iDreamPost
android-app
ios-app

కాబోయే భార్యపై యువకుడు దారుణం.. అందరూ చూస్తుండగానే!

  • Published Jul 11, 2023 | 8:54 PM Updated Updated Jul 11, 2023 | 8:54 PM
  • Published Jul 11, 2023 | 8:54 PMUpdated Jul 11, 2023 | 8:54 PM
కాబోయే భార్యపై యువకుడు దారుణం.. అందరూ చూస్తుండగానే!

ఉత్తర్ ప్రదేశ్ బదౌన్ కు చెందిన 19 ఏళ్ల యువతిని 23 ఏళ్ల యువకుడికి ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఇక ఇరువురి కుటుంబ సభ్యులు పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కట్ చేస్తే.. కాబోయే భార్యపై యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. వారి ఇంటి సమీపంలో అందరూ చూస్తుండగానే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ ఘటనతో స్థానికులు అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇంతకు కాబోయే భార్యను ఆ యువకుడు ఏం చేశాడు? అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ గురుగ్రామ్ పరిధిలోని బదౌన్ కు చెందిన ఓ 19 ఏళ్ల యువతి స్థానికంగా ఓ ఇంట్లో పని చేస్తుండేది. ఆ యువతిని ఆమె తల్లిదండ్రులు ఇదే ప్రాంతానికి చెందిన ఓ 23 ఏళ్ల యువకుడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూశారు. గత నెలలో నిశ్చితార్థం కూడా జరిపించారు. కట్ చేస్తే.. ఏదో కారణంతోనే వీరి పెళ్లి రెండు రోజుల కిందట క్యాన్సిల్ అయింది. ఆ యువకుడికి మా కూతురుని ఇవ్వమని ఆ యువతి తల్లిదండ్రులు చెప్పినట్లు సమాచారం. దీంతో ఆ యువకుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. పరువు పోయిందని భావించిన ఆ యువకుడు.. ఎలాగైన ఆ యువతిని హత్య చేయాలని అనుకున్నాడు.

ఇక ఇందులో భాగంగానే అతడు తాజాగా ఆ యువతి ఇంటికి వెళ్లాడు. ఆమెతో మాట్లాడుతున్నట్లు నటించి అందరూ చూస్తుండగానే తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆ యువతిని పొడిచాడు. ఆమె కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, ఫలితం లేకపోవడంతో ఆ యువతి రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆ యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇదే ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomgrandpashabetşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet giriş