iDreamPost
android-app
ios-app

వీడియో: రూ.15 కోసం దారుణానికి పాల్పడ్డ వ్యక్తి

వీడియో: రూ.15 కోసం దారుణానికి పాల్పడ్డ వ్యక్తి

మాములుగా కొందరు వ్యక్తులు తెలిసిన వారికి, స్నేహితులకు, బంధువులకు అప్పులు ఇస్తుంటారు. ఇక తీసుకున్న డబ్బులు తిరిగిచ్చే క్రమంలో ఆలస్యంగా ఇచ్చినా, అసలు ఇవ్వకపోయిన ఇద్దరు గొడవపడి చివరికి దాడులు చేసుకుంటారు. ఇలాంటి ఘటనలు చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. కానీ, ఓ వ్యక్తి మాత్రం కేవలం రూ.15 కోసం ఏకంగా దుకాణదారుడిపై దారుణానికి పాల్పడ్డాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ లోని ఓ ప్రాంతంలో అజయ్ రాయ్ గుప్తా అనే వ్యక్తి కిరాణ షాపు నడిపిస్తున్నాడు. ఇయితే ఈ షాపుకు ఇటీవల స్థానిక బీజేపీ కౌన్సిలర్ శంకర్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. రూ.15లు ఇచ్చి రూ.30 విలువ చేసే సిగరెట్లు కొన్నాడు. ఈ క్రమంలోనే మిగతా రూ.15 ఇవ్వాలని అజయ్ గుప్తా శంకర్ ను అడిగాడు. దీంతో అతడు కోపంతో ఊగిపోయి అతనిపై మాటల దాడి చేశాడు. ఇంతటితో సరిపెట్టకుండా మిగిలిన డబ్బులు అడిగినందుకు అజయ్ రాయ్ గుప్తాపై దాడికి దిగాడు.

ఇదే కాకుండా… గంజాయి అమ్ముతున్నావని కేసులు పెట్టించి జైలుకు పంపిస్తానని బెదిరించాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్.. కేవలం రూ.15ల కోసం ఇలా అన్యాయంగా దుకాణదారుడిపై దాడి చేయడం కరెక్ట్ కాదని, ఇతడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet