P Venkatesh
జీవితం అన్నాక కష్ట సుఖాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సమస్యలకు తలవంచితే సక్సెస్ ఎప్పటికీ రాదు. ఇదే విధంగా ఓ యువతి జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఆ ఒక్క కారణంతో షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
జీవితం అన్నాక కష్ట సుఖాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సమస్యలకు తలవంచితే సక్సెస్ ఎప్పటికీ రాదు. ఇదే విధంగా ఓ యువతి జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఆ ఒక్క కారణంతో షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
P Venkatesh
పరిష్కారం లేని సమస్యే ఉండదు. అలాంటిది చిన్న చిన్న విషయాలకే కుంగిపోతున్నారు. జీవితంపై ఆశలు వదిలేసుకుంటున్నారు. ఇక మా పని అయిపోయిందంటూ షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. సమస్యలను ఎదుర్కోని నిలబడి పోరాడితే జీవితం అద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోతున్నారు. క్షణికావేశంతో బంగారం లాంటి భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. ఒక్క క్షణం ఆలోచించి ప్రయత్నిస్తే అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు అని తెలుసుకోలేకపోతున్నారు. చదువుల్లో రాణించలేకపోతున్నానని, కుటుంబ సమస్యలు, ఆరోగ్యం బాలేదని, ఉద్యోగం దొరకడం లేదని ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇదే విధంగా ఓ యువతి జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ.. ఉద్యోగాన్వేషణలో విసిగిపోయి ఆత్మహత్యకు పాల్పడింది. ఎంత ప్రయత్నించిన జాబ్ దొరక్కపోయేసరికి విరక్తి చెంది తనువు చాలించింది. ఈ విషాద ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం సిద్ధరాంపురం గ్రామానికి చెందిన జి.లాలూసాహెబ్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కూతుర్లని బాగా చదివించి ప్రయోజకులను చేయాలని భావించాడు. వారి చదువుల కోసమని రెండేళ్ల క్రితం అనంతపురానికి వలస వచ్చారు. అక్కడే ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. కాగా పెద్ద కుమార్తె రుక్సానా (27) అనంతపురం జిల్లా కోర్టులో జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
సీనియర్ న్యాయవాది ఎల్. ప్రభాకర్‌రెడ్డి వద్ద ప్రాక్టీస్ చేస్తున్న ఆమె అనంతపురం న్యాయవాదుల బార్ అసోసియేషన్‌లో క్రియాశీల సభ్యురాలిగా ఉన్నారు. రెండో కుమార్తె ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా, మూడో కుమార్తె అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. అయితే న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న రుక్సానా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించింది. కానీ ఆమె సక్సెస్ కాలేకపోయింది. దీంతో రుక్సానా తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. ఉద్యోగం లేకపోతే లైఫ్ ఏమైపోతుందో అని ఆందోళన చెందింది.
దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ఆమె… నెల రోజులుగా తీవ్ర మానసిక వేదనతో కోర్టుకు కూడా వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటోంది. ఈ క్రమంలోనే గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కూతురు మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమకు అండగా నిలుస్తుందనుకున్న కుమార్తె తనువు చాలించడంతో గుండెలవిసేలా రోధిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనంతపురం రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఉద్యోగం లభించక పోవడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.