iDreamPost
android-app
ios-app

భార్య బంధువుల టార్చర్ భరించలేక యువకుడు దారుణం!

భార్య బంధువుల టార్చర్ భరించలేక యువకుడు దారుణం!

భార్యాభర్తల అన్నాక గొడవలు జరగడం సర్వ సాధారణం. కానీ, ఇంత దానికే కొందరు దంపతులు ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఓ వ్యక్తి భార్య తరుఫు బంధువులు టార్చర్ భరించలేక తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరు జిల్లా దెందులూరు గ్రామంలో తేజమూర్తి (26)-ప్రియాంక దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి మూడు నెలల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొన్ని రోజుల పాటు ఈ భార్యాభర్తలు సంతోషంగానే ఉన్నారు. కొన్నాళ్లకి ఈ దంపతుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో చాలా రోజుల నుంచి గొడవలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రియాంక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరికీ కౌన్స్ లింగ్ ఇచ్చారు. అయినా ప్రియాంక అస్సలు వెనకడుగు వేయలేదు. దీనికి తోడు ఎస్ఐ సైతం కేసు విషయంలో తేజమూర్తిని వేధించినట్లుగా తెలుస్తుంది. ఇక ఇవన్నీ తట్టుకోలేని ఆ వ్యక్తి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇలాంటి బతుకు నాకు ఎందుకు అనుకున్నాడో ఏమో గానీ.. సోమవారం తెల్లవారు జామున దెందులూరు రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు.

దీన్ని గమనించిన కొందరు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తేజమూర్తి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం అతడి వద్ద దొరికిన సూసైడ్ నోట్ సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఏముందంటే? నేను నిన్ను(భార్య ప్రియాంక) ప్రేమించాను. జరగనిది జరిగినట్లు నిందలు వేయడాన్ని తట్టుకోలేకపోతున్నాను. నా మృతికి కారణం.. ప్రియాంక తండ్రి తవ్వ సత్యనారాయణ, అక్క సౌజన్య, మావయ్య సురేష్. మా బంధువులు అందరూ నా తల్లిని జాగ్రత్తగా చూసుకోండి అంటూ తేజమూర్తి పేర్కొన్నాడు8. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtarafbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis