Uppula Naresh
వీళ్లిద్దరూ అక్కా చెల్లెళ్లు. ఓ ఆశ్రమంలో గత 15 ఏళ్ల నుంచి ఉంటున్నారు. అయితే ఇటీవల వీళ్లు ఆశ్రమంలో ఊహించని నిర్ణయం తీసుకున్నారు. అసలేం జరిగిందంటే?
వీళ్లిద్దరూ అక్కా చెల్లెళ్లు. ఓ ఆశ్రమంలో గత 15 ఏళ్ల నుంచి ఉంటున్నారు. అయితే ఇటీవల వీళ్లు ఆశ్రమంలో ఊహించని నిర్ణయం తీసుకున్నారు. అసలేం జరిగిందంటే?
Uppula Naresh
పైన కనిపిస్తున్న వీరి పేర్లు ఏక్తా, శిఖా. వీళ్లిద్దరూ అక్కా చెల్లెళ్లు. చాలా కాలంగా ఓ ఆశ్రమంలో నివాసం ఉంటున్నారు. అయితే ఈ సోదరీమణులు అందరితో కలసి మెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవాళ్లు. ఆ ఆశ్రమంలో ఈ అక్కా చెల్లెళ్లతో మిగతా వాళ్లు కూడా బాగానే ఉండేవారు. కట్ చేస్తే.. ఇటీవల ఓ రోజు అర్థరాత్రి ఈ సోదరీమణులు ఇద్దరు కలసి ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీరు తీసుకున్న ఈ డెసిషన్ తో ఆశ్రమంలోని అందరూ షాక్ గురవుతున్నారు. దీంతో పాటు ఆ ఫోటోలను వాట్సాప్ గ్రూపుల్లో పంపించారు. వీటిని చూసి అందరూ నమ్మలేకపోతున్నారు. ఈ అక్కా చెల్లెళ్లు ఇలా చేశారేంటి అని అంతా చర్చించుకుంటున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇంతకు ఈ అక్కా చెల్లెళ్లు ఏం చేశారు? అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ అగ్రా లోని జాగ్నీర్ ప్రాంతం. ఇక్కడే ఉన్న బ్రహ్మకుమారి ఆశ్రమంలో ఏక్తా (38), శిఖా (32) అనే అక్కా చెల్లెళ్లు నివాసం ఉంటున్నారు. అయితే వీళ్లు గత 15 సంవత్సరాల నుంచి ఇదే ఆశ్రమంలో ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే.. ఈ సోదరీమణులు గతంలో ఈ ఆశ్రమం నిర్మాణానికి కొందరు వ్యక్తులు వీరి వద్ద నుంచి ఏకంగా రూ.25 లక్షల వరకు అప్పు తీసుకున్నట్లు సమాచారం. ఇదే విషయంపై ఏక్తా, శిఖా వారితో గొడవ పడుతున్నట్లు తెలుస్తోంది. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో వీరి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. దారుణంగా మోసపోయామని గ్రహించిన ఈ అక్కా చెల్లెళ్లు చివరికి చేసేదేం లేక చనిపోవాలని అనుకున్నారు.
ఇందులో భాగాంగానే ఇటీవల ఓ రోజు రాత్రి ఆశ్రమంలో అందరూ నిద్రపోయింది చూశారు. ఇదే మంచి సమయం అనుకుని ఈ అక్కా చెల్లెళ్లు.. ఆశ్రమంలో ఆత్మహత్య చేసుకున్నారు. వెంటనే స్పందించిన సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే వాళ్లు ప్రాణాలు కోల్పోయారు. అయితే అంతకంటే ముందు.. ఈ అక్కా చెల్లెళ్లు మా ఆత్మహత్యకు నీరజ్ అగర్వాల్, గుడ్డన్ తోపాటు తారా చంద్ అనే వ్యక్తులు కారణమని ఏక్తా మూడు పేజీలు, శిఖ ఒక పేజీల సూసైట్ నోట్ రాసుకున్నారు. వీటినే ఫోటోలు తీసుకుని బ్రహ్మకుమారి వాట్సాప్ గ్రూప్ లో సెండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆశ్రమంలోని సిబ్బంది షాక్ కు గురయ్యారు.
అనంతరం ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంతా పరిశీలించి ఈ అక్కా చెల్లెళ్ల మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుడ్డన్, తారా చంద్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఇక మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఉన్నట్టుండి ఈ అక్కా చెల్లెళ్లు ఆత్మహత్య చేసుకోవడంతో ఆశ్రమ సిబ్బంది, స్థానికులు షాక్ గురవుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.