ప్రతిష్ట చేయకముందే బాల రాముడి ఫొటోలు షేర్ చేయడం మహా పాపమని మీకు తెలుసా?

Ayodhya Ram Mandir: ప్రాణ ప్రతిష్టకి ముందే బాల రాముడి ఫోటో షేర్ చేస్తున్నారా? ఇది మహా పాపం అని తెలుసా?

అయోధ్యలో ఇప్పుడు ఎటు చూసినా ఆధ్యాత్మిక కళ ఉట్టిపడుతోంది. దానికి కారణం మనందరికి తెలియనిది కాదు. జనవరి 22న అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందుకోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లను చేస్తోంది. అయితే అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కంటే ముందే బాల రాముడి విగ్రహం చిత్రాలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి. దీంతో వేదపండితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రాణ ప్రతిష్ట కంటే ముందే విగ్రహాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం, చూడటం మహా పాపం అని వారు చెప్పుకొస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

అంగరంగ వైభవంగా జనవరి 22న అయోధ్యలోని రామ మందిరంలో బాల రామయ్య కొలువుదీరనున్నాడు. దీంతో దేశం మెుత్తం సంబరాలు జరుపుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సూచించారు. ఇదిలా ఉండగా.. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కంటే ముందుగానే రాముడి విగ్రహం చిత్రాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. కొన్ని రోజుల ముందు కళ్లకు గంతలు కట్టి ఉన్న బాల రాముడి విగ్రం ఫొటోలు బయటకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ప్రాణ ప్రతిష్ట చేయకముందే కళ్లకు గంతలు లేకుండా ఉన్న రాముడి విగ్రహం ఫొటోలు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. దీంతో ఆ ఫొటోలు వైరల్ గా మారాయి. బంగారు విల్లు, బాణంతో ఉన్న బాల రాముడు విగ్రహం చూపుతిప్పుకోనివ్వడం లేదు.

 

ఇదిలా ఉండగా.. ప్రాణ ప్రతిష్ట చేయకముందే మీరు కూడా బాల రాముడి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా? అయితే ఇది మహా పాపం అని మీకు తెలుసా? పురాణాలు, శాస్త్రాల ప్రకారం ఏ దేవుని విగ్రహాన్నైనా ప్రాణ ప్రతిష్ట చేయకముందే చూడరాదు. ఇలా చేయడం మహా పాపం. అందుకే గుడిలో ప్రతిష్టించే దేవుని విగ్రహాలను ప్రాణ ప్రతిష్ట చేసే క్రమంలో, గుడి తరలించేటప్పుడు ఆ విగ్రహం కనిపించకుండా వస్త్రంతో కప్పి ఉంచడం మనందరికి తెలిసిందే. ఉదాహరణకు మన ఊరిలో ప్రతి సంవత్సంర నిర్వహించే వినయక చవితి పండుగనే తీసుకోండి.. వినాయకుని విగ్రహాన్ని తెచ్చేటప్పుడు మెుఖం కనిపించకుండా పేపర్ చుట్టి తీసుకొస్తాం. పూజా కార్యక్రమాలు, ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాతే మెుఖానికి కట్టిన వస్త్రాన్ని లేదా పేపర్ ను తీస్తాం.

ఈ క్రమంలోనే వేద మంత్రాలతో పూజలు నిర్వహించి, ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాత విగ్రహం శక్తులను సమకూర్చుకుంటుంది అన్నది పురాణాల్లో, శాస్త్రాల్లో వివరించి ఉంది. దీంతో ప్రాణ ప్రతిష్ట చేయకముందే ఇలా బాల రాముడి విగ్రహాన్ని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు షేర్ చేస్తే.. మహా పాపం తగులుతుందని వేద పండితులు తెలుపుతున్నారు. బాల రాముడి విగ్రహాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన కొందరు తాము ఏదో సాధించామని అనుకుంటున్నారు. కానీ అది ఎంత పెద్ద మహా పాపమో వారికి తెలియడం లేదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు తెలిసో, తెలియకో వాటిని షేర్ చేస్తూ.. అదే దైవ భక్తి అని అనుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రాణ ప్రతిష్ట చేయకముందే బాల రాముడి ఫొటో షేర్ చేయడం ఆపండి అంటూ అయోధ్య ట్రస్ట్ పెద్దలు, వేద పండితులు సూచిస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.