iDreamPost
android-app
ios-app

APలో 4 కంటైనర్లలో 2,000 కోట్లు గుర్తింపు! ఇంత డబ్బు ఎవరిదంటే?

  • Published May 02, 2024 | 7:23 PM Updated Updated May 02, 2024 | 7:23 PM

ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అక్రమ మద్యం, అక్రమ నగదు రవాణాపై నిఘా పెట్టింది. పోలీసులు దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో 4 కంటైనర్లలో ఏకంగా 2 వేల కోట్ల రూపాయలు తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. ఇంత డబ్బు ఎవరిదంటే?

ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అక్రమ మద్యం, అక్రమ నగదు రవాణాపై నిఘా పెట్టింది. పోలీసులు దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో 4 కంటైనర్లలో ఏకంగా 2 వేల కోట్ల రూపాయలు తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. ఇంత డబ్బు ఎవరిదంటే?

APలో 4 కంటైనర్లలో 2,000 కోట్లు గుర్తింపు! ఇంత డబ్బు ఎవరిదంటే?

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలైపోయింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు, ప్రతివ్యూహాల్లో భాగంగా బిజీగా ఉన్నాయి. మరోవైపు ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో.. కేంద్ర ఎన్నికల సంఘం అలర్ట్ అయ్యింది. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా అవినీతి సొమ్ము, అక్రమ మద్యం రవాణాపై నిఘా పెట్టింది. దేశవ్యాప్తంగా అనేక చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో భారీగా కరెన్సీ కట్టలు బయటపడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్సులో భారీగా నగదు పట్టుబడింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 2 కోట్లకు పైగా అవినీతి సొమ్ము పోలీసుల కంట పడింది. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు ఆ డబ్బుని సీజ్ చేశారు.

తాజాగా 4 కంటైనర్లలో 2 వేల కోట్ల రూపాయల డబ్బుని తరలించడాన్ని పోలీసులు గుర్తించారు. జులాయి సినిమాలో ఒక కంటైనర్ లో 1500 కోట్ల రూపాయలను తరలిస్తుంటే.. ఆ సీన్ లో జనం చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. రియల్ లైఫ్ లో ఏకంగా నాలుగు కంటైనర్ల నిండా డబ్బు కనిపించేసరికి పోలీసులు షాక్ అయ్యారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మద్యం, నగదు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై అనంతపురం జిల్లా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పామిడి మండలం గజరాంపల్లి దగ్గర 4 కంటైనర్లలో 2 వేల కోట్ల డబ్బు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఒక్కో కంటైనర్ లో 500 కోట్ల రూపాయల చొప్పున 4 కంటైనర్లలో 2 వేల కోట్లు తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి, ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆ తర్వాత ఆ డబ్బుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద డిపాజిట్ చేసేందుకు తీసుకెళ్తున్నట్లు పోలీసు అధికారుల విచారణలో తేలింది. రెండు వేల కోట్ల రూపాయలను కేరళలోని కొచ్చి నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్లు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు పోలీసులు. ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేసేందుకు ఈ డబ్బుని తీసుకెళ్తున్నట్లు పోలీసులకు సిబ్బంది వివరించారు. ఆ తర్వాత ఆదాయపు పన్ను అధికారులు, ఎన్నికల అధికారుల ద్వారా అన్ని వివరాలు కరెక్ట్ గానే ఉన్నాయని తెలుసుకున్న పోలీసులు.. కంటైనర్లను అనుమతించారు.