Uppula Naresh
Uppula Naresh
ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రతీ సమస్యకు చావే పరిష్కారం అనుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలించారని, ప్రేమ విఫలమైందని, వ్యాపారం దెబ్బతినిందనే సమస్యలతో చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే అచ్చం ఇలాగే భావించిన ఓ కుటుంబం.. బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇంతకు ఈ కుటుంబ సభ్యులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటంటే?
పోలీసుల కథనం ప్రకారం.. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని గొరపల్లి గ్రామం. ఇక్కడే కల్లూరు సత్తిబాబు-సూర్యకుమారి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కూతురు నీలిమా, కుమారుడు సంతోష్ సంతానం. అయితే సత్తిబాబు స్థానికంగా కిరాణ షాపును నడిపిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇక కుమారుడు ఓ బ్యాంకులో పని చేస్తుండగా కూతురు డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దే ఉండేది. ఇదిలా ఉంటే.. సత్తిబాబు గతంలో కుటుంబ అవసరాల నిమిత్తం కొంత డబ్బును అప్పుగా తీసుకున్నాడు. అలా కొన్ని రోజులు గడిచింది. తీసుకున్న అప్పు తీర్చాలని రుణదాతలు ఒత్తిడి చేశారు. దీంతో సత్తిబాబు వద్ద సమయానికి డబ్బులు లేకపోవడంతో ఈ రోజు, రేపు అంటూ కాలాన్ని వెల్లదీస్తూ వచ్చాడు. ఇక రాను రాను అప్పి ఇచ్చిన వ్యక్తులు టార్చర్ పెట్టడంతో సత్తిబాబుకు, అతని భార్యకు ఏం చేయాలో అర్థం కాలేదు.
ఇదే విషయం కూతురు నీలిమకు కూడా తెలియడంతో తరుచు బాధపడేది. ఈ క్రమంలోనే సత్తిబాబుకు అప్పు తీర్చే మార్గం కనిపించలేదు. ఇక చేసేదేంలేక ఇటీవల సత్తిబాబు, సూర్య కుమారి, కూతురు నీలిమా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కొందరు స్థానికులు వెంటనే అప్రమత్తమే కుమారుడు సంతోష్ కు తెలియజేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఆ యువకుడు.. ముగ్గురుని ఆస్పత్రికి తరలించాడు. ఇక చికిత్స పొందుతూ తాజాగా తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోగా, సోదరి నీలిమా పరిస్థితి విషమంగా మారింది. కన్నవాళ్లు ప్రాణాలు కోల్పోవడంతో సంతోష్ గుండెలు పగిలేలా ఏడ్చాడు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకుని గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: తల్లిని మందలించిన తండ్రి.. మనస్తాపంతో కుమార్తె..!