iDreamPost
android-app
ios-app

తెల్లవారితే కొత్త ఇంట్లో గృహ ప్రవేశం.. అంతలోనే దారుణం..

  • Published Jul 15, 2024 | 9:56 AM Updated Updated Jul 15, 2024 | 9:56 AM

Anantapur Crime News: సమాజంలో ప్రతి ఒక్కరూ తమకంటూ సొంత ఇళ్లు ఉండాలని కోరికతో ఉంటారు. ఇందుకోసం ఎన్నో కష్టాలు పడి పైసా పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకొని తమ కల సాకారం చేసుకుంటారు.

Anantapur Crime News: సమాజంలో ప్రతి ఒక్కరూ తమకంటూ సొంత ఇళ్లు ఉండాలని కోరికతో ఉంటారు. ఇందుకోసం ఎన్నో కష్టాలు పడి పైసా పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకొని తమ కల సాకారం చేసుకుంటారు.

తెల్లవారితే కొత్త ఇంట్లో గృహ ప్రవేశం.. అంతలోనే దారుణం..

సొంత ఇల్లు కట్టుకోవాలి.. అందులో పిల్లలతో సంతోషంగా ఉండాలని ఆ దంపతులు ఎప్పటి నుంచో కోరికతో ఉండేవారు. అందుకోసం సంవత్సరాలుగా కష్టపడ్డారు. పైసా పైసా కూడబెట్టి కొంత డబ్బుతో స్థలం కొన్నారు. అలా తమ సొంత స్థలంలో ఇల్లు కట్టుకున్నారు. ఇన్నాళ్లు తాము పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందని ఆ దంపతులు ఎంతో సంతోషంలో ఉన్నారు. గృహ ప్రవేశానికి బంధు మిత్రులకు ఆహ్వానం పంపారు. కొత్త ఇంట్లో సందడి మొదలైంది.. అందరూ చుట్టాలు వస్తున్నారు. చిన్న చిన్న పనులు పూర్తి చేసి తెల్లారిరితే గృహ ప్రవేశం చేసేందుకు సిద్దమయ్యారు. అంతలోనే భారీ వర్షం కురిసి దారుణం జరిగిపోయింది. వివరాల్లోకి వెళితే..

అనంతపురం జిల్లా హవలిగిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎన్నో సంవత్సరాలు కష్టపడి డబ్బు కూడబెట్టుకొని సొంతంగా ఇళ్లు కట్టుకొని గృహ ప్రవేశం చేయాలని చూస్తున్న సమయంలో దారుణం జరిగిపోయింది. హవలిగి గ్రామానికి చెందిన మారెప్ప, లక్ష్మీ చాల ఏళ్లుగా అద్దెకు ఉంటున్నారు. తమకంటూ ఓ ఇళ్లు ఉండాలని కష్టపడి డబ్బులు సమకూర్చుకొని కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. గృహప్రవేశానికి బంధు మిత్రులకు ఆహ్వానం పంపించి అంతా రెడీ చేసుకుంటున్నారు. తెల్లారితే గృహ ప్రవేశం.. అంతలోనే వర్షం రూపంలో దంపతులను మృత్యువ వెంటాడింది. భారీ వర్షానికి ఇంటి పై కప్పు కూలిపోయి ఇంట్లో గాఢంగా నిద్రిస్తున్న వారిపై పడింది.

ఈ ఘటనలో మారెప్ప, లక్ష్మి కన్నుమూయగా, కుమార్తె, కొడుకు గాయాలతో బయటపడ్డారు. బయట పడుకున్న మరో కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. గాయపడ్డవారు ప్రస్తుతం వారు చికిత్స తీసుకుంటున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  ఒక్కరోజు అయితే మారెప్ప, లక్ష్మి మృత్యువు నుంచి తప్పించుకునేవారు అని స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎన్నో ఎళ్లుగా సొంతంటి కల కన్న ఆ దంపతులు ఆ కల నెరవేర్చుకున్నప్పటికీ సంతోషంగా ఆ ఇంట్లో ఉండలేక పోయారే అని కంటతడిపెట్టుకున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. పాత భవనాల్లో నివసించేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిస్తున్నారు.