Keerthi
ఈ మధ్య కొత్తగా ఏటిఎం సెంటర్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఘటనలు ఎక్కువతున్నాయి. ముఖ్యంగా ఏటీఎం సెంటర్లలో మిషన్లను బద్దలు కొట్టడం, ధ్వంసం చేయడం వంటివి చేస్తూ.. భారీ మొత్తంలో నగదును కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎం సెంటర్‌లో శుక్రవారం అర్ధరాత్రి చోరీ భారీ చోరి జరిగింది. ఇంతకి ఎక్కడంటే
ఈ మధ్య కొత్తగా ఏటిఎం సెంటర్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఘటనలు ఎక్కువతున్నాయి. ముఖ్యంగా ఏటీఎం సెంటర్లలో మిషన్లను బద్దలు కొట్టడం, ధ్వంసం చేయడం వంటివి చేస్తూ.. భారీ మొత్తంలో నగదును కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎం సెంటర్‌లో శుక్రవారం అర్ధరాత్రి చోరీ భారీ చోరి జరిగింది. ఇంతకి ఎక్కడంటే
Keerthi
ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలతో పాటు మరొపక్క దొంగతనాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా నగరంలో దొంగతనాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సినిమాలకు మించిన విధంగా బయట కేటుగాళ్లు మాస్టర్ మైండ్ తో చోరిలకు పాల్పడుతున్నార. అసలు కొన్ని సందర్భాల్లో కొంతమంది చోరిలకు పాల్పడే విధానం చూస్తే పక్కా ప్రొఫెషనల్ దొంగాల్లా అనిపిస్తుంటారు. అయితే ఇప్పుడు దొంగలు కాస్త ట్రెండ్ ను మార్చారు. మొన్నటి వరకు ర్సులు కాజేయడం, ఇంట్లోని డబ్బులు దొంగతనం చేయడం రొటీన్ అయిపోయిందో ఏమో తెలియదు కానీ, ఇప్పుడు దొంగలు కొంచెం అప్ డేట్ అయ్యారు. ఎందుకంటే.. ఇప్పుడు ఏకంగా ఏటీఎంలోనే దొంగతనం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందుకోసం ఏటీఎం మిషన్ బద్దలు కొట్టడం, ధ్వంసం చేయకుండా బ్యాంకు సిబ్బందికి కూడా అనుమానం రాకుండా చోరీకి పాల్పడటం వంటివి చేస్తున్నారు.ప్రస్తుతం ఈ కొత్త తరహా దొంగతనాన్ని ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా ఎస్ బీఐ ఏటీఎం సెంటర్లో చోరీకి పాల్పడుతూ భారీ మొత్తంలో నగదును కొల్లగొట్టారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
నగరంలో ఈ మధ్య కొత్తగా ఏటిఎం సెంటర్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఘటనలు ఎక్కువతున్నాయి. ముఖ్యంగా ఏటీఎం సెంటర్లలో మిషన్లను బద్దలు కొట్టడం, ధ్వంసం చేయడం వంటివి చేస్తూ.. భారీ మొత్తంలో నగదును కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎం సెంటర్‌లో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. కాగా, ఈ ఘటన అనంతపురం జిల్లా, కూడేరు మండలంలో చోటు చేసుకుంది. ఇక ఆ ప్రాంతంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎంను పగులగొట్టి అందులోని రూ. 18,41,300 నగదును ఎత్తుకెళ్లారు.అయితే ఈ చోరికి సంబంధించి పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. కూడేరులో దళితవాడకు ఎదురుగా అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారి పక్కన అనంతపురం సాయినగర్‌లోని స్టేట్ బ్యాంకు ప్రధాన శాఖ ఏటీఎం సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఇక ఆ ఏటీఎంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కట్టర్ తో ఏటీఎంను కట్ చేశారు. అనంతరం మిషన్ లో ఉంచిన నగదును చోరి చేశారు.
కాగా, అదే సమయంలో.. మిషన్‌లో షార్ట్ సర్క్యూట్ సంభవించి పై భాగం మొత్తం కాలిపోయింది. అలాగే పెద్ద శబ్దం కూడా రావడంతో స్థానికులు ఒకరు బయటకు వచ్చి చూడగా.. ఏటీఎం సెంటర్ నుంచి కొందరు కార్లో వెళ్లిపోవడం, సెంటర్‌లో నుంచి పొగ రావడం గమనించాడు. ఇక కొంత సమయం తర్వాత ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ శివరాముడు ఏటీఎం సెంటరును పరిశీలించారు. అలాగే చోరి జరిగిందని నిర్ధారించుకుని సమాచారాన్ని బ్యాంకు అధికారులకు అందించారు. దీంతో పాటు సంబంధిత అధికారులు వచ్చి పరిశీలించారు.అంతేకాకుండా.. నగదు నిల్వ, విత్ డ్రాలకు సంబంధించి ప్రధాన కార్యాలయం నుంచి డేటా తీసుకున్నారు. ఈ క్రమంలోనే మొత్తం రూ.18,41,300 చోరీకి గురైనట్టు పోలీసులకు తెలిపారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరి, కొత్తగా ఏటీఎం సెంటర్ లో చోరికు పాల్పడుతూ భారీ మొత్తంలో నగదు కొల్లగొట్టిని ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.