iDreamPost
android-app
ios-app

పెళ్లి కావడం లేదని షాకింగ్ డెసిషన్! యువకుడి చేసిన పనికి అంతా షాక్!

పెళ్లి కావడం లేదని షాకింగ్ డెసిషన్! యువకుడి చేసిన పనికి అంతా షాక్!

నేటి కాలంలో కొందరు యువతి, యువకులు చదువు, ఉద్యోగాల పేరుతో వయసు పెరిగిపోతున్నా పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. ఇక మరి కొందరు యువకులు మాత్రం రక రకాల కారణాలతో ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే ఓ యువకుడు మాత్రం.. నాకు ఇంకా వివాహం కావడం లేదని ఎవరూ ఊహించని పని చేసి అందరికీ షాకిచ్చాడు. ఇతడు చేసిన దానికి పోలీసులు సైతం నోళ్లు తెరిచారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇంతకు ఆ యువకుడు ఏం చేశాడో తెలుసా?

పొలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ కౌశాండి జిల్లా మహేవాఘాట్ పరిధిలోని ఓ ప్రాంతంలో చోటు (27) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు గత కొంత కాలంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ, అమ్మాయిని ఇవ్వడానికి ఏ ఒక్కరూ కూడా ముందుకు రాలేదు. దీంతో ఆ యువకుడు ఇతని ఇంటి సమీపంలో ఉన్న శివలింగాన్ని రోజూ పూజించేవాడు. అయినా ఆ యువకుడికి పెళ్లి మాత్రం జరగలేదు. ఇక నాకు పెళ్లి కాదేమోనని అనుకున్నాడు. ఇవన్నీ తలుచుకుని చింటు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. పూజించిన ఆ దేవుడు కూడా నా కోరిక తీర్చేలేదన్న కోపంతో అతడు ఎవరూ ఊహించని పని చేశాడు. అతను పూజలు చేసిన శివలింగాన్నే మాయం చేశాడు. ఆ గుడిలో శివలింగం కనిపించకపోవడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగింది నిజమే అని తెలుసుకున్నారు.

ఇక ఇందులో భాగంగానే పోలీసులు అనుమానితులను విచారించగా.. శివలింగాన్ని మాయం చేసింది పెళ్లికాని ప్రసాద్.. చింటు అని తెలుసుకున్నారు. ఎందుకు ఆ శివలింగాన్ని మాయం చేశావని పోలీసులు ప్రశ్నించగా.. పెళ్లి కావాలని ఆ శివలింగానికి రోజూ పూజలు చేశానని, కానీ.., ఆ దేవుడు నా కోరిక నెరవేర్చలేదు. ఇదే కోపంతో ఆ శివలింగాన్ని మాయం చేశానని పోలీసులకు వివరించాడట. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు చింటుని అరెస్ట్ చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పెళ్లి కావడం లేదని పూజించిన దేవుడిని మాయం చేసిన ఇతగాడి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabet