VIDEO: వామ్మో.. చీరల దొంగతనం ఇలా కూడా చేస్తారా?

కొందరు మహిళలు తాజాగా ఓ షాపింగ్ మాల్స్ లో చీరల దొంగతనం చేశారు. వీరి చోరీ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అదే వీడియో ఇప్పుడు వైరల్ గా మారతోంది.

కొందరు మహిళలు తాజాగా ఓ షాపింగ్ మాల్స్ లో చీరల దొంగతనం చేశారు. వీరి చోరీ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అదే వీడియో ఇప్పుడు వైరల్ గా మారతోంది.

ఈ రోజుల్లో చాలా మంది కష్టపడి సంపాదించకుండా ఈజీ మనీ కోసం చేయని ప్రయత్నాలు లేవు. ఒళ్లు వంచకుండా, చెమట చుక్కలు రాలకుండా డబ్బును కూడబెట్టాలని అనుకుంటుంటారు. ఇలా కొందరు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ చివరికి చేతులు కాల్చుకుంటున్నారు. అయితే, ఎవరినీ మోసం చేయకుండా డబ్బు సంపాదిస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ, మోసం చేసి ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తేనే అసలు సమస్య. కానీ, కొందరు మహిళలు ఇదే చేశారు. ఏకంగా రూ.7 లక్షల విలువైన చీరలు చోరీ చేసి అందరికీ షాకిచ్చారు. వీరి దొంగతనం దృశ్యాలన్నీ ఆ షాపులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇంతకు ఈ మహిళలు ఎవరు? ఎలా దొంగతనం చేశారంటే?

పోలీసుల కథనం ప్రకారం.. మహిళలకు బాగా ఇష్టమైన వాటిల్లో చీరలు ఒకటి. ఒకరిని మించి ఒకరు మంచి మంచి చీరలు ధరించి నలుగురిలో అందంగా కనిపించాలని తాపత్రయ పడుతుంటారు. ఇందుకోసం మహిళలు కొన్ని కొన్ని సార్లు లక్షలు విలువ చేసే చీరలను కొనుగోలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే.. ఏపీలోని విజయవాడకు చెందిన ఓ లేడీ గ్యాంగ్.. గత నెల 28న చెన్నైకు వెళ్లారు. అందరిలాగే చీరలు కొనేందుకు ఓ షాపింగ్ మాల్ లోకి వెళ్లారు. ఈ ముఠా సభ్యులు అంతా ఒకేసారి రావడంతో చీరలు కొనేందుకు వచ్చారేమోనని షాపింగ్ మాల్ సిబ్బంది అనుకున్నారు. కానీ, వాళ్లు చీరలు కొనడానికి రాలేదు, కొట్టేయడానికి వచ్చారని తెలుసు కోలేకపోయారు.

ఇక ఈ మహిళ గ్యాంగ్ పక్కా ప్లాన్ తోనే ఆ షాపింగ్ మాల్ లోకి వెళ్లి చీరలను పరిశీలిస్తున్నట్లుగా నటిస్తూ అందరినీ నమ్మించారు. అందరూ అటు ఇటు తిరుగుతూ నచ్చిన చీరలను ఒక చోట చేర్చారు. ఆ తర్వాత అస్సలు అనుమానం రాకుండా ఓ మహిళ కొన్ని చీరలను సైలెంట్ గా కొట్టేసింది. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే, కొన్ని రోజుల తర్వాత షాపింగ్ మాల్ నిర్వాహకులకు బిజినెస్ లెక్కల్లో ఎక్కడా తేడా కొట్టింది. దీంతో చీరలు ఎవరో దొంగతనం చేసి ఉండొచ్చని అనుమానించారు. దీంతో ఆ షాపింగ్ మాల్ నిర్వాహకులు వెంటనే చెన్నై పోలీసులను ఆశ్రయించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ షాపింగ్ మాల్ లో ఉన్న సీసీ కెమెరాలను పరీశీలించగా.. అందులో కొందరు మహిళలు చీరలు చోరీ చేసిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఇక అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఈ లేడీ గ్యాంగ్ విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. ఈ క్రమంలోనే పోలీసులు మా కోసం గాలిస్తున్నారని తెలుసుకున్న ఆ మహిళా ముఠా.. చోరీ చేసిన ఆ చీరలను కొట్టేసిన షాపింగ్ మాల్స్ లో తిరిగి ఇచ్చేశారు. అనంతరం ఈ ఘటనపై స్పందించిన చెన్నై పోలీసులు ఎలాగైన ఆ మహిళలను పట్టుకుంటామని, వదిలిపెట్టే సమస్య లేదని తెలిపారు. షాకింగ్ న్యూస్ ఏంటంటే? ఈ లేడీ గ్యాంగ్.. దాదాపు రూ.7 లక్షల విలువైన చీరలు చోరీ చేసినట్లుగా తేలింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Show comments