Keerthi
భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర‍్షలు ఎంతటి భీభత్సం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఏపీలోని ఆ జిల్లాలోని పలు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.
భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర‍్షలు ఎంతటి భీభత్సం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఏపీలోని ఆ జిల్లాలోని పలు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.
Keerthi
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర‍్షలు ఎంతటి భీభత్సం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ‍్యంగా ఈ భారీ వర్షాలు, వరదలు వలన పలు ప్రాంతాల్లో వాగులు, నదులు, చెరువులు వరదతో పోటేత్తాయి. వర్షపు నీళ్లు ప్రవాహంలా మారి రోడ్లపైకి వచ్చేశాయి. చాలా చోట్ల ఇళ్లలోకి నీళ్లు వచ్చేశాయి. వాహనాలు ముగినిపోయాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ వర్షాలు ఈ రోజు, రేపు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల‍్లోని విజయవాడ, గుంటూరు, ఎన్టీఆర్ వంటి పలు జిల్లాల్లో భారీ వర్షాలు దంచికొట్టడంతో..కొండ చరియాలు కూడా విరిగిపడి ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు కనిపించకుండానే నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలోని పలు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు అనంతపురం జిల్లాలోని ఠశాలలు, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఆ జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ప్రకటించారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
ప్రస్తుతం భారీ వర్షాలు, వరద పరిస్థితి దృష్ట్యా, జిల్లాలోని అన్ని పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలకు రేపు అనగా సెప్టెంబర్ 2వ తేదీన సోమవారం సెలవు ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి. ఐ.ఏ.ఎస్ తాజాగా ఓ ప్రకటన తెలిపారు. అంతేకాకుండా.. ఈ విషయాన్ని తక్షణమే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు గమనించాలని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సెలవు ప్రకటించాలని పేర్కొన్నారు. మరో వైపు తెలంగాణలో కూడా ఈ భారీ వర్షాలు కారణంగా పలు విద్యా సంస్థలకు తెలంగాణ సర్కార్ సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. మరీ, భారీ వర్షాల కారణంగా ఏపీలోని అనంతపురం జిల్లాలోని ఠశాలలు, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.