P Krishna
Anantapur District: ఇటీవల దేశంలో మద్యం సేవించేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. మద్యానికి బానిసైన వారు ఆరోగ్యం మాత్రమే కాదు.. ఆస్తులు కూడా పోగొట్టుకుంటున్నారు.
Anantapur District: ఇటీవల దేశంలో మద్యం సేవించేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. మద్యానికి బానిసైన వారు ఆరోగ్యం మాత్రమే కాదు.. ఆస్తులు కూడా పోగొట్టుకుంటున్నారు.
P Krishna
వ్యసనాల్లో అత్యంత ప్రమాదకరమైనది మద్యం అనే విషయం తెలిసిందే. మద్యం సేవించడం వల్ల ఆరోగ్యం మాత్రమే కాదు.. ఆస్తులు పోగొట్టుకున్న వారు కూడా ఎంతోమంది ఉన్నారు. మద్యం మానేందుకు రక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఒక్కసారి అలవాటైతే మానడం కష్టం అంటారు. కుటుంబ సభ్యులు మద్యం మాన్పించేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వారి ఫలితాలు తాత్కాలికంగా మాత్రమే ఫలిస్తుంటాయి. అయితే మద్యం మాన్పించే దేవుడు ఉన్నాడన్న సంగతి మీకు తెలుసా? వింటానికి ఇది కాస్త విడ్డూరంగా ఉన్నా.. ఆ గుడికి ఒక్కసారి వెళ్తే చాలు.. జీవితంలో తాగుడు జోలికి వెళ్లరు. నెలలో రెండు రోజులు ఆ గుడికి వేల సంఖ్యల్లో మందుబాబులు క్యూ కడుతుంటారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉద్యోగం వచ్చినా.. ప్రమోషన్ వచ్చినా.. ఇంట్లో ఏ శుభకార్యం అయినా.. మనసు బాగాలేకపోయినా, సంతోషంగా ఉన్నా మందు పార్టీ కామన్ అయ్యింది. ఇటీవల మద్యానికి బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. మద్యం మాన్పించేందుకు కుటుంబ సభ్యులు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే మద్యం మాన్పించే దేవుడు ఉన్న సంగతి మీకు తెలుసా? నిజమే ఆ స్వామిని దర్శించుంటే మనిషిలోని చెడు గుణాలకు స్వస్తి చెబుతారని భక్తుల నమ్మకం. మందు బాబులకు మాలధారణే విరుగుడా? అంలే అవుననే అంటున్నారు మందుబాబులు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఆ దేవాలయానికి వెళ్లి మాల వేసుకుంటే చాలు మద్యానికి దూరం కావాల్సిందే అంటున్నారు.
అనంతపురం జిల్లాలోని బొమ్మనగల్ మండలంలోని ఉంతకల్లు గ్రామంలో ఉణ్న పాండురంగ స్వామి ఆంధ్ర పుండరీపురంగా పిలవబడుతున్నాడు. ఇక్కడ దేవాలయం మహత్యం గురించి తెలియని మందు బాబులు ఉండరంటే అతిశయోక్తి లేదు. తాగుడు మాన్పించే దేవుడిగా ఉంతకల్లులో కొలువుదీరిన రుక్మినీ సమేత పాండురంగ స్వామి తాగుబోతుల నుంచి పూజలు అందుకుంటున్నారు. వినిడానికి కాస్త విడ్డూరం అనిపించినా.. నెలలో రెండు రోజులు పాండురంగ స్వామి దేవాలయం మందుబాబులతో కిటకిటలాడిపోతుంది. ఈ గుడికి రాష్ట్రం నుంచే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. భక్తి శ్రద్దలతో పాండురంగ స్వామిని కొలిచి.. మాల ధరిస్తే మద్యం ముట్టరట. మెడలో పాండురంగ స్వామి మాల ఉంటే మద్యానికి అమడ దూరం పరుగెడతారట. జన్మలో మద్యం జోలికి వెళ్లరని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
కేవలం నెలలో శుక్త ఏకాదశి, కృష్ణ ఏకాదశి రోజుల్లోనే పాండురంగ స్వామి మాల ధరించాలి. తాగుడుకు బానిసైన వారు మాత్రమే పాండురంగ స్వామి మాల ధరించడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. మందు మానేయాలనే కృత నిశ్చయంతో మాల ధారణ చేయాలనుకునే వారు తెల్లవారుజామున స్నానాధికాలు ముగించుకొని దేవాలయానికి చేరుకుంటారు. ఆలయ ప్రధాన అర్చకుడు పూజలు చేసి పాండురంగ స్వామి మాలను భక్తుల మెడలో వేస్తారు. అలా పాండురంగ స్వామి మాలధారణ చేసిన వారు మళ్లీ మద్యం ముట్టుకున్నా దాఖలాలు లేవని ప్రధాన అర్చకులు అంటున్నారు. మద్యానికి బానిసైన వాళ్లు స్వామి వారి గుడికి వచ్చి మాల ధారణ చేసుకున్న తర్వాత మద్యానికి దూరమై ప్రశాంత జీవితం గడుపుతున్నారని అంటున్నారు.